నిద్ర రుగ్మత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sleep disorder
వర్గీకరణ & బయటి వనరులు
Projet endormi.jpg
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 26877
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH {{{m:en:MeshID}}}

నిద్ర రుగ్మత (Sleep disorder) అనేది ఒక వ్యక్తి లేదా జంతువులో నిద్ర ధోరణులకు సంబంధించిన వైద్యసంబంధ రుగ్మత. కొన్ని నిద్ర రుగ్మతలు సాధారణమైన శారీరక, మానసిక మరియు ఉద్వేగపరమైన విధులలో మార్పులు కలిగించేంత తీవ్రమైనవిగా ఉంటాయి. సామాన్యంగా కొన్ని నిద్ర రుగ్మతలను పరిశీలించేందుకు సూచించే పరీక్ష పాలీసోమ్నోగ్రఫీ.

నిద్రాభంగం అనేది పళ్ళు కొరకడం (బ్రక్సిజం) నుండి చీకటి భయాల వరకూ వివిధ కారణాల వలన సంభవించవచ్చు. స్పష్టమైన కారణం లేకుండా ఒక వ్యక్తికి నిద్ర పట్టక పోవడాన్ని, నిద్రలేమి అంటారు.[1] అంతేకాక, నిద్ర రుగ్మతల కారణంగా రోగులు అధికంగా కూడా నిద్రపోవడం జరుగుతుంది, ఈ స్థితిని హైపర్‍సోమ్నియా అంటారు. మానసిక, వైద్య, లేదా వస్తు దుర్వినియోగ రుగ్మతలు కాకుండా ద్వితీయ తరహా నిద్ర రుగ్మతల నిర్వహణలో ముఖ్యంగా కారణమైన పరిస్థితులను పరిశీలించవలసి ఉంటుంది.

సామాన్య రుగ్మతలు[మార్చు]

అతి సామాన్య నిద్ర రుగ్మతలు ఇవి:

