Jump to content

నిశ్శబ్ద ప్రేమ

వికీపీడియా నుండి
నిశ్శబ్ద ప్రేమ
దర్శకత్వంరాజ్‌దేవ్‌
రచనరాజ్‌దేవ్‌
నిర్మాతకార్తికేయన్‌
తారాగణం
ఛాయాగ్రహణంయువరాజ్.ఎం
కూర్పుమదన్.జి
సంగీతంజుబిన్
నిర్మాణ
సంస్థ
సెలెబ్రేట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2025 మే 23 (2025-05-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

నిశ్శబ్ద ప్రేమ 2025లో విడుదలైన తెలుగు సినిమా. రాయల్ స్టార్ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కార్తికేయన్‌ నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌దేవ్‌ దర్శకత్వం వహించాడు.[1][2] శ్రీరామ్‌, ప్రియాంక తిమ్మేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 20న విడుదల చేయగా, సినిమాను మే 23న విడుదల చేశారు.

సంధ్య (ప్రియాంక తిమ్మేష్)ను వాళ్లింట్లోనే ఓ ముసుగు మనిషి వెంబడిస్తూ చంపే ప్రయత్నం చేస్తుండడంతో అక్కడి నుండి తప్పించుకుని వీధిలోకి వచ్చి పరుగెడుతుండగా ఓ వ్యక్తి ఆమెకు యాక్సిడెంట్ చేస్తాడు. ఈ ప్రమాదంలోజరిగిన సంధ్యను రఘు వ్యక్తి హాస్పిటల్‌లో చేర్చి చికిత్స ఇప్పించగా, తలకు తగిలిన దెబ్బతో ఆమె గతం మరిచిపోతుంది. తనని హాస్పిటల్‌లో చేర్చిన రఘు ఎవరో కాదు తన భర్తే అనేలా పరిచయం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లి యోగ క్షేమాలు చూస్తుంటాడు. ఈ క్రమంలో తన ఆ సమయంలో కనిపించిన పాత డైరీని చూసిన సంధ్య అతను రఘు కాదని, విఘ్నేష్ (శ్రీరామ్) అని తెలుసుకుంటుంది. . ఇంతలో నిజమైన రఘు కమిషనర్ ఎడ్వర్డ్ (హరీష్ పెరాడి)కి తన భార్య సంధ్య కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తాడు, అతను దర్యాప్తు ప్రారంభిస్తాడు. అసలు సంధ్యను విఘ్నేష్ ఎందుకు తన ఇంటికి తీసుకెళ్లాడు? వీరిద్దరికి, సంధ్యకి ఉన్న సంబంధం ఏమిటి ? అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో 'నిశ్శబ్ద ప్రేమ'". NT News. 23 May 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  2. ↑ "ప్రేమకథలో పలు మలుపులు". Chitrajyothy. 23 May 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  3. ↑ "శ్రీరామ్‌ 'నిశ్శబ్ద ప్రేమ' మూవీ రివ్యూ". Sakshi. 24 May 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  4. ↑ "హీరో శ్రీరామ్‌ నిశ్శ‌బ్ద ప్రేమ - ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌ని కొత్త ల‌వ్‌స్టోరీ అంటూ నిర్మాత కామెంట్స్‌". Hindustantimes Telugu. 29 March 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.

బయటి లింకులు

[మార్చు]