నిషా మిల్లెట్
| Personal information | |
|---|---|
| National team | |
| Born | 1982 మార్చి 20 బెంగళూరు, కర్ణాటక, భారతదేశం |
| Sport | |
| Sport | Swimming |
| Strokes | ఫ్రీస్టైల్, బ్యాక్‌స్ట్రోక్ |
నిషా మిల్లెట్ (జననం 1982 మార్చి 20) భారతదేశంలోని కర్ణాటక బెంగళూరుకు చెందిన ఈత క్రీడాకారిణి. అర్జున అవార్డు గ్రహీత అయిన ఆమె 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో భారతదేశం తరపున ఈత కొట్టిన ఏకైక మహిళ.
కెరీర్
[మార్చు]నిషా మిల్లెట్ 1991లో, చెన్నైలోని షెనాయ్‌నగర్ క్లబ్ లో తన తండ్రి ఆబ్రే మార్గదర్శకత్వంలో ఈత నేర్చుకోవడం ప్రారంభించింది. ఆ మరుసటి సంవత్సరం, ఆమె చెన్నైలో నిర్వహించిన 50 మీటర్ల ఫ్రీస్టైల్ లో తన మొదటి రాష్ట్ర స్థాయి పతకాన్ని గెలుచుకుంది. ఆమె ఈతనే కెరీర్ గా ఎంచుకున్న కారనంగా వారి కుటుంబం బెంగళూరుకు మారంది.[1] అక్కడ ఆమె సోఫియా హైస్కూల్లో చదువు పూర్తిచేసింది.[1]
1994లో, సబ్-జూనియర్ గా ఉన్న ఆమె జాతీయ స్థాయిలో మొత్తం ఐదు ఫ్రీస్టైల్ బంగారు పతకాలను గెలుచుకున్నది. ఇక్కడ ఆమె భారతదేశంలోని అగ్రశ్రేణి స్విమ్మర్లను ఓడించింది. అదే సంవత్సరం, హాంకాంగ్ లో జరిగిన ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్షిప్లో ఆమె తన మొదటి అంతర్జాతీయ పతకాన్ని కైవసం చేసుకుంది.
నిషా మిల్లెట్ 1998 ఆసియా క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆఫ్రో-ఆసియన్ గేమ్స్, ఎస్ఏఎఫ్ గేమ్స్ రెండింటిలోనూ దేశానికి పతకాలు అందించింది. 1999లో జరిగిన జాతీయ క్రీడలలో 14 బంగారు పతకాలు సాధించిన ఏకైక భారతీయ అథ్లెట్ ఆమె. తన కెరీర్ శిఖరాగ్రంలో ఉన్నప్పుడు, ఆమె 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో 200 మీటర్ల ఫ్రీస్టైల్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, అయితే, సెమీ-ఫైనల్స్ కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఒలింపిక్స్ కు బి క్వాలిఫికేషన్ సమయాలను చేరుకున్న మొదటి భారతీయ మహిళ ఆమె. 2002లో వెన్నునొప్పి శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత, ఆమె 2004 ఒలింపిక్ క్రీడలకు దూరంగా ఉంది. ఆమె తల్లిదండ్రులపై పడిన ఆర్థిక భారం కారణంగా ఈత పోటీల నుండి రిటైర్ కావాలని ఆమె నిర్ణయించుకుంది.
ఆమె విజయం వెనకాల బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్ ప్రదీప్ కుమార్ ఉన్నాడని నమ్ముతుంది.
ఆమె బెంగళూరు పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యురాలు కూడా.[2]
అవార్డులు
[మార్చు]- జాతీయ క్రీడలలో ఉత్తమ మహిళా క్రీడాకారిణిగా ప్రధానమంత్రి అవార్డు-1997, 1999.
- మణిపూర్ జాతీయ క్రీడలలో అత్యధిక బంగారు పతకాలు (14) - 1999
- భారతదేశంలోని అత్యున్నత క్రీడాకారులకు అందించే అర్జున అవార్డు-2000
- రాజ్యోత్సవ అవార్డు-2001
- కర్ణాటక రాష్ట్ర ఏకలవ్య అవార్డు-2002
- ఆఫ్రో-ఆసియన్ గేమ్స్, మహిళల బ్యాక్స్ట్రోక్ వెండి పతకం-2003
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 Brijnath, Rohit (30 November 1996). "Indian sportspersons have a hard road to glory". India Today. Retrieved 20 April 2021.
- ↑ (5 February 2022). "The Click In The Ballot".