నిరూపా రాయ్
నిరూపా రాయ్ | |
---|---|
జననం | కోకిలా కిశోర్‌చంద్ర బల్సార 1931 జనవరి 4 వల్సాడ్, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా |
మరణం | 2004 అక్టోబరు 13 | (వయసు 73)
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | క్వీన్ ఆఫ్ మిజరీ, ట్రాజడీ క్వీన్, మదర్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1946–1999 |
జీవిత భాగస్వామి | కమల్ రాయ్ |
పిల్లలు | 2 |
పురస్కారాలు | మునిమ్‌జీ చిత్రానికిఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయనటి అవార్డ్ (1956) ఛాయా చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయనటి అవార్డ్ (1962) షెహనాయ్ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయనటి అవార్డ్(1965) ఫిల్మ్‌ఫేర్ జీవనసాఫల్య పురస్కారం (2004) |
నిరూపా రాయ్ (జన్మనామం కోకిలా కిశోర్‌చంద్ర బల్సార; 4 జనవరి 1931 – 13 అక్టోబర్ 2004) ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ సినిమాలలో అధికంగా నటించింది. విషాదమైన పాత్రలలో, కరుణ రసం ఒలికించే పాత్రలలో ఈమె తన నటనా ప్రతిభను చాటింది.[1] హిందీ సినిమా వర్గాల్లో ఈమెను తరచుగా క్వీన్ ఆఫ్ మిజరీగా పిలుస్తారు. ఈమె 1946 నుండి 1999 వరకు నటనా రంగంలో చురుకుగా పనిచేసింది. తల్లి పాత్రలలో ఈమె ఎక్కువగా రాణించింది.[2][3] నిరూపా రాయ్ 250కు పైగా సినిమాలలో నటించింది. ఈమె ఫిల్మ్‌ఫేర్ అవార్డులను మూడుసార్లు గెలుచుకుంది. 2004లో ఫిల్మ్‌ఫేర్ జీవనసాఫల్య పురస్కారాన్ని దక్కించుకుంది.
ఆరంభ జీవితం
[మార్చు]ఈమె అసలు పేరు కోకిలా కిశోర్‌చంద్ర. ఈమె గుజరాత్ రాష్ట్రంలోని వల్సాడ్‌లోని కల్వాడా ప్రాంతంలో జన్మించింది. ఈమె కమల్ రాయ్‌ను తన 15వ యేట వివాహం చేసుకుని ముంబై ప్రాంతానికి తరలి వచ్చింది. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన తర్వాత తన పేరును నిరూపా రాయ్‌గా మార్చుకుంది.
వృత్తి
[మార్చు]1949లో ఈమె, ఈమె భర్త ఒక గుజరాతీ దినపత్రికలో నటీనటులు కావలెను అనే ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నారు. ఈమె ఎంపిక అయి రనక్‌దేవి అనే గుజరాతీ సినిమాలో నటిగా తన సినీ ప్రస్థానాన్ని ఆరంభించింది. అదే సంవత్సరం హిందీలో తన మొదటి సినిమా అమర్ రాజ్‌లో నటించింది. ఈమె 1940-60ల మధ్య కాలంలో ఎక్కువగా పౌరాణిక పాత్రలను ధరించింది. ఈమెను దేవతగా భావించి ప్రజలు ఈమెను దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి ఈమె ఇంటికి వెళ్లేవారు. అంతగా ఈమె పౌరాణిక చిత్రాలలో తన నటనతో మెప్పించింది. ఈమెకు జోడీగా త్రిలోక్ కపూర్ (18 చిత్రాలలో జంటగా నటించారు[4]), భరత్ భూషణ్, బలరాజ్ సాహ్ని, అశోక్ కుమార్ మొదలైన హేమాహేమీలు నటించారు.
