నికోలా టెస్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నికోలా టెస్లా
నికోలా (1856-1943), సుమారు 1893.
జననం(1856-07-10)1856 జూలై 10
స్మిల్యాన్, ఆస్ట్రియా సామ్రాజ్యం
(en:Military Frontier), ప్రస్తుతపు క్రొయేషియా
మరణం1943 జనవరి 7(1943-01-07) (వయసు 86)
న్యూయార్క్, న్యూయార్క్, అ.సం.రా
నివాసంఆస్ట్రియా సామ్రాజ్యం
హంగేరీ సామ్రాజ్యం
ఫ్రాన్స్
USA
పౌరసత్వంఆస్ట్రియా సామ్రాజ్యం (pre-1891)
అమెరికన్ (post-1891)
జాతిసెర్బియన్
రంగములుమెకానికల్ and ఎలక్ట్ర్రికల్ ఇంజనీరింగ్
వృత్తిసంస్థలుEdison Machine Works
en:Tesla Electric Light & Manufacturing
Westinghouse Electric & Manufacturing Co.
ప్రసిద్ధిటెస్లా కాయిల్
టెస్లా టర్బైన్
టెలిఫోర్స్
en:Tesla's oscillator
en:Tesla electric car
en:Tesla principle
en:Tesla's Egg of Columbus
ఆల్టర్నేటింగ్ కరెంట్
ఇండక్షన్ మోటార్
రొటేటింగ్ మాగ్నెటిక్ ఫీల్డ్
వైర్లెస్ టెక్నాలజీ
పార్టికల్ బీమ్ వెపన్
డెత్ రే
en:Terrestrial stationary waves
en:Bifilar coil
en:Telegeodynamics
en:Electrogravitics
ప్రభావితం చేసినవారుఎర్నెస్ట్ మాష్
ప్రభావితులుగనో డన్
ముఖ్యమైన పురస్కారాలుఎడిసన్ మెడల్ (1916)
en:Elliott Cresson Gold Medal (1893)
en:John Scott Medal (1934)
సంతకం

నికోలా టెస్లా (ఆంగ్లం : Nikola Tesla) (1856 జూలై 10 - 1943 జనవరి 7) ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. నికోలా, ప్రస్తుతము క్రొయేషియాలో ఉన్న స్మిల్యాన్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు పుట్టుకతో సెర్బియన్. తర్వాత కాలంలో అమెరికా పౌరుడు అయ్యాడు.[1] ఇతడు తరచూ 'ధరణిపై కాంతిని విరజిమ్మిన' ఆధునిక యుగానికి చెందిన గొప్ప శాస్త్రవేత్తగా, ఆవిష్కర్తగా కీర్తించబడ్డాడు.[2] 19వ శతాబ్దాంతంలో, 20వ శతాబ్దపు ఆరంభంలో విద్యుత్, అయస్కాంతత్వాలకు సంబంధించిన పరిశోధనలలో విప్లవాత్మకమైన విషయాలను అందించిన శాస్త్రవేత్త. నికోలా టెస్లా పేటెంట్లు, పరిశోధనా విషయాలు ఆధునిక విద్యుచ్ఛక్తి, ఎలక్ట్రిక్ మోటార్లు వంటి విషయాల అభివృద్ధికి దోహదపడడం ద్వారా రెండవ పారిశ్రామిక విప్లవానికి నాంది పలికాయి.

1894లో వైర్‌లెస్ కమ్మ్యూనికేషన్ (రేడియో) ప్రదర్శన వల్ల అమెరికాలోని ఎలక్ట్రికల్ ఇంజనీర్లలో గొప్ప వ్యక్తిగా గుర్తించబడ్డాడు.[3] టెస్లా ఆవిష్కరణలు ఆధునిక ఎలక్టికల్ ఇంజనీరింగ్ విభాగానికి మార్గదర్శకాలయ్యాయి.

ఈ కాలంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో టెస్లా కీర్తి చరిత్రలో మరే ఇతర ఆవిష్కర్త లేదా శాస్త్రవేత్తతో పోల్చదగ్గదిగా[4] ఉన్నప్పటికీ అతని అసాధారణ వ్యక్తిత్వం, సాధ్యమైన శాస్త్రీయ, సాంకేతిక పరిణామాల గురించి నమ్మశక్యం కాని, కొన్నిసార్లు వికారమైన వాదనలు కారణంగా, టెస్లా చివరికి బహిష్కరించబడ్డాడు. అతను పిచ్చి శాస్త్రవేత్తగా పరిగణించబడ్డాడు.[5] [6] తన ఆర్థిక విషయాలపై ఎప్పుడూ ఎక్కువ దృష్టి పెట్టని టెస్లా 86 సంవత్సరాల వయసులో పేదరికంతో మరణించాడు.

