నికోబార్ జిల్లా
నికోబార్ జిల్లా | |
---|---|
నిర్దేశాంకాలు: 9°09′26″N 92°45′40″E / 9.157343°N 92.761087°ECoordinates: 9°09′26″N 92°45′40″E / 9.157343°N 92.761087°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | అఁడమాన్ నికోబార్ |
రాజధాని | కార్ నికోబార్ |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 744301 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 03192 |
లింగ నిష్పత్తి | 1.2 |
అక్షరాస్యత | 84.4% |
జాలస్థలి | www |
బంగాళాఖాతం నికోబార్ జిల్లా స్థానం | |
భూగోళశాస్త్రం | |
---|---|
ప్రదేశం | బంగాళాఖాతం |
ద్వీపసమూహం | నికోబార్ దీవులు |
ప్రక్కన గల జలాశయాలు | హిందూ మహాసముద్రం |
మొత్తం ద్వీపాలు | 30 |
ముఖ్యమైన ద్వీపాలు | |
విస్తీర్ణం | 1,648.13 కి.మీ2 (636.35 చ. మై.)[1] |
అత్యధిక ఎత్తు | 642 m (2,106 ft) |
జనాభా వివరాలు | |
జనాభా | 36,842 (2011) |
జన సాంద్రత | 22.3 /km2 (57.8 /sq mi) |
జాతి సమూహాలు | హిందూ, నికోబరీస్ |
అదనపు సమాచారం | |
Avg. summer temperature | 30.2 °C (86.4 °F) |
Avg. winter temperature | 23.0 °C (73.4 °F) |
Census Code | 35.638.0001 |
Official Languages | హిందీ, ఆంగ్లం, కార్ భాష (ప్రాంతీయ భాష) |
నికోబార్ జిల్లా, భారతదేశ కేంద్ర భూభాగం అండమాన్, నికోబార్ దీవులలోని మూడు జిల్లాలలో నికోబార్ జిల్లా ఒకటి.[2]ఈ జిల్లా పరిపాలనా భూభాగం హిందూ మహాసముద్రంలో ఉన్నబంగాళాఖాతంలోని అండమాన్ సముద్రం మధ్య దీవులుగా కలిగి ఉంది.దీని జిల్లా ప్రధాన కార్యాలయం కార్ నికోబార్ ద్వీపంలో ఉన్న మలక్కా గ్రామం.జిల్లా పరిపాలన డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో సాగుతుంది. అతను అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా నివేదిస్తాడు.ఇది దేశంలోని 640 జిల్లాలలో ఐదవ అతి తక్కువ జనాభా కలిగిన జిల్లాగా నమోదైంది.[3][
పేరు వెనుక చరిత్ర[మార్చు]
దక్షిణ భారతదేశం / శ్రీలంక ఆగ్నేయాసియా మధ్య సముద్ర మార్గంలో ప్రయాణించిన సముద్ర ప్రయాణికులు దీనిని "నగ్న భూమి" అని పిలిచేవారు, అనగా ప్రత్యక్ష పూర్వగామి నక్కవర్.అయితే ప్రస్తుత పేరు "నికోబార్" గా స్థిరపడింది.మధ్యయుగంలో అరబిక్ పేరు ‘లంకహాబాటస్’. “నంకకర్ లేదా నక్కవర్” అని తప్పుగా అర్ధం చేసుకోవడంవలన ఉచ్చరించబడింది,.
చరిత్ర, భౌగోళికం[మార్చు]
ఈ జిల్లా 1974, ఆగష్టు 1 న అండమాన్ జిల్లా నుండి విభజింపబడింది.[4][5]మారిషస్‌తో పోల్చితే,[6] నికోబార్ జిల్లా 1,648 చదరపు కిలోమీటర్ల (636 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది.[7]
జనాభా[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం నికోబార్ జిల్లా జనాభా 36,842గా ఉంది.[2]ఇది సుమారుగా లిచ్టెన్‌స్టెయిన్ దేశానికి సమానం.భారతదేశ మొత్తం జనాభా ర్యాంకులు 640 లో ఇది 636 వ ర్యాంకుగా నమోదైంది.[2] జిల్లాలో చ.కి.మీ.కు 20 మంది జనాభా సాంద్రత ఉంది.[2] 2001-2011 దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు -12.48%. [2] నికోబార్ జిల్లా ప్రతి 1000 మంది పురుషులకు లింగ నిష్పత్తి 778గా ఉంది.అక్షరాస్యత రేటు 77.5%గా ఉంది.[2]
భాషలు[మార్చు]
ఆస్ట్రోయాసియాటిక్ భాషా కుటుంబానికి చెందిన నికోబారీస్ నికోబార్ దీవులలో ఎక్కువ మంది మాట్లాడే భాష. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభాలో నికోబరీస్ మొదటి భాషగా 65.98 శాతం మంది మాట్లాడతారు. తరువాత హిందీ (9.83%), తమిళం (6.10%), తెలుగు (4.05%), బెంగాలీ (3.90%), కురుఖ్ (3.31%) ), మలయాళం (1.79%) ఇతర భాషలు మాట్లడేవారు (5.01%) శాతం మంది ఉన్నారు.
