Jump to content

నిహాన్ హిదాంక్యో

వికీపీడియా నుండి
జపాన్ అటామిక్, హైడ్రోజన్ బాంబు బాధితుల సంస్థల కూటమి
Founded1956 అక్టోబరు 10
Focusఅణ్వాయుధాల విముక్తి
కేంద్రస్థానంషిబడైమాన్, మినాటో, టోక్యో
Area servedజపాన్
Methodలాబీయింగ్

నిహాన్ హిదన్క్యో, లేక జపాన్ అటామిక్, హైడ్రోజన్ బాంబు బాధితుల సంస్థల కూటమి, అనేది 1956లో ప్రారంభించిన జపనీస్ సంస్థ. ఇది అణు, పరమాణు బాంబుల బాధితులు (హిబాకుషా) ఈ సంస్థను స్థాపించారు. దీని లక్ష్యాల్లో జపనీస్ ప్రభుత్వాన్ని అణ్వాయుధాల బాధితులకు మెరుగైన సాయం చేయడానికి, ప్రభుత్వాలను న్యూక్లియర్ బాంబులను నిర్మూలించడానికి ఒత్తిడి చేయడం ముఖ్యమైనవి.[1]

అణ్వాయుధ బాధితులు నిహాన్ హిదాంక్యో కార్యకలాపాల్లో

సంస్థ కార్యకలాపాల్లో వేలాదిమంది ప్రత్యక్ష సాక్షుల కథనాలు స్వీకరించి అందించడం, అంతర్జాతీయ అణ్వాయుధ నిర్మూలనకు అనుకూలంగా తీర్మానాలు, అప్పీళ్ళూ చేయడం, ఐక్యరాజ్య సమితితో సహా వివిధ అంతర్జాతీయ సంస్థలకు ఏటా ప్రతినిధులను పంపడం వంటివి ఉన్నాయి.[2]

ఈ సంస్థకు "అణ్వాయుధాల వాడకంలో ప్రత్యక్ష సాక్షుల దృష్టాంతాల ద్వారా అణ్వాయుధాలు తిరిగి ఉపయోగించకూడదని, అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని రూపుదిద్దాలని ప్రదర్శించే" పని చేస్తున్నందుకు 2024లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు.[2]

గౌరవాలు

[మార్చు]
  • 2010: సామాజిక క్రియాశీలతకు అవార్డు (నోబెల్ శాంతి గ్రహీతల ప్రపంచ శిఖరాగ్ర సమావేశం)
  • 1985, 1994, 2015: స్విట్జర్లాండ్లో నెలకొన్న అంతర్జాతీయ శాంతి బ్యూరో (IPB) హిడన్కోను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది.[3][4]
  • 2024 నోబెల్ శాంతి బహుమతి

మూలాలు

[మార్చు]
  1. "Welcome to HIDANKYO". Japan Confederation of A- and H-Bomb Sufferers Organization (Nihon Hidankyo) website. Retrieved 2007-08-31.
  2. 2.0 2.1 Royen, Ulrika (2024-10-11). "Press release". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-11.
  3. Ne.jp
  4. Atomic bomb survivors nominated for Nobel prize | The Japan Times. They were awarded the Nobel Peace Price in 2024.

బయటి లింకులు

[మార్చు]