Jump to content

నితేష్ గంగా దేబ్

వికీపీడియా నుండి
నితేష్ గంగా దేబ్

పదవీ కాలం
2019 మే 23  2024 జూన్ 4
ముందు నాగేంద్ర కుమార్ ప్రధాన్
తరువాత ధర్మేంద్ర ప్రధాన్
నియోజకవర్గం సంబల్‌పూర్

పదవీ కాలం
2014 మే 25  2019 మే 22
ముందు సంజీబ్ కుమార్ ప్రధాన్
తరువాత సుభాష్ చంద్ర పాణిగ్రాహి
నియోజకవర్గం దేవ్‌గఢ్

పదవీ కాలం
2004 మే 15  2009 మే 19
ముందు సుభాష్ చంద్ర పాణిగ్రాహి
తరువాత సంజీబ్ కుమార్ ప్రధాన్
నియోజకవర్గం దేవ్‌గఢ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అరుంధతీ దేవి[1]
సంతానం నమన్ గంగా దేబ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం

నితేష్ గంగా దేబ్ (జననం 1972 జులై 22) ఒడిశాకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

నితేష్ గంగా దేబ్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2000లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికలలో దేవ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుభాష్ చంద్ర పాణిగ్రాహి చేతిలో 8,784 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుభాష్ చంద్ర పాణిగ్రాహిపై 13,881 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

నితేష్ గంగా దేబ్ 2009లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికలలో దేవ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి సంజీబ్ కుమార్ ప్రధాన్ చేతిలో 10,705 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2014 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి అనితా ప్రధాన్ పై 38,739 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

నితేష్ గంగా దేబ్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి నళిని కాంత ప్రధాన్ పై 9,162 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]ఆయనకు 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కలేదు.[4]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (17 April 2024). "Sambalpur BJP MP's wife, son join BJD" (in ఇంగ్లీష్). Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
  2. "Sambalpur Election result 2019: Nitesh Ganga Deb of BJP defeats BJD's Nalini Kanta Pradhan" (in ఇంగ్లీష్). Times Now. 24 May 2019. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. "MoS Tudu among 4 MPs dropped from Odisha, Pradhan to contest Sambalpur" (in ఇంగ్లీష్). The Indian Express. 25 March 2024. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.