అతస్కాత అభివాహ సాంద్రత లేదా అయస్కాంత ప్రేరణ (సాధారణంగా అయస్కాత క్షేత్రం "B" గా సుపరిచితం) ఎస్.ఐ ప్రమాణం నకు అతని గౌరవార్థం "టెస్లా" గా నామకరణం చేసారు. అదే విధంగా టెస్లా 1893 లోనే తక్కువ స్థాయిలో (లైట్‌బల్బులు) ప్రదర్శించాడు. అసంపూర్తిగా ఉన్న తన వార్డెన్‌క్లిఫ్ టవర్ ప్రాజెక్టులో పారిశ్రామిక శక్తి స్థాయిలను ఖండాంతరాలకు ప్రసారం చేయాలని ఆకాంక్షించాడు. దీని ఫలితంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు వైర్‌లెస్ శక్తి బదిలీ టెస్లా ప్రభావం మూలంగా జరుగుతుంది.

అతను విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ యాంత్రిక ఇంజనీరింగ్ విభాగాల్లో చేసిన కృషి ఫలితంగా రోబోటిక్స్, రిమోట్ కంట్రోల్, రాడార్, కంప్యూటర్ విజ్ఞానం, బాలిస్టిక్స్, కేంద్రక భౌతిక శాస్త్ర రంగాలలో పురోగతి సాధించగలిగింది.[7] 1943 లో యునైటెడ్ స్టేట్స్ లోని సుప్రీంకోర్టు అతన్ని రేడియో ఆవిష్కర్తగా పేర్కొంది.[8]

జీవితం[మార్చు]

ఆరంభం[మార్చు]

నికోలా టెస్లా పుట్టిన ఇల్లు, క్రొయేషియాలోని స్మిల్యాన్ గ్రామంలో నికోలా విగ్రహం.
23 సం. వయస్సులో టెస్లా (సిర్కా.1879)

నికోలా సెర్బియన్ దంపతులకు క్రొయేషియాలోని స్మిల్యాన్ గ్రామంలో జన్మించాడు. అతను సరిగ్గా ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు అర్ధరాత్రి జన్మించాడని ఒక కథనం ఉంది. ఇతని బాప్తిస్మపు ధ్రువీకరణ పత్రం ప్రకారం 28 జూన్ (N.S. 10, జూలై), 1856 న జన్మించినట్టు, ఈయన తండ్రి మిలుటిన్ టెస్లా, స్రెమ్స్కీ కార్లోవ్చీ పట్టణప్రాంతంలోని సెర్బియన్ ఆర్తోడాక్స్ చర్చిలో మతప్రచారకుడు, తల్లి, డూకా మాండిక్ గా పేర్కొనబడినది. ఈయన తండ్రి తరఫు వంశం వారు తారా లోయ లోని స్థానిక సెర్బు తెగకు చెందిన వారైనా లేదా హెర్జిగీవ్నియన్ నోబుల్ పావ్లే ఓర్లొవిక్ సంతతికి చెందిన వారైనా అయ్యుంటారని భావన.[9] టెస్లా తల్లి డూకా, కోసావో ప్రాంతం నుండి వచ్చి లీకా, బంజియా ప్రాంతాలలో స్థిరపడిన కుటుంబానికి చెందినది. ఈమె తండ్రి సెర్బియన్ ఆర్తోడాక్స్ చర్చిలో మతప్రచారకుడు. ఈమె గృహాలంకారణ పనిముట్లు తయారు చేయటంలో ప్రావీణ్యం కలది. ఈమె అనేక సెర్బియా పౌరాణిక గేయాలను కూడా కంఠతా వల్లించేది కానీ ఎప్పుడూ చదవటం, వ్రాయటం నేర్చుకోలేదు.[10]

నికోలా ఐదుగురు సంతానంలో నాలుగవవాడు. ఈయనకు ఒక అన్న (డేన్, నికోలాకు ఐదేళ్లున్నప్పుడు గుర్రపుస్వారీ ప్రమాదంలో మరణించాడు), ముగ్గురు సోదరీమణులు (మిల్కా, ఆంజెలీనా,మరికా).[11]: 3  ఈయన కుటుంబం 1862లో గాస్పిక్‌కు తరలివెళ్ళింది. టెస్లా కార్లొవాక్ లో చదువుకున్నాడు. నాలుగేళ్ళలో పూర్తి చేయాల్సిన విద్యను మూడేళ్ళలోనే పూర్తిచేశాడు.[12]

టెస్లా ఆ తర్వాత 1875లో గ్రాజ్ లోని ఆస్ట్రియన్ పాలిటెక్నిక్ (ఇప్పుడది గ్రాజ్ సాంకేతిక విశ్వవిద్యాలయం) లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగు పూర్తిచేశాడు అక్కడుండగా ఆల్టర్నేటింగు కరెంటు యొక్క ఉపయోగాలను అధ్యయనం చేశాడు. కొన్ని మూలాలు ఈయన గ్రాజ్ విశ్వవిద్యాలయం నుండి బాచిలరేట్ పట్టా పొందాడని చెబుతున్నవి.[13][14][15] అయితే, విశ్వవిద్యాలయం మాత్రం టెస్లా పట్టభద్రుడు కాలేదని, మూడో సంవత్సరపు మొదటి అర్ధభాగంలో తరగతి గదిలో జరిగే పాఠాలకు హాజరవటం మానేశాడని, ఆ తరువాత చదువు కొనసాగించలేదని చెబుతున్నది.[16][17][18][19] 1878 డిసెంబరులో తన కుటుంబంతో తెగతెంపులు చేసుకొని గ్రాజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. స్నేహితులు ఈయన ముర్ నదిలో మునిగిపోయాడని భావించారు. మారిబోర్ (ప్రస్తుతం స్లొవేనియాలో ఉన్నది) కు వెళ్ళి తొలుత ఒక సంవత్సరం పాటు సహాయ ఇంజనీరుగా ఉద్యోగం చేశాడు. ఈ సమయంలోనే మనోవ్యధకు గురయ్యాడు. ఆ తరువత టెస్లా తండ్రి ప్రోద్బలంతో ప్రాగ్ లోని చార్లెస్ ఫెర్డినాండ్ విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడ 1880 వేసవిలో చదువుకున్నాడు. అక్కడ ఎర్నెస్ట్ మాక్ చే ప్రభావితుడయ్యాడు. కానీ, తండ్రి మరణించిన తర్వాత, కేవలం ఒకే టర్ము పూర్తి చేసిన తర్వాత విశ్వవిద్యాలయాన్ని వదిలిపెట్టాడు.[20]

టెస్లా అనేక పుస్తకాలు, శాస్త్రీయ రచనలు చదవటం ప్రారంభించాడు. తన ఏకసంథాగ్రాహ్యంతో అమాంతం పుస్తకాలు పుస్తకాలనే వళ్ళెవేయటం ప్రారంభించాడు.[21]

మరింత చదవటానికి[మార్చు]

ప్రచురణలు[మార్చు]

పుస్తకాలు[మార్చు]

పత్రికలు[మార్చు]

 • Carlson, W. Bernard, "Inventor of dreams". Scientific American, March 2005 Vol. 292 Issue 3 p. 78(7).
 • Jatras, Stella L., "The genius of Nikola Tesla". The New American, 28 July 2003 Vol. 19 Issue 15 p. 9(1)
 • Rybak, James P., "Nikola Tesla: Scientific Savant". Popular Electronics, 1042170X, November 1999, Vol. 16, Issue 11.
 • Lawren, B., "Rediscovering Tesla". Omni, March 1988, Vol. 10 Issue 6.

