నిఖిల్ బెనర్జీ
పండిట్ నిఖిల్ బెనర్జీ | |
|---|---|
| Background information | |
| Born | 1931 అక్టోబరు 14 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
| Origin | కలకత్తా, భారతదేశం |
| Died | 1986 జనవరి 27 (వయసు: 54) |
| Genres | హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం |
| Occupations | స్వరకర్త, సితార్ వాద్యకారుడు |
| Instruments | సితార్ |
పండిట్ నిఖిల్ రంజన్ బెనర్జీ (1931 అక్టోబరు 14 - 1986 జనవరి 27), ఒక భారతీయ శాస్త్రీయ సితారిస్ట్. పండిట్ రవిశంకర్, ఉస్తాద్ విలాయత్ ఖాన్ లతో పాటు, అతను సితార్ ప్రముఖ ప్రతిపాదకులలో ఒకడిగా అవతరించాడు. ఆయన భారత పౌర పురస్కారం పద్మభూషణ్ గ్రహీత.[1]
అల్లావుద్దీన్ ఖాన్, అలీ అక్బర్ ఖాన్, అమీర్ ఖాన్‌లచే, ఇంకా కొంతమేర ఓంకారనాథ్ ఠాకూర్, ఫయాజ్ ఖాన్, కేసర్‌బాయి కేర్కర్, రోషనారా బేగంలచే ఆయన ప్రభావితుడయ్యాడు.
కెరీర్
[మార్చు]1947లో, బెనర్జీ అల్లావుద్దీన్ ఖాన్‌ను కలిసాడు, అతను తన కుమారుడు అలీ అక్బర్ ఖాన్‌తో పాటు అతనికి ప్రధాన గురువు అయ్యాడు. ఇద్దరూ సరోద్ వాద్యకారులు. బెనర్జీ అల్లావుద్దీన్ ఖాన్ కచేరీలకు వెళ్ళేవాడు. అల్లావుద్దీన్ ఖాన్ బెనర్జీకి ప్రధాన గురువు. అతను మైహార్ విడిచిపెట్టిన తర్వాత చాలా సంవత్సరాలు అల్లావుద్దీన్ ఖాన్ కుమారుడైన అలీ అక్బర్ ఖాన్ నుండి కూడా నేర్చుకున్నాడు.
ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ కేవలం వాయించే మెళకువనే కాకుండా, మైహార్ ఘరానా సంగీత పరిజ్ఞానాన్ని, దృక్పథాన్ని కూడా అందిస్తూ ఉండేవాడు. దీంతో, బెనర్జీ విభిన్న సితార్ శైలులను అభివృద్ధి చేసుకున్నాడు.
ఆయన భారతీయ సంగీతంలోని రాగం, లయ అంశాలలో తనకున్న ప్రావీణ్యానికి ప్రసిద్ధి చెందాడు. ఆయన ప్రత్యేకమైన సితార్ శైలిలో పరిపూర్ణత, భావోద్వేగం, గాంభీర్యం మిళితం అయి ఉంటాయి.
గుర్తింపు
[మార్చు]- బెనర్జీ "సాంకేతికత ఒక అద్భుతం, చిరుతల కంటే వేగవంతమైనది, డాలర్ కంటే సురక్షితమైనది" అని శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ కొనియాడింది.
- మ్యూజిక్ అండ్ మ్యూజిషియన్స్ పత్రిక అతని ప్రదర్శనలు ఎల్లప్పుడూ పూర్తిగాసహజసిద్ధంగా వినిపిస్తాయని పేర్కొంది.
- న్యూయార్క్ టైమ్స్ అతని లయబద్ధమైన ఆలోచనలు, పదబంధాలలోని అసాధారణమైన సరళత, నిశ్చయత ఒక ప్రమాణాన్ని నెలకొల్పాయని అంది.
మూలాలు
[మార్చు]- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. the original (PDF) నుండి 15 October 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 July 2015.