Jump to content

నిర్మలా దేవి

వికీపీడియా నుండి
నిర్మలా దేవి
జననం(1927-06-07)1927 జూన్ 7
వారణాసి, బెనారస్ రాష్ట్రం, బ్రిటీష్ రాజ్(నేటి వారణాసి, ఉత్తర ప్రదేశ్, భారతదేశం)
మరణం1996 జూన్ 15(1996-06-15) (వయసు: 69)
వృత్తినటి, గాయని
భాగస్వామిఅరుణ్ కుమార్ అహుజా
పిల్లలు5, గోవిందతో సహా)
బంధువులుకృష్ణ అభిషేక్ (మనవడు)

నిర్మలా దేవి (1927 జూన్ 7 - 1996 జూన్ 15) దులారి అని కూడా పిలువబడే ఆమె 1940లలో భారతీయ నటి. పాటియాలా ఘరానాకు చెందిన హిందుస్తానీ శాస్త్రీయ గాయని.[1][2][3][4] ఆమె కుమారుడు బాలీవుడ్ నటుడు గోవింద.

జనవరి 2025లో, నిర్మలా దేవిని భారత ప్రభుత్వం దేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది.[5][6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నిర్మలా దేవి 1927 జూన్ 7న వారణాసిలో ఒక ముస్లిం కుటుంబంలో నజీమ్ గా జన్మించింది.[7] ఆమె తరువాత హిందూ మతంలోకి మారి, నిర్మలా దేవి అనే పేరును స్వీకరించి, 1942లో నటుడు అరుణ్ కుమార్ అహూజాను వివాహం చేసుకుంది.[8] వారికి 5 మంది పిల్లలు, వీరిలో 3 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. వారి కుమారులు భారతీయ చలనచిత్ర నటుడు గోవింద, చిత్ర దర్శకుడు కీర్తి కుమార్.

ఆమె మొదటి చిత్రం 'సవేర' భర్త అరుణ్ తో కలిసి నటించింది. ఆమె 1996లో మరణించింది.

మరణం

[మార్చు]

నిర్మలా దేవి 1996 జూన్ 15న, 69 సంవత్సరాల వయసులో, ముంబైలో మరణించింది.

నేపథ్య గాయని

[మార్చు]
  • సవేరా (1942)
  • శారదా
  • కనూన్
  • గీత్
  • గాలి (1944)
  • సెహ్రా
  • జన్మాష్టమి
  • రామ్ తేరి గంగా మైలి (1985)
  • బావార్చి (1972)
  • జారా బచ్కే (1959)
  • షామా పర్వానా (1954)

సౌండ్ట్రాక్

[మార్చు]
  • బావార్చి (1972) -"భోర్ ఆయి గయా అంధియారా"

మూలాలు

[మార్చు]
  1. Manuel, Peter Lamarche (1990). Ṭhumrī in historical and stylistic perspectives. Motilal Banarsidass. p. 90. ISBN 978-81-208-0673-3.
  2. Wade, Bonnie C. (1987). Music in India: the classical traditions. Riverdale Company. p. 178. ISBN 978-0-913215-25-8.
  3. Sharma, Manorma (2006). Tradition of Hindustani music. APH Publishing. p. 114. ISBN 978-81-7648-999-7.
  4. Singh, Manjit (1992). Political socialization of students. Deep & Deep Publications. p. 24. ISBN 978-81-7100-404-1.
  5. "Padma Award Winners 2025 Full List: Padma Vibhushan, Padma Bhushan, Padma Shri". Bru Times News (in ఇంగ్లీష్). Archived from the original on 2025-02-07. Retrieved 2025-02-28.
  6. "Padma Awards 2025 announced". pib.gov.in.
  7. दुबे, स्नेहा (2024-07-05). "जन्म से मुस्लिम, धर्म से हिंदू और कर्म से साध्वी थीं गोविंदा की मां, जानें कौन थीं वो". www.abplive.com (in హిందీ). Retrieved 2024-08-03.
  8. "Did Govinda Share Rocky Relationship With Father Arun Kumar Ahuja?". News18 (in ఇంగ్లీష్). 2023-01-19. Retrieved 2024-08-03.