చిత్రసమాహారం[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

 1. BBC News "Electrical pioneer Tesla honoured"
 2. Nikola Tesla, genije koji je obasjao svet, produced by Ljubo Vujovic, presented by Time Warner and RCN: quoted also in Ogledalo journal, July 2008
 3. "Serbian Unity Congress | 150 Years of Nikola Tesla". Archived from the original on 2009-11-19. Retrieved 2009-05-12.
 4. Harnessing the Wheelwork of Nature: Tesla's Science of Energy by Thomas Valone
 5. Robert Lomas (1999-08-21). "Spark of genius". Independent Magazine. Archived from the original on 2008-06-23. Retrieved 2008-07-29.
 6. David Hatcher Childress, ed. (2000). The Tesla Papers: Nikola Tesla on Free Energy & Wireless Transmission of Power. Kempton, IL: Adventures Unlimited Press. ISBN 0932813860.
 7. Cheney, Margaret, "Tesla: Man Out of Time", 1979. ISBN 0-7432-1536-2. Front cover flap
 8. U.S. Supreme Court, "Marconi Wireless Telegraph co. of America v. United States". 320 U.S. 1. Nos. 369, 373. Argued 9-12 April 1943. Decided 21 June 1943.
 9. Obrad Mićov Samardžić (1992). "Porijeklo Samardžića i ostalih bratstava roda Orlovića",. Mostar. ISBN 86-82271-53-2.
 10. Seifer, "Wizard" p. 7
 11. Margaret Cheney, Robert Uth, and Jim Glenn, "Tesla, Master of Lightning". Barnes & Noble Publishing, 1999. ISBN 0-7607-1005-8.
 12. Walker, E. H. (1900). Leaders of the 19th century with some noted characters of earlier times, their efforts and achievements in advancing human progress vividly portrayed for the guidance of present and future generations. Chicago: A.B. Kuhlman Co., p, 474.
 13. Wysock, W.C.; J.F. Corum, J.M. Hardesty and K.L. Corum (22 October 2001). "Who Was The Real Dr. Nikola Tesla? (A Look At His Professional Credentials)" (PDF). Antenna Measurement Techniques Association, posterpape. Archived from the original (PDF) on 26 మార్చి 2009. Retrieved 12 మే 2009.
 14. "The Book of New York: Forty Years' Recollections of the American Metropolis" says he matriculated 4 degrees (physics, mathematics, mechanical engineering and electrical engineering)
 15. Harper's Encyclopædia of United States History from 458 A.D. to 1906. Harper & brothers 1905. Page 52.
 16. Nikola Tesla: the European Years Archived 2011-07-24 at the Wayback Machine, D. Mrkich
 17. Wohinz, Josef W. (16 May 2006). "Nikola Tesla und Graz". Technischen Universität Graz. Retrieved 2006-01-29.
 18. Wohinz, Josef W. (Ed,) (2006). Nikola Tesla und die Technik in Graz. Graz, Austria: Verlag der Technischen Universität Graz. p. 16. ISBN 3-902465-39-5; ISBN 978-3-902465-39-9 .{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
 19. Kulishich, Kosta (27 August 1931). "Tesla Nearly Missed His Career as Inventor: College Roommate Tells". Newark News.. Cited in Seifer, Marc, The Life and Times of Nikola Tesla, 1996
 20. Seifer, Marc (1996). Wizard: The Life and Times of Nikola Tesla; Biography of a Genius. Secaucus, NJ: Carol Publishing Group. ISBN.
 21. Cheney, Margaret (2001). Tesla: Man Out of Time. Simon and Schuster. ISBN 0743215362. Retrieved 2007-06-17.
 22. Dr. Nikola Tesla (1856-1943) (OCLC 1284808 : LCCN 56047430 /L), by Leland I. Anderson

మూలాలు[మార్చు]

 • Margaret Cheney, Robert Uth, and Jim Glenn, "Tesla, Master of Lightning", published by Barnes & Noble, 1999. ISBN 0-7607-1005-8.
 • Germano, Frank, "Dr. Nikola Tesla". Frank. Germano.com.
 • Lomas, Robert, "The Man who Invented the Twentieth Century". Lecture to South Western Branch of Instititute of Physics.
 • Martin, Thomas Commerford, "The Inventions, Researches, and Writings of Nikola Tesla", New York: The Electrical Engineer, 1894 (3rd Ed.); reprinted by Barnes & Noble, 1995
 • O'Neill, John J., "Prodigal Genius: The Life of Nikola", 1944. ISBN (Tesla reportedly said of this biographer "You understand me better than any man alive"; also the version at uncletaz.com with other items at uncletaz's site)
 • Penner, John R.H. The Strange Life of Nikola Tesla, corrupted version of My Inventions.
 • Pratt, H., "Nikola Tesla 1856–1943", Proceedings of the IRE, Vol. 44, September, 1956.
 • "Nikola Tesla". IEEE History Center, 2005.
 • Seifer, Marc J. "Wizard: The Life and Times of Nikola Tesla; Biography of a Genius", Secaucus, NJ: Carol Publishing Group, 1996. ISBN
 • Weisstein, Eric W., "Tesla, Nikola (1856–1943)". Eric Weisstein's World of Science.
 • "Gazetteer of Planetary Nomenclature", Moon Nomenclature: Crater. USGS, Astrogeology Research Program.
 • Dimitrijevic, Milan S., "Belgrade Astronomical Observatory Historical Review". Publ. Astron. Obs. Belgrade,), 162–170. Also, "Srpski asteroidi, Tesla". Astronomski magazine.
 • Hoover, John Edgar, FOIA FBI files, 1943.
 • Pratt, H., "Nikola Tesla 1856–1943", Proceedings of the IRE, Vol. 44, September, 1956.
 • W.C. Wysock, J.F. Corum, J.M. Hardesty and K.L. Corum, "Who Was The Real Dr. Nikola Tesla? (A Look At His Professional Credentials)". Antenna Measurement Techniques Association, posterpaper, 22 October–25, 2001 (PDF)
 • Roguin, Ariel, "Historical Note: Nikola Tesla: The man behind the magnetic field unit". J. Magn. Reson. Imaging 2004;19:369–374. © 2004 Wiley-Liss, Inc.
 • Sellon, J. L., "The impact of Nikola Tesla on the cement industry". Behrent Eng. Co., Wheat Ridge, CO. Cement Industry Technical Conference. 1997. XXXIX Conference Record., 1997 IEEE/PC. Page (s) 125–133. ISBN
 • Valentinuzzi, M.E., "Nikola Tesla: why was he so much resisted and forgotten?" Inst. de Bioingenieria, Univ. Nacional de Tucuman; Engineering in Medicine and Biology Magazine, IEEE. July/August 1998, 17:4, pp. 74–75. ISSN
 • Waser, André, "Nikola Tesla’s Radiations and the Cosmic Rays". (PDF)
 • Secor, H. Winfield, "Tesla's views on Electricity and the War", Electrical Experimenter, Volume 5, Number 4, August, 1917.
 • Florey, Glen, "Tesla and the Military". Engineering 24, 5 December 2000.
 • Corum, K. L., J. F. Corum, "Nikola Tesla, Lightning Observations, and Stationary Waves". 1994.
 • Corum, K. L., J. F. Corum, and A. H. Aidinejad, "Atmospheric Fields, Tesla's Receivers and Regenerative Detectors". 1994.
 • Meyl, Konstantin, H. Weidner, E. Zentgraf, T. Senkel, T. Junker, and P. Winkels, "Experiments to proof the evidence of scalar waves Tests with a Tesla reproduction". Institut für Gravitationsforschung (IGF), Am Heerbach 5, D-63857 Waldaschaff.
 • Anderson, L. I., "John Stone Stone on Nikola Tesla’s Priority in Radio and Continuous Wave Radiofrequency Apparatus". The Antique Wireless Association Review, Vol. 1, 1986, pp. 18–41.
 • Anderson, L. I., "Priority in Invention of Radio, Tesla v. Marconi". Antique Wireless Association monograph, March 1980.
 • Marincic, A., and D. Budimir, "Tesla's contribution to radiowave propagation". Dept. of Electron. Eng., Belgrade Univ. (5th International Conference on Telecommunications in Modern Satellite, Cable and Broadcasting Service, 2001. TELSIKS 2001. pp. 327–331 vol.1)
 • Page, R.M., "The Early History of Radar", Proceedings of the IRE, Volume 50, Number 5, May, 1962, (special 50th Anniversary Issue).
 • C Mackechnie Jarvis "Nikola Tesla and the induction motor". 1970 Phys. Educ. 5 280–287.
 • "Giant Eye to See Round the World" (DOC)
 • Nichelson, Oliver, "Nikola Tesla's Latter Energy Generation Designs", A description of Tesla's energy generator that "would not consume fuel." 26th IECEC Proceedings, 1991, Boston, MA (American Nuclear Society) Vol. 4, pp. 433–438.
 • Nichelson, Oliver, "The Thermodynamics of Tesla's Fuelless Electrical generator". A theory of the physics of Tesla's new energy generator. (American Chemical Society, 1993. 2722-5/93/0028-63)
 • Toby Grotz, "The Influence of Vedic Philosophy on Nikola Tesla's Understanding of Free Energy".

బయటి లింకులు[మార్చు]