 • ప్రాథమిక నిద్రలేమి: నిద్ర పట్టడంలో దీర్ఘకాలిక కష్టం మరియు/లేదా నిద్ర నిర్వహణ వంటి లక్షణాలకు స్పష్టమైన కారణం లేకపోవడం.
 • బ్రక్సిజం: నిద్రలో అసంకల్పితంగా పళ్ళు కొరకడం లేదా బిగబట్టడం.
 • డిలేయ్‍డ్ స్లీప్ ఫేజ్ సిండ్రోం (DSPS) : సాంఘికంగా అనుమతించబడిన సమయాలలో నిద్రించడం మరియు మేల్కొనడం లేకపోవడం, కానీ నిద్ర నిర్వహణలో సమస్య లేకపోవడం, ఇది రోజువారీ అలవాటులకు సంబంధించిన రుగ్మత. (అటువంటి ఇతర రుగ్మతలు అడ్వాన్స్‌డ్ స్లీప్ ఫేజ్ సిండ్రోం (ASPS), నాన్-24-అవర్ స్లీప్-వేక్ సిండ్రోం (నాన్-24), మరియు ఇర్రెగ్యులర్ స్లీప్ వేక్ రిథం, ఇవన్నీ సామాన్యంగా DSPS మరియు తాత్కాలిక జెట్ ల్యాగ్ మరియు షిఫ్ట్ వర్క్ నిద్ర రుగ్మతకన్నా తక్కువగా కనిపిస్తుంటాయి.)
 • హైపాప్నియా సిండ్రోం: నిద్రలో అసాధారణంగా నెమ్మదైన ఊపిరి లేదా మెల్లనైన శ్వాస క్రమం.
 • నార్కోలెప్సీ: సరికాని సమయాల్లో తక్షణమే కానీ అయిష్టంగా నిద్రపోయే పరిణామాలకు తరచూ దారితీసే ఎక్సెసివ్ డేటైం స్లీపినెస్ (EDS).
 • కాటాప్లెక్సీ: చలన కండరాలలో అకస్మాత్తుగా బలహీనత కలగడం వలన నేలకూలడం జరగవచ్చు.
 • చీకటి భయం: పవోర్ నాక్టర్నస్, నిద్రలో భయం రుగ్మత: భయం వలన కలిగే ప్రవర్తన కారణంగా అకస్మాత్తుగా నిద్ర నుండి లేవడం.
 • పారాసోమ్నియాలు: నిద్రలో అసాధారణ చర్యలకు దారితీసే భంగకర నిద్రా-సంబంధ సంఘటనలు; నిద్రలో నడక మరియు చీకటి భయాలు ఉదాహరణలు.
 • పీరియాడిక్ లింబ్ మూవ్‍మెంట్ డిజార్డర్ (PLMD) : నిద్రలో అకస్మాత్తుగా చేతులు మరియు/లేదా కాళ్ళు అసంకల్పితంగా కదిలించడం, ఉదాహరణకు కాళ్ళతో తన్నడం. దీనినే నాక్టర్నల్ మయోక్లోనస్ అంటారు. రుగ్మత కాని హిప్నిక్ జెర్క్, కూడా చూడండి.
 • రాపిడ్ ఐ మూవ్‍మెంట్ బిహేవియర్ డిజార్డర్ (RBD) : REM నిద్రలో హింసాత్మకమైన లేదా నాటకీయమైన కలలు కనడం.
 • రె‍స్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోం (RLS) : కాళ్ళు కదిలించాలనే ఆపుకోలేని కోరిక. RLS బాధితులకు తరచూ PLMD కూడా ఉంటుంది.
 • పరిస్థితులకు చెందిన రోజువారీ దినచర్య నిద్ర రుగ్మతలు: షిఫ్ట్ వర్క్ నిద్ర రుగ్మత (SWSD) మరియు జెట్ ల్యాగ్.
 • స్లీప్ ఆప్నియా, మరియు చాలావరకూ అబ్‍స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా: నిద్రలో శ్వాసకోశాల్లో అడ్డంకి వలన అవసరమైన మేరకు గాఢ నిద్ర కలుగకపోవడం; తరచూ గురక కూడా ఉంటుంది. స్లీప్ ఆప్నియా యొక్క ఇతర రూపాలు తక్కువగా కనిపిస్తాయి.
 • స్లీప్ పెరాలిసిస్: ఇందులో నిద్రకు మునుపు లేదా తరువాత శరీరం తాత్కాలికంగా బిగుసుకుపోవడం ఉంటుంది. స్లీప్ పెరాలిసిస్‍లో దృశ్య, శ్రవణ లేదా స్పర్శ సంబంధిత భ్రమలు కూడా ఉండవచ్చు. తీవ్రంగా ఉంటే తప్ప రుగ్మతగా పరిగణించబడదు. దీనిని తరచూ నార్కోలెప్సీలో భాగంగా భావిస్తారు.
 • నిద్రలో నడక లేదా సోమ్నాంబులిజం : వ్యక్తికీ స్పృహ లేకుండానే సాధారణంగా మెలకువగా ఉండేటప్పుడు చేసే చర్యలు (తినడం లేదా దుస్తులు వేసుకోవడం వంటివి) చెయ్యడం.
 • నాక్టరియా: రాత్రిళ్ళు తరచూ లేచి మూత్రవిసర్జనకై వెళ్ళవలసి రావడం. ఇది ఎన్యూరెసిస్, లేదా పక్క-తడపడం కన్నా భిన్నమైనది, అందులో వ్యక్తి నిద్ర నుండి లేవకపోయినా, మూత్రాశయం ఖాళీ అవుతుంది.[2]
 • సోమ్నిఫోబియా: నిద్ర పట్ల భయం.

