Jump to content

నిరంజనానంద సరస్వతి

వికీపీడియా నుండి

స్వామి నిరంజనానంద సరస్వతి
జననం (1960-02-14) 1960 ఫిబ్రవరి 14 (వయసు: 66)
రాజ్‌నంద్‌గావ్
జాతీయతభారతీయుడు
స్థాపించిన సంస్థబీహార్ యోగా భారతి (BYB), యోగా పబ్లికేషన్స్ ట్రస్ట్, బాల యోగా మిత్ర మండల్, సన్యాస పీఠ్
గురువుస్వామి సత్యానంద సరస్వతి
వ్యాఖ్య

"ఇతరుల అవసరాలు తీరడానికి తోడ్పడటమే దానగుణం"
(Wikiquote లో మరిన్ని వ్యాఖ్యలు చూడండి)

స్వామి నిరంజనానంద సరస్వతి (జననం 14 ఫిబ్రవరి 1960) సత్యానంద యోగా వ్యవస్థాపకులు స్వామి సత్యానంద సరస్వతి వారసుడు.[1] సత్యానంద సరస్వతి 1988లో ప్రపంచవ్యాప్త సత్యానంద యోగా సమన్వయ బాధ్యతలను నిరంజనానందకు అప్పగించారు.

భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజ్‌నంద్‌గావ్ లోని ఒక కాయస్థ కుటుంబంలో ఈయన జన్మించారు. నిరంజనానంద పుట్టుకతోనే యోగి అని ఆయన అనుచరులు భావిస్తారు. గురువు సత్యానంద ఈయనకు 'నిరంజన్' (నిర్మలమైనవాడు) అని పేరు పెట్టారు. తన నాలుగేళ్ల వయసులోనే యోగనిద్ర, ఇతర యోగా ప్రక్రియల ద్వారా భారతదేశంలోని బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో శిక్షణ ప్రారంభించారు. పదేళ్ల వయసులో సన్యాసిగా దీక్ష తీసుకున్న తర్వాత పదకొండేళ్ల పాటు విదేశాల్లో గడిపారు. 1971 నుండి ఐరోపా, ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో విస్తృతంగా పర్యటించారు.[2] ఈ పర్యటనలు పాశ్చాత్య మనస్తత్వం, సమాజంపై ఆయనకు అవగాహన కలిగించాయి. 1983లో భారతదేశం తిరిగి వచ్చి బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అధిపతిగా నియమితులయ్యారు. ఆ తర్వాత పదకొండేళ్ల పాటు గంగా దర్శన్, శివానంద మఠం, యోగా రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థల్లో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.

1990లో పరమహంస సంప్రదాయంలో దీక్ష పొందారు. 1993లో సత్యానంద సరస్వతి ఆధ్యాత్మిక వారసుడిగా ఎంపికయ్యారు. తన గురువు సన్యాస స్వర్ణోత్సవాల సందర్భంగా 1993లో ప్రపంచ యోగా మహాసభను నిర్వహించారు. 1994లో యోగా రంగంలో ఉన్నత చదువుల కోసం బీహార్ యోగా భారతి కేంద్రాన్ని స్థాపించారు. 2000 సంవత్సరంలో యోగా పబ్లికేషన్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు.[3]

తన గురువు స్వామి సత్యానంద సరస్వతి ఆదేశానుసారం 2009లో అన్ని పరిపాలనా బాధ్యతలు, సంస్థాగత పదవుల నుండి తప్పుకున్నారు.[4] ప్రస్తుతం స్వామి నిరంజనానంద ఒక స్వతంత్ర సన్యాసిగా పరమహంస జీవనశైలిని, సాధనలను అనుసరిస్తున్నారు. 2013 నుండి గురు పరంపరను పాటిస్తూ కఠినమైన పంచాగ్ని తపస్సుతో పాటు కఠోపనిషత్తు, బృహదారణ్యక, ఛాందోగ్య ఉపనిషత్తుల్లో పేర్కొన్న ఇతర సాధనలు, యజ్ఞాలు నిర్వహిస్తున్నారు.[5]

