నిషికాంత్ దూబే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిషికాంత్ దూబే
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
Assumed office
2009 మే 16
అంతకు ముందు వారుఫుర్కాన్ అన్సారీ
నియోజకవర్గంగొడ్డా లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1969-01-28) 1969 జనవరి 28 (వయసు 55)[1]
భాగల్పూర్, బీహార్, భారతదేశం[1]
పౌరసత్వంభారతదేశం
జాతీయతఇండియన్
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ[1]
నివాసంన్యూ ఢిల్లీ & భాగల్పూర్.[1]
చదువుమార్వాడీ కళాశాల, భాగల్పూర్
వృత్తివ్యాపారవేత్త, వ్యవసాయవేత్త & రాజకీయవేత్త.
వెబ్‌సైట్Nishikant Dubey

నిషికాంత్ దూబే (జననం: 1969 జనవరి 28) భారత పార్లమెంటు దిగువ సభ అయిన భారతదేశ 17వ లోక్‌సభ సభ్యుడు. ఇతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు, 2019 మే నుండి జార్ఖండ్‌లోని గొడ్డా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు[2]. ఇతను వరుసగా 15వ (2009-2014), 16వ (2014-2019) లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

విద్య[మార్చు]

నిషికాంత్ దూబే 2009 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు. అంతకు ముందు ఎస్సార్ గ్రూప్‌కు కార్పొరేట్ హెడ్‌గా ఉన్నాడు. ఇతను 2000 సంవత్సరంలో అనామిక గౌతమ్‌ను వివాహం చేసుకున్నాడు[3]. ఇతను భాగల్‌పూర్ మార్వాడీ కళాశాల నుండి బిఎ డిగ్రీని, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, జైపూర్‌లోని ప్రతాప్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందాడు.

పదవులు[మార్చు]

# నుండి కు స్థానం
01 2009 2014 15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
02 2009 2014 ఆర్థిక కమిటీ సభ్యుడు
03 2014 2019 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
04 2014 2019 సభ్యుడు, పిఏసి
05 2019 వర్తమానం 17వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు

ఇది కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "LokSabha2019".
  2. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 2022-09-03.
  3. "Nishikant Dubey| National Portal of India". www.india.gov.in. Retrieved 2022-09-03.