నిర్భయ్‌ క్షిపణి

వికీపీడియా నుండి
(నిర్బయ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నిర్భయ్‌ క్షిపణి
రకం దూర పరిధి, అన్ని కాలాల, సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి[1][2]
ఉద్భవించిన దేశం  భారతదేశం
సర్వీసు చరిత్ర
వాడేవారు భారతీయ నౌకా దళం
భారత సైన్యం
భారతీయ వాయు సేన
ఉత్పత్తి చరిత్ర
తయారీదారు DRDO
తయారీ తేదీ తెలియదు పరీక్షల దశలోనే ఉంది
విశిష్టతలు
బరువు 1,000 kg[3]
పొడవు 6 మీ
వ్యాసం 0.52 మీ

ఇంజను turbofan
వింగ్‌స్పాన్ 2.84 మీ
ఆపరేషను
పరిధి
1,000 km[1][3]
వేగం మ్యాక్ 0.8
గైడెన్స్
వ్యవస్థ
INS

నిర్భయ్‌ ఒక దూర పరిధి సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీనిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేస్తోంది.

వివరణ[మార్చు]

నిర్బయ్ తక్కువ ఖర్చుతో, అన్నికాలాలలో, రహస్యంగా మరియు కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించ గల సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీని పరిధి 1000 కిమీ, బరువు ఒక టన్ను (1000 కి.గ్రా.), పొడవు 6 మీ. కచ్చితమైన గమనమునకు రింగ్ లేజర్ గైరోస్కోప్, కచ్చితమైన ఎత్తును కొలిచేందుకు రేడియో ఆల్టిమీటర్ ను ఈ క్షిపణిలో అమర్చారు.

ప్రయోగాలు[మార్చు]

ఇప్పటి వరకు ఐదు నిర్భయ్ పరీక్షలు జరపగా మూడు విఫలమయ్యాయి. రెండు విజయవంతమయ్యాయి. ఆ వివరాలివి:

  • మొదటి పరీక్ష– 2013 మార్చి 12– విఫలం– ప్రయాణంలో ఉండగా క్షిపణి కూలిపోయింది
  • రెండవ పరీక్ష – 2014 అక్టోబరు 17– విజయవంతం – 100% పనితనం
  • మూడవ పరీక్ష– 2015 అక్టోబరు 16 – విఫలం - క్షిపణి కూలిపోయింది
  • నాలుగవ పరీక్ష - 2016 డిసెంబరు 21 - విఫలం - క్షిపణి కూలిపోయింది[4][5][6]
  • ఐదవ పరీక్ష - 2017 నవంబరు 7 - విజయవంతం

ఐదవ పరీక్షలో నిర్భయ్ క్షిపణి 50 నిముషాల పాటు ప్రయాణించి, 647 కి.మీ. దూరాన్ని అధిగమించింది.[7]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]