నిడదవోలు మాలతి
నిడదవోలు మాలతి | |
---|---|
నిడదవోలు మాలతి చిత్రం | |
జననం | నిడదవోలు మాలతి జూన్ 26, 1937 విశాఖపట్నం. |
విద్య | ఆంగ్ల భాష లో ఎం.ఏ. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ లైబ్రరీ సైన్స్ లో ఎం.ఎ |
వృత్తి | రచయిత్రి |
ఉద్యోగం | తిరుపతిలో లైబ్రేరియన్ (1973 కంటె ముందు 9 సంవత్సరాలు) |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత్రి |
పిల్లలు | ఒక కుమార్తె, సరయు రావు బ్లూ |
తల్లిదండ్రులు | నిడదవోలు జగన్నాథరావు నిడదవోలు శేషమ్మ |
వెబ్‌సైటు | tethulika |
నిడదవోలు మాలతి ప్రముఖ తెలుగు రచయిత్రి, కథకురాలు, సాహిత్య విమర్శకురాలు, తెలుగు ఉపాధ్యాయులు.[1][2] పంథొమ్మిదివందల యాభైల్లో కథలు వ్రాయడం మొదలు పెట్టి ఇప్పడు తన స్వంత వెబ్ పత్రికలు తెలుగు, ఇంగ్లిష్ తూలికలు నిర్వహిస్తూ, దాదాపు వంద తెలుగు కథల్ని ఇంగ్లిష్ లోకి అనువదించి, ఇంగ్లిష్ లో మూడు అనువాద కథా సంకలనాలు. The Spectrum of My People ( జైకో బుక్స్) “From My Front Porch” (సాహిత్య అకాడెమీ ప్రచురణ) All I Wanted Was to Read and Other Stories (e-Book) వెలువరించారు.
జీవిత విశేషాలు[మార్చు]
నిడదవోలు మాలతి ఆంగ్లభాష, సాహిత్యం లలో మాస్టర్స్ డిగ్రీలు చేసారు. ఆమె లైబ్రరీ సైన్స్ లోనూ ఎం.ఎ. చేసారు. ఆమె లఘు కథా రచయిత్రిగా సుపరిచితురాలు. ఆమె 9 సంవత్సరాల పాటు తిరుపతిలో లైబ్రేరియన్ గా 1964-1973 మధ్య పనిచేసారు. 1973 నుండి అమెరికాలో ఉంటున్నారు. ఆమె 1978-2005 మధ్య కాలంలో యు.డబ్ల్యూ-మాడిసన్ లో తెలుగు భాషను రెండవ భాషగా బోధించారు[3]. ఆమె [1]ను ప్రారంభించారు. ఈ అంతర్జాల వేదిక ఎందరో సాహితీపరులకు ఉపయోగపడుతోంది.[4]
సాహితీ సేవలు[మార్చు]
పంథొమ్మిదివందల యాభైల్లో కథలు వ్రాయడం మొదలు పెట్టి ఇప్పడు తన స్వంత వెబ్ పత్రికలు తెలుగు, ఇంగ్లీష్ తూలికలు నిర్వహిస్తూ, దాదాపు వంద తెలుగు కథల్ని ఇంగ్లిష్ లోకి అనువదించి, ఇంగ్లిష్ లో మూడు అనువాద కథా సంకలనాలు. The Spectrum of My People ( జైకో బుక్స్) “From My Front Porch” (సాహిత్య అకాడెమీ ప్రచురణ) All I wanted was to Read and Other Stories వెలువరించారు. మొదటి రెండూ ప్రసిద్ధ రచయితల తెలుగు కథలకు ఆమె చేసిన ఇంగ్లిష్ అనువాదాలు కాగా మూడవది తన తెలుగు కథలకు ఆమె ఇంగ్లిష్ అనువాదం. ఇవి కాక Quiet and Quaint: Telugu Women's Writing: 1950-1975 – అనే పుస్తకాన్ని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. .తెలుగులో “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” అనే కథా సంకలనం 44 కథలతో 2005 లో వచ్చింది.
సత్కారాలు, పురస్కారాలు[మార్చు]
1968లో 1969లో ఆంధ్రరచయిత్రులసభలో, ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో సత్కారం
1970. ఏప్రిల్ 10 ఆంధ్రజ్యోతి ఉగాది కథల పోటీలో తృష్ణ కథ ప్రత్యేక బహుమతి. యలమంచిలి ఝాన్సీ లక్ష్మీ హిందీలోనికి అనువదించి ఆంధ్రప్రదేశ్ మేగజైన్ ఏప్రిల్-మే 1971 సంచికలో ప్రచురించారు.