వర్గీకరణలు[మార్చు]

 • డిస్సోమ్నియాలు - అతినిద్ర లేదా నిద్రలేమి లక్షణాలు కలిగిన నిద్ర రుగ్మతల విస్తార వర్గం. ఇందులోని మూడు ప్రధాన ఉపతరగతులు, అంతర్గత (అంటే, శరీరం లోపల ఉత్పన్నమయ్యేవి), బహిర్గత (వాతావరణ పరిస్థితులు లేదా వివిధ వ్యాధిపరమైన పరిస్థితుల నుండి జనించే ద్వితీయ శ్రేణి), మరియు రోజువారీ దినచర్య లోపాల కారణంగా ఉత్పన్నమయ్యేవి. MeSH
  • నిద్రలేమి
  • నార్కోలెప్సీ
  • స్లీప్ దిజార్డర్డ్ బ్రీతింగ్ (SDB), ఇందులోనే (అసమగ్రంగా) :
   • వివిధ రకాల స్లీప్ ఆప్నియా
   • గురక
   • అప్పర్ ఎయిర్‍వే రెసిస్టెన్స్ సిండ్రోం
  • రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోం
  • పీరియాడిక్ లింబ్ మూవ్‍మెంట్ డిజార్డర్
  • హైపర్‍సోమ్నియా
   • రికరెంట్ హైపర్‍సోమ్నియా - క్లీన్-లెవిన్ సిండ్రోంతో సహా
   • పోస్ట్-ట్రామాటిక్ హైపర్‍సోమ్నియా
   • "ఆరోగ్యకరమైన" హైపర్‍సోమ్నియా
  • సిర్కాడియన్ రిథం స్లీప్ డిస్ఆర్డర్
   • డిలేయ్డ్ స్లీప్ ఫేజ్ సిండ్రోం
   • అడ్వాన్స్‌డ్ స్లీప్ ఫేజ్ సిండ్రోం
   • నాన్-24-అవర్ స్లీప్-వేక్ సిండ్రోం
 • పారాసోమ్నియాలు - నిద్రకు చెందిన అసాధారణ మరియు అసహజ కదలికలు, ప్రవర్తనలు, ఉద్వేగాలు, కల్పనలు, మరియు కలలు కలిగించే నిద్ర రుగ్మతలు.
  • REM నిద్ర ప్రవర్తన రుగ్మత
  • నిద్ర భయం
  • నిద్రలో నడక (లేదా సోమ్నాంబులిజం)
  • బ్రక్సిజం (పళ్ళు-కొరకడం)
  • పక్క తడపడం లేదా స్లీప్ ఎన్యూరెసిస్.
  • నిద్రలో మాట్లాడటం (లేదా సోమ్నిలాక్వీ)
  • స్లీప్ సెక్స్ (లేదా సెక్స్ సోమ్నియా)
  • ఎక్స్ప్లోడింగ్ హెడ్ సిండ్రోం - రాత్రిళ్ళు పెద్ద శబ్దాలు విని మేల్కొనడం.
 • నిద్ర రుగ్మతలను కలుగజేసే వైద్యపరమైన లేదా మానసికవ్యాధి పరిస్థితులు
  • సైకోసిస్ (స్కిట్సోఫ్రెనియా వంటిది)
  • భావ రుగ్మతలు
   • నిర్లిప్తత
   • వ్యాకులత
  • ఆదుర్దా
  • మధ్యపాన వ్యసనం
 • స్లీపింగ్ సిక్‍నెస్ - త్సేత్సే కీటకం ద్వారా వ్యాప్తి చెందే పరాన్నజీవి వ్యాధి.

సాధారణ చికిత్సా విధానాలు[మార్చు]

నిద్ర రుగ్మతలకు చికిత్సలను సాధారణంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు:

 • ప్రవర్తన/ మానసిక వైద్య విధానాలు
 • పునరావాసం/నిర్వహణ
 • చికిత్స
 • ఇతర శారీరక చికిత్సలు

నిద్ర రుగ్మతలు కలిగిన అందరు రోగులకూ ఈ సాధారణ ప్రక్రియలు చాలవు. కాగా, రోగి యొక్క రోగనిర్ధారణ, వైద్య మరియు మానసికవ్యాధి చరిత్ర మరియు ప్రాధాన్యతలు, మరియు చికిత్స చేసే వైద్యుడి ఆధారంగా ఒక ప్రత్యేకమైన చికిత్సా విధానాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. తరచూ, ప్రవర్తనా/మానసికవైద్య మరియు ఔషధ విధానాలు సరిపడవు, మరియు చికిత్సాపరమైన లాభాలను మెరుగు పరచడానికి వీటి కలయిక ఉపయోగపడవచ్చు. మానసిక, వైద్య, లేదా వస్తు దుర్వినియోగ రుగ్మతలు కాకుండా ద్వితీయ తరహా నిద్ర రుగ్మతల నిర్వహణలో ముఖ్యంగా కారణమైన పరిస్థితులను పరిశీలించవలసి ఉంటుంది.

