నిజామాబాద్ నార్త్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజామాబాద్ నార్త్
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నిజామాబాద్ నార్త్ స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నిజామాబాద్ నార్త్ స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నిజామాబాద్ నార్త్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం నిజామాబాదు
గ్రామాలు 2
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం km² (3.5 sq mi)
జనాభా
 - మొత్తం 1,57,584
 - పురుషులు 78,464
 - స్త్రీలు 79,120.
పిన్‌కోడ్ {{{pincode}}}

నిజామాబాద్ నార్త్ మండలం తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం. [1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిజామాబాదు, అర్సపల్లి (పార్టు) పట్టణ ప్రాంతాలతో ఈ మండలం ఏర్పడింది. [2] ప్రస్తుతం ఈ మండలం నిజామాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. మండల కేంద్రం నిజామాబాదు.

గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 9 చ.కి.మీ. కాగా, జనాభా 157,584. జనాభాలో పురుషులు 78,464 కాగా, స్త్రీల సంఖ్య 79,120. మండలంలో 33,308 గృహాలున్నాయి.[3]

2016 లో ఏర్పడిన కొత్త మండలం

[మార్చు]

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నిజామాబాదు, అర్సపల్లి (పార్టు) పట్టణ ప్రాంతాలతో ఈ మండలం ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి రెండు నిజామాబాదు నగర పరిధిలో చేరిన పట్టణ ప్రాంతాలు.[2]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అర్సపల్లి (పాక్షికం)
  2. కంటేశ్వర్

మండలంలో దర్శించదగిన ఆలయాలు

[మార్చు]

నీలకంఠేశ్వరాలయం: మండలంలోని కంటేశ్వర్ లో కొండపై నీలకంఠేశ్వర ఆలయం ఉంది.ఇది 16 వశతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది.[4] ఈ ఆలయాన్ని రాష్ట్రంలోని  వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని జైనుల కోసం శాతవాహన రాజు శాతకర్ణి -2 నిర్మించాడు. ఈ నిర్మాణాం ఉత్తర భారతీయ నిర్మాణ శైలితో దగ్గరి పోలిక ఉంది. రథ సప్తమి పండుగ ఈ ఆలయంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం.మహారాష్ట్రలోని నాందేడ్ నుండి రహదారి ద్వారా ఇక్కడకి చేరుకోవచ్చు.[5]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-07-24.
  2. 2.0 2.1 "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "SRI NEELAKANTESHWARA TEMPLE - TRAVEL INFO". Trawell.in. Retrieved 2020-01-19.
  5. "శ్రీ నీలకంటేశ్వర టెంపుల్, Nizamabad". telugu.nativeplanet.com. Retrieved 2020-01-19.

వెలుపలి లంకెలు

[మార్చు]