నిశ్శంకరరావు వెంకటరత్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీ.శే.
నిశ్శంకరరావు వెంకటరత్నం
Nissankararao venkataratnam.jpg
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి
In office
1984–1985
Preceded byతంగి సత్యనారాయణ
Succeeded byజి. నారాయణరావు
వ్యక్తిగత వివరాలు
జననం1927
ఏటుకూరు, గుంటూరు జిల్లా
మరణం2004
జాతీయతభారత దేశం

నిశ్శంకరరావు వెంకటరత్నం ఏడవ శాసనసభ (1983-1984) స్పీకరుగా 1984వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1985వ సంవత్సరం జనవరి 10వ తేదీ వరకు ఆ పదవిని నిర్వహించాడు.[1][2]

జననం, విద్య[మార్చు]

ఈయన 1927వ సంవత్సరము జూన్ 17వ తేదీన గుంటూరు జిల్లాకు సమీపంలోని ఏటుకూరు గ్రామంలో జన్మించాడు. గుంటూరులోని ఎ.సి. కాలేజిలో బి.ఎ. డిగ్రీని, మద్రాసు లా కాలేజీ నుండి లా డిగ్రీని పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఇతను 1972వ సంవత్సరములో ఐదవ శాసనసభకు, 1983వ సంవత్సరములో ఏడవ శాసనసభకు గుంటూరు-2 నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. ఈయన 1983-1984 సంవత్సరాల మధ్య కాలంలో ప్రభుత్వ సంస్థల కమిటీ అధ్యక్షునిగా పనిచేశాడు. 1985వ సంవత్సరములో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెనాలి నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యాడు. శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా వెంకటరత్నం రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి.

మరణం[మార్చు]

ఈయన 2004వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన మరణించాడు.

మూలాలు[మార్చు]