కొన్ని రకాల నిద్ర రుగ్మతలకు ఔషధాలు మరియు శారీరక చికిత్సలు అత్యంత త్వరితమైన లక్షణాల నుండి విముక్తిని కలిగించవచ్చు. నార్కోలెప్సీ వంటి కొన్ని రుగ్మతలను ఔషధాలు ఉపయోగించి అత్యుత్తమంగా నయం చేయవచ్చు. దీర్ఘకాల మరియు ప్రాథమిక నిద్రలేమి వంటి ఇతర రుగ్మతలను ప్రవర్తనా విధానాలను ఉపయోగించి సత్ఫలితాలు పొందేలా నయం చేయవచ్చు.

బాల్యంలో సుమారు 70% మంది పిల్లలను బాధించే దీర్ఘకాల నిద్ర రుగ్మతలు అభివృద్ధి లేదా మానసిక రుగ్మతలను కలుగజేస్తాయి, ఇవి నమోదు కావడం మరియు వీటికి చికిత్స తక్కువగా జరుగుతూ ఉంటుంది. నిద్రా-దశ భంగం అనేది కూడా కౌమార దశలో సామాన్యం, వారి రోజువారీ దినచర్యకు వారి పాఠశాల సమయాలు తరచూ సరికానింగా ఉంటాయి. నిద్ర సమయాల నమోదు మరియు బహుశా నిద్ర పరిశోధనలు ఉపయోగించి సవ్యమైన రోగనిర్ధారణ చేసిన తరువాత ప్రభావవంతమైన చికిత్స ప్రారంభించవచ్చు. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు చేసుకోవడం వలన సమస్య పరిష్కారం కావచ్చు, కానీ తరచూ వైద్య చికిత్స అవసరమవుతుంది.[3]

అబ్‍స్ట్రక్టివ్ ఆప్నియా, రోజువారీ దినచర్య రుగ్మతలు మరియు బ్రక్సిజం వంటి ఎన్నో రుగ్మతల చికిత్సకు ప్రత్యేకమైన పరికరాలు అవసరం కావచ్చు. ఈ సమస్యలు తీవ్రమైన సందర్భాలలో, ఎంత జాగ్రత్తగా నిర్వహించినా, తరచూ వ్యాధితో సహజీవనం అవసరమవుతుంది.

కొన్ని నిద్ర రుగ్మతలలో గ్లూకోస్ జీవక్రియ బలహీనపడటం గమనించడం జరిగింది.[4]

స్లీప్ మెడిసిన్[మార్చు]

20వ శతాబ్దంలో REM నిద్ర మరియు స్లీప్ ఆప్నియా ఆవిష్కారంతో పాటుగా నిద్ర గురించి వేగంగా తెలుసుకోవడం వలన, నిద్ర యొక్క వైద్యపరమైన ప్రాముఖ్యతను గుర్తించడం జరిగింది. స్లీప్ ఆప్నియా వంటి ప్రాథమిక నిద్ర రుగ్మతలు మరియు ఇతర పరిస్థితులలో నిద్ర యొక్క పాత్ర మరియు ప్రాధాన్యత పట్ల వైద్య సమాజం మునుపటి కంటే ఎక్కువ ధ్యాస పెట్టడం జరిగింది. 1970ల నాటికి USAలో, నిద్ర మరియు నిద్ర రుగ్మతల పరిశోధనకు వైద్యశాలలు మరియు ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి, మరియు వీటికి ప్రామాణికత అవసరమైంది.

పీడియాట్రిక్ పాలీసోమ్నోగ్రఫీ.

