నీతి శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నీతి శతకము

సీ|| తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు,
వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు,
లక్షాధికారైన లవణ మన్న మెకాని,
మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు,
విత్తమార్జనఁజేసి వబోఁవిఱ్ఱవీఁగుటె కాని,
కూడఁబెట్టిన సొమ్ము గుడుడు,
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి
దానధర్మము లేక దాఁచి దాఁచి,

తే|| తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?
తేనె జుంటీ గ లియ్యవా తెరువరులకు? భూ.


�సీ|| లోకమం దెవఁడైన లోభిమానవుఁడున్నభిక్షమర్ధికిఁ జేతఁ బెట్టలేఁడు,
తాను బెట్టకయున్నఁ దగవు పుట్టదుకాని
యొరులు పెట్టఁగజూచి యోర్వలేఁడు,
దాతదగ్గఱఁ జేరి తన ముల్లె పోయినట్లు
జిహ్వతోఁ జాడీలు చెప్పు చుండు
ఫలము విఘ్నంబైనఁబలు సంతసము నందు,మేలుకలిగినఁ జాల మిణుఁకుచుండు,

తే|| శ్రీరమానాధ ! యిటువంటి క్రూరునకును
భిక్షుకుల శత్రువని పేరు బెట్టవచ్చు, భూ.

అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మోగినట్లు కనకంబు మోగునా
విశ్వదాభిరామ వినుర వేమ!

విశ్వానికి నీతిని భోధించే ఓ వేమనా! కంచు వస్తువు మ్రోగునట్లు బంగారు వస్తువు మ్రోగదు కదా! అలాగే నీచుడు ఎప్పుడూ మంచివానిలా మాట్లాడలేడు!

స్త్రీల ఎడ వాదులాడక
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!

తాత్పర్యము: స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!

తాత్పర్యము:అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.