నిర్మల్ మండలం
నిర్మల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°06′02″N 78°20′52″E / 19.100614°N 78.347863°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | నిర్మల్ |
గ్రామాలు | 4 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 27 km² (10.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 88,433 |
- పురుషులు | 44,053 |
- స్త్రీలు | 44,380 |
పిన్‌కోడ్ | 504106 |
నిర్మల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1] నిర్మల్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో నాలుగు రెవెన్యూ గ్రామాలు మాత్రమే ఉన్నాయి.మండలం కోడ్: 04344.ఇది ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, నిర్మల్ శాసనసభ నియోజకవర్గం పరిధి కింద ఉంది.[1] నిర్మల్ కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి.ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కర్రలతో కొయ్యబొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్రలను సేకరించడం, వాటిని ఆరబెట్టి తగిన రుపాలకు చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దడం, వాటికి పెయింటింగ్ చేయడం, విక్రయించడం ఇక్కడ కొందరు తరతరాలుగా చేస్తున్నారు.[3]
మండల గణాంకాలు
[మార్చు]గతంలో నిర్మల్ మండలం, ఆదిలాబాదు జిల్లా, నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధిలో 38 గ్రామాలతో ఉండేది.[4] 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా, నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధిలోకి నిర్మల్ మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1] పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 27 చ.కి.మీ. కాగా, జనాభా 88,433. జనాభాలో పురుషులు 44,053 కాగా, స్త్రీల సంఖ్య 44,380. మండలంలో 19,298 గృహాలున్నాయి.[5]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]సరస్వతి కాలువ
[మార్చు]సరస్వతి కాలువ నిర్మల్ జిల్లా లోని నిర్మల్ మండలం పాకపట్ట శివారు గ్రామం గాంధీనగర్ వద్ద ఈ కాలువ ప్రారంభమవుతుంది. ఆయకట్టు 35,735 ఎకరాలు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-09-22. Retrieved 2020-06-23.
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Nirmal Toys Paintings Adilabad Telangana Tourism". www.nirmalcity.com. Archived from the original on 2016-02-12. Retrieved 2020-06-23.
- ↑ "Nirmal Mandal Villages, Adilabad, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-23.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.