సంయుక్త రాష్ట్రాలలో ఇంటర్నల్ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఓటోలారింగాలజీ, సైకియాట్రీ మరియు న్యూరాలజీలలో స్లీప్ మెడిసిన్ అనేది ప్రస్తుతం ఒక గుర్తింపు పొందిన ఉప-ప్రత్యేకత. స్లీప్ మెడిసిన్ యోగ్యత పొందిన నిపుణుడు:

"నిద్రలో సంభవించే వైద్యపరమైన పరిస్థితుల రోగనిర్ధారణ మరియు నిర్వహణ, నిద్రాభంగం కలిగించే పరిస్థితులు, మెలకువ-నిద్ర వలయంలో అసమతౌల్యం వలన ప్రభావితం చెందే పరిస్థితుల పట్ల నైపుణ్యం ప్రదర్శించాడు. ఈ నిపుణుడు సమగ్ర పాలీసోమ్నోగ్రఫీ విశ్లేషణ మరియు వివరణలో నైపుణ్యం కలిగి ఉంటాడు, మరియు అత్యాధునిక పరిశోధన, నిద్రా ప్రయోగశాల నిర్వహణ గురించి తెలుసుకుని ఉంటాడు."[5]

స్లీప్ మెడిసిన్లో నైపుణ్యం కొరకు ఎన్నో విభిన్న రుగ్మతల గురించి తెలుసుకోవడం అవసరం, ఇందులో చాలావరకూ అత్యధికంగా పగటి నిద్ర వంటి ఒకేరకమైన లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి ఉద్దేశ్యపూర్వకమైన నిద్ర లేమి కానట్లయితే, స్లీప్ ఆప్నియా, నార్కోలెప్సీ, ఇడియోపాథిక్ సెంట్రల్ నెర్వస్ సిస్టం (CNS) హైపర్‍సోమ్నియా, క్లీన్-లెవిన్ సిండ్రోం, రుతుక్రమ-సంబంధిత హైపర్‍సోమ్నియా, ఇడియోపాథిక్ రికరెంట్ స్టూపర్, లేదా రోజువారీ దినచర్య అసమతౌల్యంవంటి "తప్పనిసరిగా గుర్తించగల మరియు నయం అయ్యే నిద్ర రుగ్మతల వలన ఏర్పడతాయి".[6] మరొక సామాన్య సమస్య నిద్రలేమి, ఇందులో ఎన్నో విభిన్న శారీరక మరియు మానసిక కారణాలు కలిగిన వివిధ లక్షణాలు ఉండవచ్చు. వివిధ పరిస్థితులలో నిర్వహణ ఎంతో భిన్నంగా ఉంటుంది మరియు సరైన రోగనిర్ధారణ లేకుండా చికిత్స చేయకూడదు.

స్లీప్ డెంటిస్ట్రీ (బ్రక్సిజం, గురక మరియు స్లీప్ ఆప్నియా) అనేది తొమ్మిది దంత వైద్యవిధానాలలో ఒకటి కాకపోయినా, ది అమెరికన్ బోర్డ్ ఆఫ్ డెంటల్ స్లీప్ మెడిసిన్ (ABDSM) ద్వారా బోర్డ్-యోగ్యతకు అర్హమైనది. తద్వారా పొందిన యోగ్యత స్థాయి, ది అమెరికన్ అకాడెమి ఆఫ్ స్లీప్ మెడిసిన్ (AASM) గుర్తింపు పొందింది, మరియు ఈ దంతవైద్యులు ది అకాడెమి ఆఫ్ డెంటల్ స్లీప్ మెడిసిన్ (USA) లో సభ్యత్వం కలిగి ఉంటారు.[7] యోగ్యత పొందిన దంతవైద్యులు అనుమతి పొందిన నిద్రా కేంద్రాలలో నిద్రా వైద్యులతో కలిసి నిద్రా-సంబంధిత శ్వాస రుగ్మతల చికిత్సకు మౌఖిక ప్రయోగ చికిత్స మరియు ఊర్ధ్వ శ్వాసకోశ శస్త్రచికిత్సను అందించడం జరుగుతుంది.[8]

