నిరీక్షణ
నిరీక్షణ (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాలు మహేంద్ర |
---|---|
తారాగణం | భానుచందర్, అర్చన, నిర్మల, అల్లు రామలింగయ్య, సత్యనారాయణ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నిరీక్షణ 1982లో విడుదలైన తెలుగు చిత్రం[1].ప్రముఖ తమిళ దర్శకుడు బాలూ మహేంద్ర దర్శకత్వంలో భాను చందర్, అర్చన నాయకా నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అత్యత్భతమైన సంగీతాన్ని మరియి నేపథ్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు జనాదరణ పొందాయి.
కథ
[మార్చు]విహార యాత్రనుండి వస్తున్న ఒక పాఠశాల బస్సును మాసిన గడ్డం, చిరిగిన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి (భానుచందర్) ఆపి తన గమ్యస్థానానిని చేర్చమని సహాయం కోరడంతో చిత్రం మొదలవుతుంది. అతని వేషధారణ చూసి మొదట సందేహించినా ఆ బస్సు లోని ఒక పెద్దాయన (అల్లు రామలింగయ్య) అతనిని బస్సులోకి అనుమతిస్తాడు. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొన్న కుతూహలం ఆ పెద్దాయనకు కలుగుతుంది. అతని దగ్గరకు వెళ్ళి అలాగే అడగ్గా, తాను జీవిత ఖైదు కారాగార వాసము నుండి ఇప్పుడే విడుదలై వస్తున్నానని ఆ వ్యక్తి (భాను చందర్) చెబుతాడు. అది విన్న బస్సులోని అందరూ భయకంపితులౌతారు. భయపడవద్దని చెప్పిన ఆవ్యక్తి తన గత జీవితం గురించి చెప్పనారంభిస్తాడు.
నట వర్గం
[మార్చు]- భాను చందర్ .. అటవీశాఖాధికారి
- అర్చన .. గిరిజన యువతి
- అల్లు రామలింగయ్య .. బస్సు ప్రయాణీకుడు
- సత్యనారాయణ .. కారాగార అధికారి
పాటలు
[మార్చు]- ఆకాశం ఏనాటిదో.. అభిమానం ఆనాటిది... పాడినవారు ప్రముఖ గాయని ఎస్.జానకి
- యమునా ఎందుకు నువ్వు ... పాడినవారు ప్రముఖ గాయని ఎస్.జానకి
- తీయని దానిమ్మ ...పాడినవారు ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, సహాయకులు
- చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే.. ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నే మరిచాలే... పాడినవారు ప్రముఖ గాయకుడు కే.జే. ఏసుదాస్