Jump to content

నిహారీ

వికీపీడియా నుండి
నిహారి
ఢిల్లీలో ఖమిరి రోటీతో వడ్డించిన నిహారి
Courseప్రధాన వంటకం (అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం)
మూల స్థానంభారత ఉపఖండం
రాష్ట్రంలక్నో, ఢిల్లీ[1][2]
Associated cuisineభారతీయ (అవధీ), పాకిస్తానీ, బంగ్లాదేశీ[3]
ఆవిష్కరణ18వ శతాబ్దం
వడ్డించే ఉష్టోగ్రతవేడిగా
ప్రధాన అనుఘటకాలుషాంక్ ముక్కలుగొర్రె మాంసం, మేక మాంసం, ఒంటె మాంసం, కోడి మాంసం, ఎముక మజ్జిగ
Other informationనాన్, అన్నం లేదా రోటీతో వడ్డిస్తారు

నిహారి (హిందీ: निहारी, ఉర్దూ: نہاری) భారత ఉపఖండానికి చెందిన ఒక స్ట్యూ వంటకం. ఇది నెమ్మదిగా ఉడికించిన మాంసంతో తయారవుతుంది. ముఖ్యంగా షాంక్ ముక్కలు అయిన గొర్రె మాంసం, మేక మాంసం, గేదె మాంసం, అలాగే కోడి మాంసం, ఎముక మజ్జ తో దీనిని తయారు చేస్తారు. నిహారి ఆవిర్భావంపై ఉన్న రెండు ప్రధాన అభిప్రాయాల ప్రకారం, ఇది మొఘల్ సామ్రాజ్యం కాలంలో భారతదేశంలోని లక్నో లేదా ఢిల్లీ నగరాల్లో పుట్టిన వంటకమని భావిస్తారు.[4][1][2] దీనికి పిప్పలి అనే నల్ల మిరియాలుకు సంబంధించిన సుగంధ ద్రవ్యంతో రుచిని అందిస్తారు. దీనిని సాధారణంగా నాన్, రోటీ లేదా అన్నంతో వడ్డిస్తారు.

వ్యుత్పత్తి

[మార్చు]

హిందీ-ఉర్దూ పదమైన nihari అరబిక్ పదమైన nahâr (نهار) నుండి ఉద్భవించింది. దీని అర్థం "ఉదయం".[5][4][6][7] మొఘల్ సామ్రాజ్య కాలంలో నవాబులు ఫజ్ర్ నమాజ్ అనంతరం అల్పాహారంగా దీనిని తినేవారని చెబుతారు.[4][7] సాధారణంగా ఇది ఉదయం వడ్డించబడుతుంది. అయితే ఢిల్లీలోని కల్లూ మియాన్ వంటి కొన్ని ప్రసిద్ధ భోజనశాలలు దీనిని మధ్యాహ్నం కూడా వడ్డిస్తాయి.[8]

చరిత్ర

[మార్చు]
సౌదీ అరేబియాలోని రాస్ తనూరాలో ఒక కరాచీ వంటకారుడు తయారు చేసిన బీఫ్ నిహారి — అల్లం, కొత్తిమీర ఆకులు, పచ్చిమిర్చితో అలంకరించబడింది.

నిహారి యొక్క ఖచ్చితమైన ఆవిర్భావ స్థానం గురించి వంటకాల చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ది బ్లూమ్స్‌బరీ హ్యాండ్‌బుక్ ఆఫ్ ఇండియన్ కుయిజిన్ ప్రకారం, ఈ వంటకం భారతదేశంలోని లక్నో లేదా ఢిల్లీ నగరాల్లో పుట్టి ఉండవచ్చని పేర్కొంటుంది.[1] విస్తృతంగా అంగీకరించబడిన ఒక అభిప్రాయం ప్రకారం, నిహారి 18వ శతాబ్దం చివరలో మొఘల్ సామ్రాజ్యం చివరి దశలో భారతదేశంలోని లక్నో నగరంలోని అవధ్ రాజవంటశాలల్లో పుట్టిందని భావిస్తారు.[6][9]

మరో సిద్ధాంతం ప్రకారం, ఈ వంటకం భారతదేశ మధ్యయుగ కాలంలో ఢిల్లీలో ఆవిర్భవించింది.[1][2] అనంతరం ఈ వంటకం విస్తృత ప్రజాదరణ పొందింది. తరువాత ఇది మొఘల్ యుగంలోని నవాబుల రాజవంటకాలలో ఒక ముఖ్యమైన వంటకంగా మారి, భారత ఉపఖండమంతటా ప్రాచుర్యం పొందింది.[10][11]

ప్రజాదరణ

[మార్చు]

నిహారి భారతదేశంలోని లక్నో, ఢిల్లీ,, భోపాల్ నగరాలకు చెందిన సాంప్రదాయ వంటకం.[8] 1947లో జరిగిన భారత విభజన అనంతరం, ఉత్తర భారతదేశంకు చెందిన అనేక ఉర్దూ మాట్లాడే ముస్లింలు పశ్చిమ పాకిస్తాన్ లోని కరాచీకి, తూర్పు పాకిస్తాన్లోని ఢాకాకు వలస వెళ్లారు. వారు అక్కడ నిహారి వడ్డించే అనేక భోజనశాలలను స్థాపించారు. కరాచీలో నిహారి విపరీత ప్రజాదరణ పొందింది. అనంతరం ఇది పాకిస్తాన్ అంతటా విస్తరించి ప్రముఖ వంటకంగా మారింది.[12] నిహారి బంగ్లాదేశ్లో కూడా విస్తృతంగా తినబడుతుంది.[8]

