నిమజ్జనం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిమజ్జనం
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.నారాయణ
నిర్మాణం తిక్కవరపు పఠాభిరామిరెడ్డి,
ప్రేమ్‌ప్రకాష్
తారాగణం శారద ,
చక్రపాణి,
బోసుబాబు,
యం.వి.రామారావు,
దాశరథి,
రావి కొండలరావు,
రాధాకుమారి
ఛాయాగ్రహణం పి.ఎస్.నివాస్
భాష తెలుగు

ఈ సినిమా 1978లో విడుదలయ్యింది. 1979లో ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ చిత్రంలో నటించిన శారద ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.

కథ[మార్చు]

భారతి సనాతన బ్రాహ్మణస్త్రీ. చనిపోయిన మామగారి అస్థికలను నిమజ్జనం చేసేందుకు భర్త శ్రీకాంత్‌తో పాటు బండిలో కాశీకి వెళుతుంది. భారతిని చూసి మోహపరవశుడైన బండివాడు ఆమెను బలాత్కారం చేయాలని పథకం వేస్తాడు. అతని పథకం వల్ల కనిపించకుండా పోయిన అస్థికల కుండ కోసం శ్రీకాంత్ వెదుకుతూ పోతే ఈ లోగా భారతిని బలాత్కారం చేస్తాడు బండివాడు. తన పవిత్రతను కోల్పోయిన భారతి గంగానదిలో ఆత్మార్పణం చేసుకుంటుంది. శ్రీకాంత్, అతని పురోహితుడు కాశీ నుండి తిరిగి వస్తుండగా బండివాడు మళ్లీ కలుస్తాడు. భారతి ఆత్మహత్య విషయం తెలుసుకుని పశ్చాత్తాప హృదయుడై, భారతి మరణానికి కారణం తానేనని శ్రీకాంత్‌కు చెప్పి ఎక్కడ భారతిని బలాత్కారం చేశాడో అక్కడే తాను కూడా ప్రాణాలు విడుస్తాడు. శ్రీకాంత్ అతనిపై పవిత్ర గంగాజలం చల్లుతాడు[1]. .

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
1979 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ సినిమా బి.ఎస్.నారాయణ గెలుపు
1979 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ నటి శారద గెలుపు
1979 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం పి.ఎస్.నివాస్ గెలుపు

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రపత్రిక ప్రత్యేక ప్రతినిధి (15 January 1980). "తెలంగాణా పోరాటం ఆధారంగా తీసిన సినిమా మా భూమి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 270. Retrieved 17 January 2018.[permanent dead link]

బయటిలింకులు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు