నిరూప్ భండారి
నిరూప్ భండారి | |
|---|---|
| జననం | 1984 August 13 పుత్తూరు, కర్ణాటక , భారతదేశం |
| పాఠశాల/కళాశాలలు | వీవీఐటీ |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
| Notable work | రంగితరంగ |
| భాగస్వామి |
ధన్య (m. 2016) |
| బంధువులు | అనూప్ భండారి (సోదరుడు) |
నిరూప్ భండారి కన్నడ సినిమాలో పని చేసే భారతీయ నటుడు.[1] ఆయన 2015 లో తన సోదరుడు అనూప్ భండారి దర్శకత్వం వహించిన సినిమా 'రంగితరంగ'లో తొలిసారిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.[2][3]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]నిరూప్ భండారి 1984 ఆగస్టు 13న కర్ణాటకలోని పుత్తూరులో సుధాకర్ భండారి, రత్న భండారి దంపతులకు జన్మించాడు. ఆయన మైసూర్‌లోని విద్యా వికాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (వీవీఐటీ) నుండి గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ బ్యాచిలర్ డిగ్రీ) పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆయన SAP ల్యాబ్స్ ఇండియాలో పనిచేయడం ప్రారంభించాడు.
సినీ జీవితం
[మార్చు]నిరూప్ SAP లో పనిచేస్తున్నప్పుడు MiSF!T స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో రంగస్థల ప్రముఖుడు రతన్ ఠాకూర్ గ్రాంట్ వద్ద నటన నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆయన సినిమాల్లోకి రాకముందు నాటకాలు, లఘు చిత్రాలలో నటించాడు.
2015లో తన సోదరుడు అనూప్ భండారి దర్శకత్వం వహించిన తొలి సినిమా 'రంగితరంగ' సినిమాతో అరంగేట్రం చేశాడు, ఈ సినిమాలో రాధికా నారాయణ్, అవంతిక శెట్టి, సాయి కుమార్ నటించారు.
రంగితరంగ అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఇది కన్నడ సినిమాలకు విదేశీ మార్కెట్‌ను కూడా తెరిచింది. ఇది అనేక దేశాలలో విడుదలైన మొదటి కన్నడ సినిమా, న్యూయార్క్ బాక్స్ ఆఫీస్ జాబితాలో కనిపించిన మొదటి కన్నడ చిత్రం మరియు యూఎస్ఏ లో 50 రోజులు ప్రదర్శితమైన మొదటి, ఏకైక కన్నడ సినిమా. అకాడమీ అవార్డులు (ఆస్కార్) కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన 305 చిత్రాలలో రంగితరంగ కూడా ఒకటి, కానీ తుది నామినేషన్లలోకి రాలేదు.[4][5]
ఆయన 2018లో తన రెండవ సినిమా రాజరథలో అవంతిక శెట్టితో కలిస్ నటించాడు . ఈ సినిమా బస్సు దృక్కోణం నుండి వివరించబడింది, దీనికి పునీత్ రాజ్‌కుమార్ గాత్రదానం చేశాడు.[6][7][8] ఈ సినిమా రంగితరంగ కంటే ముందు అనూప్ భండారి దర్శకత్వం వహించాడు.[9]
2019 లో తన తదుపరి సినిమా ఆది లక్ష్మీ పురాణ రాధికా పండిట్ తో వి. ప్రియ దర్శకత్వం వహించి థియేటర్లలోకి వచ్చింది.[10] ఈ సినిమా కుటుంబ ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది.[11][12]
2020 లో అమృత అయ్యంగార్, సంజన ఆనంద్ నటించిన తన సినిమా విండో సీట్ పనిని పూర్తి చేశాడు.[13]
వ్యక్తిగత జీవితం
[మార్చు]నిరూప్ ధన్యను వివాహం చేసుకున్నాడు.[14] అతని తండ్రి సుధాకర్ భండారి టెలివిజన్ సీరియల్స్ దర్శకత్వం వహించేవాడు. ఆయన పుత్తూరులోని సాజా అనే చిన్న పట్టణానికి చెందినవాడు. అతని అన్నయ్య అనూప్ భండారి దర్శకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు, ఆయన దాదాపు అన్ని సినిమాలలో నిరూప్ తో కలిసి పనిచేశాడు.[15]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]ప్రత్యేకంగా చెప్పకపోతే అన్ని సినిమాలు కన్నడలో ఉన్నాయి.
| సంవత్సరం | సినిమా | పాత్రలు | గమనికలు | మూ |
|---|---|---|---|---|
| 2015 | రంగితరంగ | గౌతమ్ సువర్ణ / సిద్ధార్థ్ | నామినేట్ అయ్యారు- కన్నడలో ఉత్తమ నటుడిగా IIFA ఉత్సవం అవార్డుకు నామినేషన్ పొందారు - పురుషుడు - ఉత్తమ నూతన నటుడిగా SIIMA అవార్డుకు
నామినేషన్ పొందారు - పురుషుడు - కన్నడ |
|
| 2018 | రాజరథం | అభి | [16] | |
| 2019 | అమర్ | కృష్ణ సుబ్బయ్య | కామియో పాత్ర | |
| ఆది లక్ష్మీ పురాణం | ఆది | |||
| 2022 | విండో సీట్ | రఘు | ||
| విక్రాంత్ రోణ | సంజీవ్ గంభీర | నామినేట్ - కన్నడలో ఉత్తమ నటుడిగా SIIMA అవార్డు | [17][18] | |
| 2025 | ఎడగైయే అపఘాతక్కే కరణ | రాఘవ్ | కామియో పాత్ర | |
| టిబిఎ | అమర మధుర ప్రేమ† | టిబిఎ | చిత్రీకరణ | |
| సత్య స/హరిశ్చంద్ర† | సత్య | పూర్తయింది |
మూలాలు
[మార్చు]- ↑ "Nirup Bhandari Biography, Nirup Bhandari Profile". Filmibeat.com. 2015-07-03. Retrieved 2016-08-09.
- ↑ "Rangi Taranga: 100 days and still entertaining". The Hindu (in Indian English). 12 October 2015. Retrieved 29 August 2016.
- ↑ "…And success follows". The Hindu (in Indian English). 20 August 2015. Retrieved 29 August 2016.
- ↑ "RangiTaranga Kannada film that took on Baahubali, and (almost) won!". Timesofbengaluru.com. 2015-08-11. Retrieved 2016-08-09.
- ↑ Upadhyaya, Prakash (18 August 2015). "Box Office Collection: 'RangiTaranga' Creates History to Overpower 'Bajrangi Bhaijaan', 'Baahubali', 'Vaalu' but fails to Beat "Brothers in US" (in ఇంగ్లీష్). Retrieved 29 August 2016.
- ↑ Upadhyaya, Prakash (2016-07-07). "'RangiTaranga' director Anup Bhandari set to announce the title of his next film". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
- ↑ Upadhyaya, Prakash (2016-07-11). "'Rajaratha:' Ravichandran, Juhi Chawla reveal the title of 'RangiTaranga' director Anup Bhandari's next film on 'Dancing Stars 3'". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
- ↑ "Nirup Bhandari relives his college days through Rajaratha - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
- ↑ Prathibha Joy. "Why does Anup Bhandari work with his brother Nirup on all his films?". OTT Play.
- ↑ "Nirup, Radhika's film is Aadi Lakshmi Purana - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
- ↑ "'Aadi Lakshmi Purana' movie review : A feel-good entertainer". The New Indian Express. Retrieved 2021-08-25.
- ↑ "Aadi Lakshmi Puraana Movie Review {3.5/5}: Critic Review of Aadi Lakshmi Puraana by Times of India", The Times of India, retrieved 2021-08-25
- ↑ "Teaser of Nirup Bhandari's Window Seat released - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
- ↑ "RangiTaranga actor engaged to his girlfriend". Timesofindia.indiatimes.com. 2015-09-09. Retrieved 2016-08-09.
- ↑ Prathibha Joy. "Why does Anup Bhandari work with his brother Nirup on all his films?". OTT Play.
- ↑ Sakshi (22 March 2018). "రాజరథం కోసం తెలుగు నేర్చుకున్నా". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
- ↑ "Nirup Bhandari to play Sanjeev Gambhira in Sudeep-starrer Phantom". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
- ↑ "Kichcha Sudeep reveals Nirup Bhandari's look as Sanjeev Gambhir in Phantom - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నిరూప్ భండారి పేజీ