Jump to content

నికితా పోర్వాల్

వికీపీడియా నుండి
నికితా పోర్వాల్
అందాల పోటీల విజేత
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇండియా 2024

నికితా పోర్వాల్ (ఆంగ్లం: Nikita Porwal; జననం 2001 నవంబరు 16), ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 కిరీటాన్ని గెలుచుకున్న భారతీయ అందాల పోటీ టైటిల్ హోల్డర్. నికితా మిస్ వరల్డ్ 2026 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.[1][2][3][4][5]

తొలినాళ్ళ జీవితం, కెరీర్

[మార్చు]

నికిత మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అశోక్ పోర్వాల్, రాజకుమారి పోర్వాల్ దంపతులకు పుట్టి పెరిగింది. ఆమె ఉజ్జయినిలోని కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం నుండి థియేటర్‌లో బ్యాచిలర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది. ఆమె 18 సంవత్సరాల వయసులో టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. నాటకరంగలోకి అడుగుపెట్టిన నికిత 60కి పైగా నాటకాల్లో ప్రదర్శన ఇచ్చింది, "కృష్ణలీల" అనే 250 పేజీల నాటకాన్ని కూడా రాసింది. ఆమె చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, చంబల్ పార్ అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది, ఇది అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది.[6][7][8]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Nikita Porwal crowned Femina Miss India 2024: A journey of grace". news9live.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-16.
  2. ↑ "Who is Femina Miss India Madhya Pradesh 2024, Nikita Porwal? Learn now!". femina.in (in ఇంగ్లీష్). 28 August 2024.
  3. ↑ "Femina Miss India World 2024 Is Nikita Porwal From Madhya Pradesh". timesnownews.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-16.
  4. ↑ "Nikita Porwal of Madhya Pradesh wins Femina Miss India 2024!". femina.in (in ఇంగ్లీష్). 17 October 2024.
  5. ↑ "దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్‌..! (ఫొటోలు)". Sakshi. Retrieved 2026-04-05.
  6. ↑ "Who is Nikita Porwal, crowned as the Femina Miss India 2024? Everything You Need to Know!". jagranjosh.com (in ఇంగ్లీష్). 17 October 2024.
  7. ↑ "Who is Nikita Porwal, the winner of Femina Miss India 2024 from Madhya Pradesh". hindustantimes.com (in ఇంగ్లీష్). 17 October 2024.
  8. ↑ "Meet Nikita Porwal, Aishwarya Rai's fan, Miss India 2024 winner". dnaindia.com (in ఇంగ్లీష్). 17 October 2024.