నిమ్మగడ్డ ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిమ్మగడ్డ ప్రసాద్
జననం (1961-10-11) 1961 అక్టోబరు 11 (వయసు 62)
విద్యDelhi University Masters in Science
Institute of Management Technology, Ghaziabad, Post Graduate Diploma in Management.
వృత్తిఛైర్మన్, మా టీవీ; వైస్ ఛైర్మన్ & ఫౌండర్, మ్యాట్రిక్స్ లాబరేటరీస్
ఛైర్మన్, వాన్‌పిక్

నిమ్మగడ్డ ప్రసాద్ ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు. కృష్ణాజిల్లాలో అక్టోబరు 11, 1961వ సంవత్సరంలో జన్మించారు. బాబు జగ్జీవన్‌రామ్‌ కాలేజీ నుండి బి.ఎస్సీ పట్టా పుచ్చు కున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ పూర్తిచేశారు. ఘజియాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ నుండి పార్ట్‌టైమ్‌ మేనేజ్‌మెంట్‌ డిప్లొమా చేశారు. ప్రసాద్‌కు ఇద్దరు తోబుట్టువులు అక్క సబ్బిరాణి, తమ్ముడు నిమ్మగడ్డ ప్రకాష్‌. ప్రసాద్‌ భార్యపేరు శ్రీదేవి. కూతురు నిమ్మగడ్డ స్వాతి.పీజీడీఎమ్‌ డిగ్రీ పూర్తవగానే 1984వ సంవత్సరంలో... ఇంగ్లాండ్‌కు చెందిన యునైటెడ్‌ మొలాసెస్‌ కంపెనీకి అనుబంధంగా ఉన్న ఢిల్లీలోని ఇండి యన్‌ మొలాసెస్‌ కంపెనీలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా కెరీర్‌ను ఆరంభించారు. ఆ తరువాత రోన్‌ పౌలెన్క్‌ కెమికల్స్‌లో సేల్స్‌మన్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వ ర్తించారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ 1993లో ప్రముఖ ఫార్మాస్యూ టికల్‌ కంపెనీ వోరియన్‌ లాబొరెటరీస్‌లో జనరల్‌ మేనేజర్‌ స్థాయికి చేరు కున్నారు. వోరియన్‌ ఫార్మాను రాన్‌బాక్సీ విలీనం చేసుకోవడంతో ప్రసాద్‌ సీని యర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హోదానిచ్చింది. ఆ తరువాత కంపెనీ సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.సిక్‌ ఫార్మా, హెరెన్‌ డ్రగ్స్‌ లాంటి కొన్ని ఫార్మా కంపెనీలను కొనుగోలు చేసి మాట్రిక్స్‌ లాబొరెటరీస్‌ పేరుతో క్రొత్త కంపెనీని స్థాపించారు. 2003లో మెడికార్ప్‌ టెక్నాల జీస్‌, వోరియన్‌ లాబ్స్‌ వంటి సంస్థలను, 2004లో వీరా లాబొరెటరీస్‌, ఫైన్‌ డ్రగ్స్‌ అండ్‌ కెమికల్స్‌లను కూడా మాట్రిక్స్‌లో విలీనం చేసి కంపెనీని మరింత విస్తృతపరిచారు. 2006లో కాంకర్డ్‌ బయోటెక్‌లాంటి ప్రముఖ కంపెనీలో వాటాను కొనుగోలు చేశారు. 2005లో బెల్జియం దేశానికి చెందిన డాక్‌ ఫార్మాను కొనుగోలు చేయడంతోపాటు చైనాలోని మెక్‌కెమ్‌ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఆస్పెన్‌ ఫార్మాస్యూటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. స్విట్జర్‌లాండ్‌ ఫార్మా దిగ్గజం ఎక్స్‌ప్లోర లాబొరెటరీస్‌లో 43% వాటాను చేజిక్కించుకోవడంతో 2006లో మైలాన్‌ లాబొరెటరీస్‌ జతకట్టింది మాట్రిక్స్‌ ఫార్మాస్యూటికల్స్‌. నిమ్మగడ్డ ఫౌండేషన్‌ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి సహాయంతో కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. క్లింటన్‌ ఫౌండేషన్‌ సంస్థతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 35 శాతం మంది ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్తులకు అవసరమైన వైద్యపరీక్షలు, మందులు అందజేస్తున్నారు.

వివాదాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]