నిమజ్జనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2022లో కోల్‌కతా బాజా కడంతల ఘాట్ వద్ద నిమజ్జనం కోసం తరలివచ్చిన దుర్గామాత విగ్రహం ఊరేగింపు

నిమజ్జనం అనేది హిందూ ఆచారాల ప్రకారం తాత్కాలికంగా ప్రతిష్టించిన విగ్రహాలు, బతుకమ్మలు, గొబ్బెమ్మలు మొదలైనవి పూజాకార్యక్రమాలు పూర్తైన తరువాత నీటి ప్రవాహంలో కలపడం.

నిమజ్జనం చేసేముందు పూజలు అందుకున్న వినాయకుడు, దుర్గామాత విగ్రహాలను, బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో గ్రామంలో, నగర వీధుల్లో శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.

విశిష్టత[మార్చు]

సృష్టి, స్థితి, లయలనే మూడు దశలు కనిపించే పండుగల సంప్రదాయం యావత్తూ, ప్రకృతికి అనుగుణంగా సాగుతుంది. నదులలోను, వాగులలోను లభించే ఒండ్రుమట్టితో ఆయా దేవత, దేవుడు ప్రతిమలను రూపొందిస్తాము. వినాయకచవితికి ఏకవింశతి పత్రపూజ పేరుతో 21 రకాల ఆకులతో వినాయకుడిని కొలుస్తాము. పూజ కోసం వాడే మట్టి విగ్రహం, పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే బతుకమ్మకు ఉపయేగించే పువ్వుల్లోనూ ఎన్నో రకాల ఔషధ విలువలు ఉన్నాయి. అందువల్ల వీటితో మానవాళకి ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం, ఆరోగ్యం చేకూరుతాయి. పైగా విగ్రహాల తయారీకి తరలించే మట్టివల్ల వాగులు వంకల్లో పూడిక తీసినట్టవుతుంది. భావి, వాగు, చెరువులలో పత్రి, పూలు కలవడం వల్ల నీటిలో ఉన్న బ్యాక్టీరియా నశించి నీరు శుభ్రపడుతుంది.[1]

వినాయక నిమజ్జనం[మార్చు]

భాద్రపద శుద్ధ చవితి మొదలు వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకొని వెళ్ళి దగ్గరలోని బావి, వాగు, చెరువు, నది, సముద్రం ఇలా ఏదైన మంచినీటి వనరులలో నిమజ్జనం చేస్తారు.[2]

దుర్గామాత నిమజ్జనం[మార్చు]

దసరా ఉత్సావాలలో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు శరన్నవరాత్రుల సందర్భంగా ఘనంగా పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.[3]

బతుకమ్మ నిమజ్జనం[మార్చు]

"బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో" అంటూ బాలికల నుంచి ముసలవ్వల వరకు అన్ని వయసుల వారు కలిసిమెలిసి ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ. ఈ సంబరాలు జరుపుకున్న రోజులూ రోజుకో బతుకమ్మని ఆరాధించి..ఆఖరి రోజు అంటే సద్దుల బతుకమ్మ రోజు నిమజ్జనం చేస్తారు.[4]

9 రోజుల పాటు సాగే బతుకమ్మ సంబరాలలో తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ , నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా కొలుస్తారు. సద్దుల బతుకమ్మ రోజు పూజ, ఆటపాటల అనంతరం నీటిలో నిమజ్జనం చేస్తారు. అయితే ప్రవహించే నీటి సదుపాయం ఉంటే ప్రతీరోజు కూడా చెట్ల మొదల్లలో కాకుండా బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.

గొబ్బెమ్మ నిమజ్జనం[మార్చు]

ప్రతీయేటా సంక్రాంతి సంబరాలలో మూడవరోజైన కనుమ పండుగ సందర్భంగా గొబ్బెమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు.[5]

అస్తికలు నిమజ్జనం[మార్చు]

హిందూ ధర్మంలో మృతి చెందినవారి దహన సంస్కారాలు చేసిన తరువాత అస్థికలు, చితాభస్మం పవిత్ర నదుల్లో నిమజ్జనం చేస్తారు. అస్థికలను ఒక కుండలో భద్రపరచి ఆ తర్వాత వాటిని గంగ, త్రివేణి సంగమం, గోదావరి, కృష్ణా నది, తుంగభద్ర నది మొదలైన వాటిలో నిమజ్జనం చేయడం సనాతన సంప్రదాయం.[6]

మూలాలు[మార్చు]

  1. "బతుకమ్మ పూలు.. వాటి ఔషధ గుణాలు". web.archive.org. 2023-09-17. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Latest Telugu News, తెలుగు వార్తలు, Telugu News Today Live, ఈరోజు వార్తలు, Online Telugu News, తెలుగు న్యూస్ లైవ్ - Samayam Telugu - Samayam Telugu". web.archive.org. 2023-07-07. Archived from the original on 2023-07-07. Retrieved 2023-09-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "నవదుర్గ నిమజ్జనం | nimajjanam for nava durga". web.archive.org. 2023-09-17. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Bathukamma 2022 All You Need Know Reasons Behind Bathukamma Nimajjanam | Bathukamma 2022: బతుకమ్మ నిమజ్జనం వెనుకున్న ఆంతర్యం ఇదే!". web.archive.org. 2023-09-17. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "ఘనంగా గొబ్బెమ్మ నిమజ్జనం | Great Gobbemma immersion". web.archive.org. 2023-09-17. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "గంగలో నిమజ్జనం చేసిన అస్థికలు ఎక్కడికి చేరుతాయి? శాస్త్రం ఏమి చెబుతోంది? సైన్స్ ఏమంటోంది? | where bones in ganga have gone what says science spl-MRGS-Prathyekam". web.archive.org. 2023-09-17. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=నిమజ్జనం&oldid=3981436" నుండి వెలికితీశారు