ఈ జిల్లాను గిరిజన జిల్లాగా ప్రకటించబడింది.గణనీయమైన సంఖ్యలో స్వదేశీ ప్రజలు (నికోబరీస్, షాంపెన్, జాతులను భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ తెగలుగా వర్గీకరించబడ్డారు) నివాసంగా ఉన్నారు. వీరు జిల్లా జనాభాలో ఎక్కువ భాగం ఉన్నారు. గిరిజన ప్రాంతంగా ఉన్నందున, జిల్లాకు ప్రయాణించడం భారతీయ పౌరులకు మాత్రమే పరిమితం చేయబడింది.ఇతరులకు ప్రత్యేక అనుమతి పరిమితులు వర్తిస్తాయి.
2004 హిందూ మహాసముద్రం భూకంపం వల్ల సంభవించిన సునామీ కారణంగా జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది.దాని ఫలితంగా ఇది అనేక మరణాలకు దారితీసింది.మౌలిక సదుపాయాలను దెబ్బతీసింది.
చారిత్రక జనాభా వివరాలు[మార్చు]
భారత జనాభా లెక్కల ప్రకారం నికోబార్ దీవుల జిల్లాలో 1901 నుండి 2011 వరకు జనాభా పెరుగదల,తరుగుదల వివరాలు ఈ దిగువ పట్టికలో వివరించిన ప్రకారం ఉన్నాయి.[8]
వ.సంఖ్య | సంవత్సరం | జనాభా | సంవత్సరానికి
పెరుగుదల శాతం |
సంవత్సరానికి
తరుగుదల శాతం |
---|---|---|---|---|
1 | 1901 | 6,511 | - | - |
2 | 1911 | 8,818 | (+) 3.08% | - |
3 | 1921 | 9,272 | (+) 0.50% | - |
4 | 1931 | 10,240 | (+) 1.00% | - |
5 | 1941 | 12,452 | (+) 1.98% | - |
6 | 1951 | 2,009 | - | (-) 0.36% |
7 | 1961 | 14,563 | (+) 1.95% | - |
8 | 1971 | 21,685 | (+) 4.05% | - |
9 | 1981 | 30,454 | (+) 3.46% | - |
10 | 1991 | 39,208 | (+) 2.56% | - |
11 | 2001 | 42,068 | (+) 0.71% | - |
12 | 2011 | 36,842 | (+) 1.32% | - |
పరిపాలనా విభాగాలు[మార్చు]
2016 నాటికి నికోబార్ జిల్లాను 3 ఉప విభాగాలు, 7 తాలూకాలు (తహసిల్స్) గా విభజించారు.[9]
కార్ నికోబార్ విభాగం[మార్చు]
- కార్ నికోబార్ తాలూకా - ప్రధాన కార్యాలయం
నాన్కోరి విభాగం[మార్చు]
- నాన్‌కౌరీ తాలూకా
- కమోర్తా తాలూకా
- తెరెసా - చౌరా తాలూకా
- కచ్చల్ తాలూకా
గ్రేట్ నికోబార్ విభాగం[మార్చు]
- కాంప్‌బెల్ బే తాలూకా
- చిన్న నికోబార్ తాలూకా
మూలాలు[మార్చు]
- ↑ "Islandwise Area and Population - 2011 Census" (PDF). Government of Andaman. Archived from the original (PDF) on 2017-08-28. Retrieved 2016-05-09.
- ↑ 2.0 2.1 2.2 "Nicobars (Nicobar) District Population Census 2011-2020, Andaman And Nicobar Islands literacy sex ratio and density". www.census2011.co.in. Retrieved 2020-11-03.
- ↑ https://web.archive.org/web/20170828015509/http://andssw1.and.nic.in/ecostat/basicstatPDF2013_14/1.Demogrpahy.pdf
- ↑ "India Districts". www.statoids.com. Retrieved 2020-11-03.
- ↑ "History | District Nicobar, Government of Andaman and Nicobar | India" (in ఇంగ్లీష్). Retrieved 2020-11-03.
- ↑ Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Andaman Islands: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), భారత ప్రభుత్వం. p. 1208. ISBN 978-81-230-1617-7.CS1 maint: extra text: authors list (link)
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11.
Mauritius 1,836km2
- ↑ https://www.censusindia.gov.in/2011census/PCA/A-2_Data_Tables/35%20A-2%20Andaman%20&%20Nicobar%20Islands.pdf
- ↑ "List of Tehsils in Nicobars District | villageinfo.in". villageinfo.in. Retrieved 2020-11-03.
వెలుపలి లంకెలు[మార్చు]
- Pages with non-numeric formatnum arguments
- CS1 ఇంగ్లీష్-language sources (en)
- CS1 maint: extra text: authors list
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- Articles using infobox islands with additional info
- అండమాన్ నికోబార్ దీవుల జిల్లాలు
- అండమాన్ నికోబార్ దీవులు
- నికోబార్ జిల్లా