Jump to content

నిజాం కళాశాల

వికీపీడియా నుండి
(నిజాం కాలేజీ నుండి దారిమార్పు చెందింది)
నిజాం కళాశాల
నిమ్స్
రకంసార్వత్రిక
స్థాపితం1887
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ప్రాంగణంపట్టణ ప్రాంతం
అనుబంధాలుఉస్మానియా విశ్వవిద్యాలయం
జాలగూడుఅధికారిక జాలగూడు

నిజాం కళాశాల హైదరాబాదు నగరంలో పేరొందిన ఉన్నత విద్యా సంస్థ, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయం. నిజాం కళాశాల 1887లో ఆరవ అసఫ్‌జాహీ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలనలో స్థాపించబడింది. ఇది హైదరాబాదులోని బషీర్‌బాగ్ ప్రాంతంలో ఉంది.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

నిజాం కళాశాల ప్రస్తుతం 120 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరిగాయి. సంవత్సరం పొడుగునా జరిగిన ఈ సంబరాలకు 2008 ఫిబ్రవరి 20న కళాశాల పూర్వవిద్యార్థి అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కేతిరెడ్డి సురేష్‌రెడ్డి జండా ఊపి ఉద్ఘాటన చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆరంభోత్సవాలలో అనేకమంది పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.

చరిత్ర

[మార్చు]

ప్రస్తుతం ఉన్న ప్రధాన కళాశాల భవనం హైదరాబాదు నగర ప్రముఖులలో ఒకడైన ఫక్రుల్ ముల్క్ II మహలు. హైదరాబాదు పాఠశాల (నోబుల్ పాఠశాల), మద్రసా-ఏ-ఆలియాలను కలిపి నిజాం కళాశాలను స్థాపించాడు. కళాశాల స్థాపకుడు, విద్యావేత్త అయిన నవాబ్ ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ, సరోజినీ నాయుడు తండ్రి అయిన డా. అఘోరనాథ్ ఛటోపాధ్యాయను ఏరికోరి కళాశాల తొలి ప్రిన్సిపాలుగా నియమించాడు.

అనుబంధాలు

[మార్చు]

ప్రారంభంలో ఇది మద్రాస్ విశ్వవిద్యాలయానికి 60 సంవత్సరాలు అనుబంధంగా ఉంది. 1947 ఫిబ్రవరి 19 న, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంద కళాశాలగా మార్చబడింది.[1] ఈ కళాశాల నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో నేటి రాజకీయ నాయకులు, వైద్యులు చాలా మంది ఈ చారిత్రక కళాశాల నుండి వెళ్ళారు.[2]

కొత్త భవనాలు

[మార్చు]

కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు వసతి కల్పించకపోవడంపై 2022 అక్టోబరు- నవంబరులో నిజాం కళాశాల విద్యార్థులు కళాశాలలో ఆందోళన చేపట్టారు. దాంతో రాష్ట్ర ఐటీ-మున్సిపల్‌-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించి సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చాడు.[3] వసతి నిర్మాణం కోసం ప్రభుత్వం తరపున 5 కోట్ల రూపాయలు మంజూరు చేశాడు.[4]

ఇచ్చిన మాట ప్రకారం, కళాశాలలో వసతి, కొత్త భవనాలకు 2023, ఆగస్టు 12న మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎల్‌.రమణ, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, విశ్వవిద్యాలయ వీసీ డి.రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.[5][6]

ప్రముఖ పూర్వవిద్యార్ధులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Nizam College Hyderabad - Institution in Hyderabad, Attractions in Hyderabad Andhra-Pradesh". web.archive.org. 2016-01-30. ఒరిజినల్ నుండి 2016-01-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Nizam College, Nizam College, Hyderabad". web.archive.org. 2011-09-01. ఒరిజినల్ నుండి 2017-12-10 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Today, Telangana (2022-11-08). "KTR responds to Nizam College students protest, urges Education Minister to address issues". Telangana Today. the original నుండి 2022-11-08 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-08-17.
  4. "ఆ విద్యార్థుల సమస్యకు వెంటనే ముగింపు పలకండి: మంత్రి కేటీఆర్". ETV Bharat News. 2022-11-08. ఒరిజినల్ నుండి 2023-08-17 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-08-17.
  5. "KTR lays foundation for Nizam College boys hostel". www.deccanchronicle.com. 2023-08-13. the original నుండి 2023-08-13 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-08-17.
  6. Today, Telangana (2023-08-12). "KT Rama Rao lays foundation stone for classroom complex and boys hostel at Nizam College". Telangana Today. the original నుండి 2023-08-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-08-17.

బయటి లింకులు

[మార్చు]