నితీష్ సేన్‌గుప్తా
| నితీష్ సేన్‌గుప్తా | |||
| పదవీ కాలం 1999–2004 | |||
| ముందు | సుధీర్ కుమార్ గిరి | ||
|---|---|---|---|
| తరువాత | ప్రశాంత ప్రధాన్ | ||
| నియోజకవర్గం | కంఠి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1934 సెప్టెంబరు 23 పలాంగ్, పుర్బా మేదినీపూర్, పశ్చిమ బెంగాల్ | ||
| మరణం | 2013 నవంబర్ 3 న్యూఢిల్లీ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | తృణమూల్ కాంగ్రెస్ | ||
| తల్లిదండ్రులు | నిర్మల్ సేన్‌గుప్తా, అర్పితా సేన్‌గుప్తా | ||
| జీవిత భాగస్వామి | సునంద సేన్‌గుప్తా | ||
| సంతానం | 2 కుమార్తెలు | ||
| నివాసం | పుర్బా మేదినీపూర్, పశ్చిమ బెంగాల్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
నితీష్ కుమార్ సేన్‌గుప్తా (23 సెప్టెంబర్ 1934 - 3 నవంబర్ 2013) భారతదేశానికి చెందిన విద్యావేత్త, రచయిత, రాజకీయ నాయకుడు. ఆయన 1999 లోక్‌సభ ఎన్నికలలో కంఠి లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
నితీష్ సేన్‌గుప్తా 1957లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరి భారత ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి & భారత ప్రణాళిక కమిషన్ సభ్య కార్యదర్శి వంటి పదవులను నిర్వహించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]నితీష్ సేన్‌గుప్తా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 లోక్‌సభ ఎన్నికలలో కంఠి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐటిసీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ (ఎం) అభ్యర్థి సుధీర్ కుమార్ గిరిపై 12,133 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2004 లోక్‌సభ ఎన్నికలలో ఎఐటిసీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ (ఎం) అభ్యర్థి ప్రశాంత ప్రధాన్ చేతిలో 59,190 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
మరణం
[మార్చు]నితీష్ సేన్‌గుప్తా 2013 నవంబర్ 3న న్యూఢిల్లీలో గుండెపోటుతో మరణించాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Nitish Sengupta" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. the original నుండి 21 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 July 2025.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. the original (PDF) నుండి 18 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 June 2014.
- ↑ "Former MP Nitish Sengupta Dead". Outlook India. 3 November 2013. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 November 2013.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "Ex-MP Nitish Sengupta passes away" (in ఇంగ్లీష్). Deccan Herald. 3 November 2013. the original నుండి 21 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 July 2025.