Jump to content

నిర్మలా భూరియా

వికీపీడియా నుండి
నిర్మలా భూరియా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 డిసెంబరు 25

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023
ముందు వల్సింగ్ మైదా
నియోజకవర్గం పెట్లవాడ

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
తల్లిదండ్రులు దిలీప్ సింగ్ భూరియా
నివాసం భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకురాలు

నిర్మలా భూరియా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు పెట్లవాడ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2023 డిసెంబరు 25 నుండి మోహన్ యాదవ్ మంత్రివర్గంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేస్తుంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

నిర్మలా భూరియా తన తండ్రి దిలీప్ సింగ్ భూరియా అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1993 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పెట్లవాడ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గంగాబాయిపై 32,292 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె అనంతరం తన తండ్రితో పాటు భారతీయ జనతా పార్టీలో చేరి 1998 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జంసింగ్ అమలియార్‌పై 8,392 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

నిర్మలా భూరియా 2003 శాసనసభ ఎన్నికలలో పెట్లవాడ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రూప్ సింగ్‌పై 18668 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2008 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి వల్సింగ్ మైదా చేతిలో 8584 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

నిర్మలా భూరియా 2013 మధ్య ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పెట్లవాడ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి వల్సింగ్ మైదాపై 17,016 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి వల్సింగ్ మైదా చేతిలో 5000 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

నిర్మలా భూరియా 2023 మధ్య ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పెట్లవాడ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి వల్సింగ్ మైదాపై 17,016 ఓట్ల మెజారిటీతో ఐదవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2][3] 2023 డిసెంబరు 25 నుండి మోహన్ యాదవ్ మంత్రివర్గంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేస్తుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. "मोहन कैबिनेट का महिला पावर, ये हैं सरकार की पांच महिला मंत्री". Zee News Hindi. 7 March 2024. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  2. "Petlawad Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  3. "Madhya Pradesh Assembly Election Results 2023 - Petlawad". Election Commission of India. 3 December 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  4. "The Hindu : Other States / Madhya Pradesh News : Chauhan allocates Ministers' portfolios". www.hindu.com. Archived from the original on 11 June 2008. Retrieved 17 January 2022.