కొన్ని భోజనశాలల్లో, ప్రతి రోజు మిగిలిపోయిన నిహారి నుండి కొంత భాగాన్ని తరువాతి రోజు తయారుచేసే నిహారిలో కలుపుతారు. ఈ పునర్వినియోగ భాగాన్ని taar అని పిలుస్తారు. ఇది ప్రత్యేకమైన రుచిని ఇస్తుందని నమ్ముతారు. పాత ఢిల్లీలోని కొన్ని నిహారి దుకాణాలు శతాబ్దానికి పైగా నిరంతరంగా ఈ taar సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంటాయి.[13] నిహారిని సాధారణంగా ఖమిరి రోటీతో కలిసి తింటారు.[14][15]

ఔషధ వినియోగాలు

[మార్చు]

నిహారిని ఇంటి వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా జ్వరం, ముక్కు కారడం, సాధారణ జలుబు వంటి సమస్యలకు ఇది ఉపశమనంగా ఉపయోగించబడుతుందని నమ్ముతారు.[16]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 Sen, Colleen Taylor; Bhattacharyya, Sourish; Saberi, Helen (23 February 2023). The Bloomsbury Handbook of Indian Cuisine (in ఇంగ్లీష్). Bloomsbury Publishing. ISBN 978-1-350-12864-4. Some claim it originated in Delhi in the late eighteenth century, others that ir originated in the kitchens of Awadh (see Lucknow).
  2. 1 2 3 Hussain, Sadaf (14 January 2025). "Food history: How nihari went from being the humble food of the poor to a dish for the high table" (in ఇంగ్లీష్). Scroll.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 March 2026. The debate intensifies when the origins of nihari are discussed, with proponents from both Delhi and Lucknow vying for the culinary crown.
  3. Sen, Colleen Taylor; Bhattacharyya, Sourish; Saberi, Helen (23 February 2023). The Bloomsbury Handbook of Indian Cuisine. Bloomsbury Publishing. p. 258. ISBN 978-1-350-12864-4.
  4. 1 2 3 Sengupta, Sushmita (3 January 2018). "Nihari: History Of The Meaty and Buttery Breakfast Staple of The Mughals". NDTV Food. the original నుండి 4 ఆగస్టు 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 January 2018.
  5. McGregor, Ronald Stuart (1993). The Oxford Hindi-English Dictionary (in ఇంగ్లీష్). Oxford University Press. p. 576. ISBN 978-0-19-864317-3.
  6. 1 2 Chakravorty, Deblina (12 April 2012). "Nihari, a gift from Nawabs". The Times of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 March 2016.
  7. 1 2 "Nihari- historical recipe". Homtainment. 23 December 2020. the original నుండి 27 May 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 December 2020.
  8. 1 2 3 Sen, Colleen Taylor; Bhattacharyya, Sourish; Saberi, Helen (23 February 2023). The Bloomsbury Handbook of Indian Cuisine (in ఇంగ్లీష్). Bloomsbury Publishing. ISBN 978-1-350-12864-4.
  9. Husain, Chef Izzat (16 August 2018). Izzat Ka Khana: Mughlai Cuisine Recipes (in ఇంగ్లీష్). Notion Press. p. 06. ISBN 978-1643241500. The well known Nihari originated in Lucknow during the construction of the Rumi Gate; It was invented for labourers who worked for construction in huge numbers. A vital food was required for workers, then some Bawarchis, the Chefs, and Hakeems, the medicos decided to cock the dish with the whole buff in a large vessel prepared overnight with some energetic spices and herbs. A whole buff cooked in a large dek and was served with tandoori roti. All the workers were served in the Morning. Nehar is a Arabic word which means "Morning" therefore it got its term "Nahari." When the taste and other benefits of Nahari got popular widely among officials including the king, who turned a fan of Nahari himself. Then he ordered Nahari for his royal kitchen. Later, Nahari was placed in the menu of the royal kitchen moderating with a lot of improvements, which was later turned into "Shahi-Nahari." Apparently, Delhi and Lahore were also administrative cities that time. Nehari also toured these cities, and it was stretched to the world of Urdu speaking nations. One can easily observe its popularity among the restaurants of Lucknow along with the double layered crispy kulcha.
  10. "In celebration of winter's perfect dish, the mutton nihari!". Hindustan Times (in ఇంగ్లీష్). 4 November 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 January 2021.
  11. "Do you know what is Nalli Nihari? History of Nihari and recipe of Nalli Nihari". infusecooking.com. 29 June 2021. the original నుండి 6 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 June 2022.
  12. Noorani, Asif. "Nihari a la Mexican style". The Hindu Business Line. ఒరిజినల్ నుండి 23 May 2013 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 March 2016.
  13. Sengupta, Sushmita (20 January 2022). "Nihari's 'Taar' to Dahi's 'Jamun': The Desi Art Of Using Remains Of Previous Batch To Flavour Next". Slurrp.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2023.
  14. Ahuja, Aashna (9 September 2017). "The Legacy of Kallu Mian, Old Delhi's Legendary Nihari Walla". NDTV. the original నుండి 19 ఏప్రిల్ 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 March 2026.
  15. Deepak, Sharanya (8 January 2016). "The Indian Meal That Is a National Sentiment, a Political Rebellion, and a Piece of History". Roads & Kingdoms. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 March 2026.
  16. "What is Nihari?". indiacurry.com. the original నుండి 19 December 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 November 2014.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నిహారీ&oldid=4870990" నుండి వెలికితీశారు