నిత్యాశెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిత్యాశెట్టి
జననం
నిత్యాశెట్టి

వృత్తినటి, మోడల్, సాప్ట్వేర్ ఇంజనీర్, ఫ్యాషన్ డిజైనర్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

నిత్యాశెట్టి దక్షిణ భారత చలనచిత్ర నటీమణి, మోడల్. తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

నిత్యాశెట్టి హైదరాబాదులో జన్మించింది. నిత్యాశెట్టి ఇంజనీరింగ్‌లో విద్యను పూర్తిచేసి, ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నది.

సినిమారంగం

[మార్చు]

నిత్యాశెట్టి 2000ల ప్రారంభంలో తెలుగు చిత్రాలలో బాలనటిగా నటించింది. 2000వ సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవుళ్ళు సినిమాతో బాలనటిగా గుర్తింపుపొందింది. చిన్ని చిన్ని ఆశ (1998), లిటిల్ హార్ట్స్ (2000) చిత్రాలలో నటించినందుకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డును గెలుచుకున్నది.

నటిగా దాగుడుమూత దండాకోర్ (2015), పడేసావే (2016) చిత్రాలలో నటించింది.[2][3] తరువాత ఐవారట్టం (2015), కాదల్ కాలమ్ (2016) వంటి తక్కువ బడ్జెట్ తమిళ చిత్రాలలో నటించింది.[4] 2019లో తెలుగులో నువ్వు తోపురా, తమిళంలో అఘావాన్ మొదలైన చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
1999 చిన్ని చిన్ని ఆశ తెలుగు నంది ఉత్తమ బాలనటీమణులు
2000 దేవుళ్ళు భవాని తెలుగు
లిటిల్ హార్ట్స్ తెలుగు నంది ఉత్తమ బాలనటీమణులు
2001 మాయ మాయ హిందీ
2015 ఐవారట్టం తమిళం
దాగుడుమూత దండాకోర్ మధు తెలుగు
2016 పడేసావే నిహారిక తెలుగు
2017 కాదల్ కాలమ్ తమిళం
2019 అఘావాన్ తమిళం
2019 నువ్వు తోపురా[5] తెలుగు
2020 ఓ పిట్ట కథ తెలుగు

మూలాలు

[మార్చు]
  1. "From being a child artist to an actress - Telugu News". IndiaGlitz.com. 15 February 2016. Retrieved 12 December 2019.
  2. kavirayani, suresh (16 February 2016). "Nithya Shetty into the big league". Deccan Chronicle. Retrieved 12 December 2019.
  3. INDIA, THE HANS (1 February 2016). "Nithya Shetty comes of age". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 12 December 2019.
  4. subramanian, anupama (4 June 2015). "Nithya Shetty bags yet another meaty role". Deccan Chronicle. Retrieved 12 December 2019.
  5. ఈనాడు, సినిమా (3 May 2019). "రివ్యూ: నువ్వు తోపురా". Archived from the original on 12 డిసెంబరు 2019. Retrieved 12 December 2019.

ఇతర లంకెలు

[మార్చు]