యోగ రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2017లో దేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ తో గౌరవించింది.[6][7][8]

ప్రచురణలు

[మార్చు]

బీహార్ స్కూల్ ఆఫ్ యోగా స్వామి నిరంజనానంద రాసిన అనేక పుస్తకాలను ప్రచురించింది. వాటిలో కొన్ని:[9]

జ్ఞాన యోగ (Jnana Yoga)

మై ఇన్హెరిటెన్స్ ఆఫ్ సన్యాస (My Inheritance of Sannyasa)

ది యోగ ఆఫ్ సేజ్ వశిష్ట (The Yoga of Sage Vasishtha)

ది యోగ ఆఫ్ శ్రీ కృష్ణ (The Yoga of Sri Krishna)

యోగ ఇన్ డైలీ లైఫ్ (Yoga in Daily Life)

ధర్మ ఆఫ్ ఏ డిసైపుల్ (Dharma of a Disciple)

హెడ్, హార్ట్ & హ్యాండ్స్ (Head, Heart & Hands)

కర్మ & కర్మ యోగ (Karma & Karma Yoga)

మంత్ర & యంత్ర (Mantra & Yantra)

మైండ్, మైండ్ మేనేజ్‌మెంట్ & రాజ యోగ (Mind, Mind Management & Raja Yoga)

ఆరిజిన్ ఆఫ్ యోగ & పాశుపత యోగ (Origin of Yoga & Pashupata Yoga)

ది పాత్స్ ఆఫ్ ప్రవృత్తి & నివృత్తి (The Paths of Pravritti & Nivritti)

సన్యాస (Sannyasa)

ఆన్ ది వింగ్స్ ఆఫ్ ది స్వాన్ (On the Wings of the Swan - నాలుగు భాగాలు)

యోగ సాధన పనోరమ (Yoga Sadhana Panorama - ఐదు భాగాలు)

ప్రాణ ప్రాణాయామ (Prana Pranayama)

యోగ చూడామణి ఉపనిషద్ (Yoga Chudamani Upanishad)

ఘేరండ సంహిత (Gheranda Samhita)

ధారణ దర్శన్ (Dharana Darshan)

సన్యాస దర్శన్ (Sannyasa Darshan)

యోగ దర్శన్ (Yoga Darshan)

మూలాలు

[మార్చు]
  1. ↑ Saraswati, Ahimsadhara (2010). Yoga Day by Day. Swan Yoga Publications. p. 4. ISBN 978-0-9808062-0-5.
  2. ↑ Saraswati, Swami Niranjanananda (2015). Yoga Chakra 2: Cultivating Spiritual Samskara. Yoga Publications Trust, Munger, Bihar, India. p. 51. ISBN 978-93-84753-28-3.
  3. ↑ "Yoga Publications Trust - Bihar Yoga". www.biharyoga.net.
  4. ↑ Saraswati, Swami Niranjanananda (2013). The history of Bihar School of Yoga. Yoga Publications Trust, Munger, Bihar, India. p. 39. ISBN 978-93-81620-41-0.
  5. ↑ Panchagni Tapas: Spiritual Succession of the Sadhus Fire. Yoga Publications Trust, Munger, Bihar, India. 2018. p. 1. ISBN 978-93-84753-64-1.
  6. ↑ "List of Padma awardees 2017 - The Hindu". The Hindu. 25 జనవరి 2017.
  7. ↑ "Archived copy" (PDF). mha.gov.in. Archived from the original (PDF) on 9 ఫిబ్రవరి 2018. Retrieved 12 జనవరి 2022.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  8. ↑ "List of the Padma Awardees of 2017 , Padma Vibhushan, Padma Bhushan, Padma Shri - India". 27 జనవరి 2017.
  9. ↑ "Bihar Yoga Books - Bihar Yoga". biharyoga.net.

బయటి లింకులు

[మార్చు]

http://www.yogapoint.com/info/swamiji2.htm

https://www.youtube.com/watch?v=amPz09I401Q

మూస:PadmaBhushanAwardRecipients 2010–19