1971. చిరుచక్రం కథ ఆంధ్రజ్యోతి ఉగాది కథలపోటీలో ప్రథమబహుమతి. ఏప్రిల్ 2, 1971 లో ప్రచురించబడింది. నిరుపమ కన్నడలోకి అనువదించి సుధ పత్రిక, జూన్ 13, 1971 సంచికలో ప్రచురించారు.
2022. సిరికోన సాహిత్యపీఠం, కోడూరు పార్వతి స్మారక పురస్కారంతో, జ్ఞాపికతో సత్కరించేరు. సెప్టెంబరు 10, 2022. విడియో లింక్ https://www.youtube.com/watch?v=4r94rzrvexc
2023 మొల్ల పురస్కారం. మార్చి 11, 2023. విడియో లింక్ https://www.youtube.com/watch?v=SPKR5VzQWQM
.
తూలిక[మార్చు]
తెలుగు భాషా, సంస్కృతి, సాహిత్యాల గురించి తెలుగేతర పాఠకులకు పరిచయం చేయవలెనని, తెలుగువారిగురించి గల అపోహలను మార్చవలెనని ప్రయత్నం చేస్తూ "తూలిక" ([5] ) ను జూన్ 2001లో మొదలుపెట్టి నిరంతరాయంగా ఒంటి చేత్తో నడుపుకుంటూ వస్తున్నారు.ఎవరి నుంచి ఒక పైసా సహాయం పొందకుండా, ఎవరి ప్రోత్సాహం, తోడ్పాటు లేకుండా, తాను నమ్మిన దాన్ని ఆచరణలో చూపిస్తూ అందరికీ ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు సాహిత్యానికి నిస్వార్థంగా తూలిక చేస్తున్న కృషి పట్ల తోటి సాహిత్యాకారుల, తెలుగు సంఘాల ద్వంద్వ వైఖరిని గురించి ఎన్నో సార్లు, ఎన్నో సందర్భాల్లో తన ఆవేదన ను, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు[6] తూలికలో ఆమె వ్యాసాలని అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాలలో తెలుగు పరిశోధకులు, తెలుగులు కానివారు చూడడం, వాటిని తమసైటుల్లో పెట్టుకోడం, రిఫరెన్సులివ్వడం చూసేక, క్రమేణా మన కథలద్వారా విదేశీయులకి మనసంస్కృతిగురించి తెలియజేయడం అనే నిర్దుష్టమైన ధ్యేయం ఆమెలో రూపు దిద్దుకుంది.[7]
- తూలిక.నెట్ కేవలం తెలుగుకథలకే అంకితమై, తెలుగు కథలనీ, కథకులనీ ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రారంభించిన సైటు. ఆ నియమానికి కట్టుబడి ఉన్న సైటు.
- కథలఎంపికలో చెప్పుకోదగ్గ భిన్నత్వం ఉంది. ఆమె ఎంచుకునే కథలు తెలుగుజాతిని విడిగా నిలబెట్టేవి, తనదైన, మనకే ప్రత్యేకమయిన విలువలూ, సంస్కృతి, ఆచారాలూ, సంప్రదాయాలు – ఇవి ఆవిష్కరించే కథలు.[7]
తూలిక ప్రస్థానం[7][మార్చు]
- తూలిక.నెట్ ప్రారంభించింది జూన్ 2001లో
- అనువదించిన కథలు ఇప్పటివరకుః 150. ఇందులో శారద (ఆస్ట్రేలియా) అనువదించినవి 10,
- ఇతర అనువాదకులు చేసినవి 10.
- ఆమె రాసిన పరిశీలనాత్మక, విశ్లేణాత్మక వ్యాసాలుః 25.
- ఇతరుల రచయితలవ్యాసాలు (వేరే సైటుల్లో ప్రచురించినవి తూలికలో పునర్ముద్రించినవి 3.
- ఆమె తూలికకోసం అనువదించినవి. 3.
- సంకలనాలు: 52 కథల అనువాదాలు 3 సంకలనాల్లో వచ్చేయి. ప్రచురణకర్తలు జైకో, కేంద్ర సాహిత్య ఎకాడమీ (బెంగుళూరు విభాగం), లేఖిని సాహిత్య సాంస్కృతిక సంస్థ (హైదరాబాదు.).
- కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన మునిపల్లె రాజు గారి అస్తిత్వనదం ఆవలితీరాన కథా సంకలనం అనువాదం కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురిస్తున్నది (In press).
రచనలు[మార్చు]
నవలలు[8][మార్చు]
- మార్పు నవల – మొత్తం నాలుగు భాగాలు
- చాతకపక్షులు
కథా సంకలనాలు[మార్చు]
- కథామాలతి 1
- కథామాలతి 2
- కథామాలతి 3
- కథామాలతి 4
- కథామాలతి 5
- ఎన్నెమ్మకతలు మొదటి భాగం
- ఎన్నెమ్మకతలు రెండో భాగం
వ్యాస సంకలనాలు[మార్చు]
- వ్యాసమాలతి మొదటి సంపుటము
- వ్యాసమాలతి రెండవ సంపుటము
- వ్యాసమాలతి మూడవ సంపుటము
ఆంగ్ల రచనలు[మార్చు]
- Telugu Women Writers, 1950-1975, Analytical study.
- Eminent scholars and other essays (anthology of articles published on thulika.net.)
- All I Wanted was to Read (short stories)
- My Little friend (short stories)
కల్పనా రెంటాలతో చేసిన చర్చ ఆడియో[మార్చు]
- కథావిమర్శ
ఇతర విశేషాలు
మాలతికథలపై ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారి పర్యవేక్షణలో బోనాల సుబ్బలక్ష్మి పరిశోధన చేసి, ఆంధ్రా యూనివర్సిటీనుండి యం.ఫిల్. పట్టా పొందేరు 2004లో.
వ్యక్తిగత జీవితం[మార్చు]
ఆమె కుమార్తె సరయు రావు భ్లూ అమెరికాలో ప్రముఖ నటి[9]
చిత్రమాలిక[మార్చు]
కాళీపట్నం రామారావుతో కథానిలయంలో నిడదవోలు మాలతి
మూలాలు[మార్చు]
ఇతర లింకులు[మార్చు]
- Malathi Nidadavolu: Native Element in Telugu Stories
- రాగం...భూపాలం
- అమెరికా జీవితం వల్ల తేడాలు తెలిశాయి : నిడదవోలు మాలతి ముఖాముఖి
- శీలా సుభద్రాదేవి. నిడదవోలు మాలతి రచనాసౌరభాలు. హైదరాబాద్. అస్త్ర ప్రచురణలు. 2022
- ↑ "SASLI Faculty". Archived from the original on 2015-08-22. Retrieved 2015-08-13.
- ↑ Malathi Nidadavolu
- ↑ Mālati, Niḍadavōlu. - Catalog - University of Wisconsin–Madison
- ↑ "author's profile in muse.india". Archived from the original on 2014-04-14. Retrieved 2015-08-13.
- ↑ "తెలుగు కథల ఇంగ్లీష్ అనువాదాల సైట్". Archived from the original on 2015-08-02. Retrieved 2015-08-13.
- ↑ "తెలుగు కథ నాడి '[[తూలిక]]' -సారంగ సాహిత్యవార పత్రికలో ఇంటర్వ్యూ". Archived from the original on 2015-03-22. Retrieved 2015-08-13.
- ↑ 7.0 7.1 7.2 "తెలుగు కథ నాడి తూలిక". magazine.saarangabooks.com/. Archived from the original on 22 మార్చి 2015. Retrieved 8 May 2013.
- ↑ "నా సాహిత్యం (pdf లో)". Archived from the original on 2015-04-19. Retrieved 2015-08-13.
- ↑ "
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Infobox person using residence
- Pages using infobox person with conflicting parameters
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- తెలుగు రచయిత్రులు
- తెలుగు కథా రచయితలు
- సాహితీకారులు
- అమెరికా వ్యక్తులు
- ఉత్తమ ఉపాధ్యాయులు
- ఆదర్శ ఉపాధ్యాయులు
- ఆదర్శ వనితలు
- తెలుగు అనువాదకులు
- 1937 జననాలు
- తెలుగు వికీపీడియా సభ్యులు
- విశాఖపట్నం జిల్లా రచయిత్రులు
- అమెరికాలోని భారతీయులు
- తెలుగువారిలో ఇంగ్లీషు రచయితలు
- తెలుగు నుండి ఆంగ్లం లోకి అనువాదాలు చేసినవారు