UKలో, స్లీప్ మెడిసిన్ జ్ఞానం మరియు రోగనిర్ధారణ మరియు చికిత్స యొక్క సాధ్యత తక్కువగా కనిపిస్తుంది. ది ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్ స్లీప్ సెంటర్ సంచాలకుడు ఇలా చెప్పాడని Guardian.co.uk ఉదహరిస్తుంది: "ఒక సమస్య ఏమిటంటే ఈ దేశంలో స్లీప్ మెడిసిన్ శిక్షణ ఒకరకంగా తక్కువే - ఖచ్చితంగా నిద్రా వైద్యులకు స్థిరమైన శిక్షణ లేదు."[9] అబ్‍స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోం (OSA) మరియు మరికొన్ని ఇతర నిద్ర రుగ్మతలపై ది ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్ సైట్[10] దృష్టి సారిస్తుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • వినికిడి ముసుగు
 • క్రోనోటైప్స్
 • ఆరోగ్యంపై పర్యావరణ శబ్దం ప్రభావాలు
 • నిద్ర రుగ్మతల అంతర్జాతీయ వర్గీకరణ
 • నేషనల్ స్లీప్ ఫౌండేషన్
 • వ్యతిరేక నిశ్చల లక్షణాలు
 • ఆరోగ్యకరమైన నిద్ర
 • సన్‍డౌనింగ్ (డిమెన్షియా)
 • వైట్ నాయిస్ మెషిన్
 • స్లీప్ మెడిసిన్
 • పోలిసోమ్నోగ్రఫీ
 • పాలీసోమ్నోగ్రాఫిక్ టెక్నీషియన్

సూచనలు[మార్చు]

 1. Hirshkowitz, Max (2004). "Chapter 10, Neuropsychiatric Aspects of Sleep and Sleep Disorders (pp 315-340)". In Stuart C. Yudofsky and Robert E. Hales, editors (సంపాదకుడు.). Essentials of neuropsychiatry and clinical neurosciences (Google Books preview includes entire chapter 10)|format= requires |url= (help) (4 సంపాదకులు.). Arlington, Virginia, USA: American Psychiatric Publishing. ISBN 9781585620050. Retrieved 2009-12-06. ...insomnia is a symptom. It is neither a disease nor a specific condition. (from p. 322)CS1 maint: extra text: editors list (link)
 2. www.sleepfoundation.org
 3. Ivanenko A and Massey C (October 1, 2006). "Assessment and Management of Sleep Disorders in Children". Psychiatric Times. 23 (11).
 4. Keckeis M, Lattova Z, Maurovich-Horvat E, Beitinger PA, Birkmann S, Lauer CJ, Wetter TC, Wilde-Frenz J, Pollmächer T. (2010). "Impaired glucose tolerance in sleep disorders". PloS 1. 3 (5): 9444. doi:10.1371/journal.pone.0009444. PMC 2830474. PMID 20209158.CS1 maint: multiple names: authors list (link)
 5. "American Board of Medical Specialties : Recognized Physician Specialty and Subspecialty Certificates". Retrieved 2008-07-21. Cite web requires |website= (help)
 6. Mahowald, M.W. (2000). "What is causing excessive daytime sleepiness?: evaluation to distinguish sleep deprivation from sleep disorders". Postgraduate Medicine. 107 (3): 108–23. doi:10.3810/pgm.2000.03.932. మూలం (Online, full text) నుండి 2008-05-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-07-27. Unknown parameter |month= ignored (help)
 7. "About AADSM". Academy of Dental Sleep Medicine. 2008. Retrieved 2008-07-22. Cite web requires |website= (help)
 8. "About the ADBSM". American Board of Dental Sleep Medicine. Retrieved 2008-07-22. Cite web requires |website= (help)
 9. Wollenberg, Anne (July 28 2008). "Time to wake up to sleep disorders". Guardian News and Media Limited. Retrieved 2008-08-03. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)
 10. "Sleep services". Imperial College Healthcare NHS Trust. 2008. Retrieved 2008-08-02. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]