1970లలో ఈమె అమితాబ్ బచ్చన్, శశి కపూర్ మొదలైన హీరోల చిత్రాలలో తల్లిపాత్రలను ధరించింది. హిందీ సినిమాలలో ఈమె తల్లి పాత్రకు మారుపేరుగా నిలిచింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]నిరూపా రాయ్, కమల్ రాయ్‌ను దంపతులకు యోగేష్, కిరణ్ రాయ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.[5] ఈమె మరణానంతరం ఆస్తి విషయమై వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదం వార్తాపత్రికలకెక్కింది.[6][7] నిరూపా రాయ్ 2004, అక్టోబర్ 13న తన 73వ యేట గుండెపోటుతో ముంబైలో మరణించింది.[8]
ఈమె నటించిన సినిమాలలో కొన్ని ముఖ్యమైన సినిమాల జాబితా:
Year | Film | Notes |
---|---|---|
1946 | అమర్ రాజ్ | తొలి చిత్రం |
1949 | ఉద్ధార్ | |
1951 | రామ్ జన్మ | |
1953 | దో బిఘా జమీన్ | |
1954 | చక్రధారి | |
1954 | దుర్గా పూజ | |
1955 | గరమ్ కోట్ | |
1955 | మునీమ్ జీ | |
1955 | టాంగా వాలీ | |
1957 | మోహినీ | |
1957 | ముసాఫిర్ | |
1958 | చాల్‌బాజ్ | |
1958 | దుల్హన్ | |
1958 | నాగ్ చంపా | నాగమోహిని పేరుతో తెలుగులో డబ్ చేయబడింది |
1960 | ఆంచల్ | |
1961 | ఛాయా | |
1962 | బే జుబాన్ | |
1963 | కౌన్ అప్నా కౌన్ పరాయా | |
1963 | ముఝే జీనే దో | |
1963 | గృహస్తి | |
1964 | బెనజీర్ | |
1964 | షెహనాయి | |
1964 | ఫూలోఁ కి సెజ్ | |
1965 | షహీద్ | |
1967 | రామ్ ఔర్ శ్యామ్ | |
1967 | జాల్ | |
1968 | ఆబ్రూ | |
1968 | ఏక్ కలీ ముస్కాయి | |
1968 | రాజా ఔర్ రంక్ | |
1969 | ఆశూఁ బన్ గయే ఫూల్ | |
1969 | ప్యార్ కా మౌసమ్ | |
1969 | రహ్‌గిర్ | |
1970 | అభినేత్రి | |
1970 | మా ఔర్ మమతా | |
1970 | ఘర్ ఘర్ కీ కహానీ | |
1970 | మహారాజా | |
1970 | పూరబ్ ఔర్ పశ్చిమ్ | |
1971 | గంగా తేరా పానీ అమృత్ | |
1972 | జవానీ దివానీ | |
1973 | కచ్చే ధాగే | |
1975 | దీవార్ | |
1976 | మా | |
1977 | అమర్ అక్బర్ ఆంథోని | |
1977 | అనురోధ్ | |
1979 | సుహాగ్ | |
1982 | తీస్రీ ఆంఖ్ | |
1983 | బేతాబ్ | |
1985 | సర్ఫరోష్ | |
1985 | గిరఫ్తార్ | |
1985 | మర్ద్ | |
1986 | అంగారే | |
1988 | గంగా జమునా సరస్వతి | |
1988 | ఇంతెఖామ్ | |
1993 | ఆశూ బనే అంగారే | |
1999 | జహాఁ తుమ్ లే ఛలో | |
1999 | లాల్ బాద్‌షా |
పురస్కారాలు
[మార్చు]Year | Award | Category | Work | Result |
---|---|---|---|---|
1956 | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ఉత్తమ సహాయ నటి | మునిమ్‌జీ | గెలుపు |
1962 | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ఉత్తమ సహాయ నటి | ఛాయా | గెలుపు |
1965 | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ఉత్తమ సహాయ నటి | షెహనాయి | గెలుపు |
1985 | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ఉత్తమ సహాయ నటి | దీవార్ | నామినేట్ చేయబడింది |
1986 | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | జీవన సాఫల్య పురస్కారం | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ "Remembering Nirupa Roy, the Iconic 'Mother' of Bollywood". The Quint (in ఇంగ్లీష్). 2016-10-13. Retrieved 2019-11-19.
- ↑ "Happy Mother's Day 2019: Iconic mothers who graced screens of Indian cinema – News Nation". newsnation.in (in ఇంగ్లీష్). 12 May 2019. Retrieved 2019-11-19.
- ↑ "Mothers Day Special: Bollywood's Most Iconic Screen Mothers". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2019-11-19.
- ↑ Rishi, Tilak (2012). Bless You Bollywood!: A Tribute to Hindi Cinema on Completing 100 Years. Trafford. p. 100. ISBN 978-1-4669-3963-9.
- ↑ "Nirupa Roy". The Independent (in ఇంగ్లీష్). 2004-11-02. Archived from the original on 2020-03-01. Retrieved 2019-11-19.
- ↑ Sayed, Nazia SayedNazia; Jan 10, Mumbai Mirror | Updated; 2018; Ist, 05:57. "Battle between Nirupa Roy's sons gets uglier". Mumbai Mirror (in ఇంగ్లీష్). Archived from the original on 2020-02-28. Retrieved 2019-11-19.
{{cite web}}
:|last3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Deewar's Maa Nirupa Roy's Sons Fight Over Her Property". NDTV.com. Retrieved 2019-11-19.
- ↑ MumbaiJanuary 4, Indo-Asian News Service; January 4, 2019UPDATED; Ist, 2019 15:20. "Javed Akhtar on Nirupa Roy 87th birth anniversary: She looked like Goddess in mother roles". India Today (in ఇంగ్లీష్). Retrieved 2019-11-19.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Nirupa Roy". IMDb. Retrieved 2019-11-19.
బయటి లింకులు
[మార్చు]- CS1 errors: numeric name
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- 1931 జననాలు
- 2004 మరణాలు
- గుజరాత్ వ్యక్తులు
- భారతీయ సినిమా నటీమణులు
- గుజరాతీ సినిమా నటీమణులు
- 21వ శతాబ్ద భారతీయ నటీమణులు
- 20వ శతాబ్ద భారతీయ నటీమణులు
- హిందీ సినిమా నటీమణులు