నీదీ నాదీ ఒకే కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీదీ నాదీ ఒకే కథ
దర్శకత్వంవేణు ఊడుగుల
నిర్మాతప్రశాంతి, కృష్ణ విజయ్‌
స్క్రీన్ ప్లేవేణు ఊడుగుల
కథవేణు ఊడుగుల
నటులు
సంగీతంసురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణంరాజ్‌ తోట, పర్వీజ్‌ కె
నిర్మాణ సంస్థ
ఆరాన్‌ మీడియా వర్క్స్‌, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌
విడుదల
23 మార్చి 2018 (2018-03-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

నీదీ నాదీ ఒకే కథ 2018 మార్చి 23న విడుదలైన తెలుగు సినిమా.[1] వేణు ఊడుగుల దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, సత్నా టైటస్ జంటగా నటించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.

కథ[మార్చు]

నాలుగు సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం అందుకున్న రుద్రరాజు దేవీ ప్రసాద్‌(దేవీ ప్రసాద్‌) కుమారుడు రుద్రరాజు సాగర్‌ (శ్రీ విష్ణు). పండిత పుత్ర పరమ శుంఠః అన్నట్టుగా చదువుల్లో చాలా వెనకబడి ఉంటాడు. డిగ్రీ అతి కష్టం మీద తన చెల్లెలితో కలిసి పరీక్షలు రాస్తాడు. చదువు అస్సలు ఎక్కదు. పరీక్షలంటే భయం. కానీ, తన తండ్రి ఆనందం కోసం ఏదైనా చేద్దామని తహతహలాడుతుంటాడు. అందుకోసం వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతూ, ఆ తరగతులకు వెళ్తూ తనని తాను మార్చుకుంటూ.. నాన్నకు నచ్చేట్లుగా బతకడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఆ ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. ఈ ప్రయత్నంలో సాగర్‌ ఏం తెలుసుకున్నాడు? జీవితానికి, జీవితంలో స్థిర పడటానికి తనిచ్చిన నిర్వచనం ఏంటి? అనేదే మిగిలిన కథ.[2]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • రచన & దర్శకత్వం: వేణు ఊడుగుల
 • సంగీతం: సురేష్‌ బొబ్బిలి
 • ఛాయాగ్రహణం: రాజ్‌ తోట, పర్వీజ్‌ కె
 • స్క్రీన్ ప్లే సహకారం; మోహన్ సాటో
 • కూర్పు: బి.నాగేశ్వరరెడ్డి
 • కళ: టి.ఎన్‌.ప్రసాద్‌
 • నిర్మాత: ప్రశాంతి, కృష్ణ విజయ్‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు వూడుగుల
 • బ్యానర్‌: ఆరాన్‌ మీడియా వర్క్స్‌, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌
 • సమర్పణ: నారా రోహిత్‌, అట్లూరి నారాయణ రావు

ప్రచార చిత్రం[మార్చు]

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం నీది నాది ఒకే కథ . సత్నా టిటస్‌(బిచ్చగాడు ఫేం)కథానాయిక. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. 2018 మార్చి 16 శుక్రవారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదలైంది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ఎంత చదివినా గుర్తుంచుకోని సగటు విద్యార్థిగా సాగర్‌ అనే పాత్రలో శ్రీవిష్ణు కనిపించనున్నారు. 'ఒక రకంగా చెప్పాంటే మీలా అవ్వాలని ధార్మికగారూ అని కథానాయికను శ్రీవిష్ణు అడుగుతుంటే .. 'చూడు సాగర్‌.. నేనేదో గ్రేట్‌ కాదు కానీ, నీలాంటి వేస్ట్‌ ఫెలోస్‌ను మార్చడంలో నాకో తృప్తి ఉంటుందీ అంటూ ఆమె చెప్పడం నవ్వులు పూయిస్తోంది.

'నవ్వు రావడం, కోపం రావడం, బాధ కలగడం ఇవన్నీ బేసిక్‌ హ్యూమన్‌ ఎమోషన్స్‌ కదా ' అంటూ శ్రీవిష్ణు ప్రశ్నించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఒత్తిడిని తట్టుకుని సాగర్‌ చదువులో రాణించాడా? తన తండ్రికి నచ్చేలా మారాలన్న తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అన్నదే 'నీది నాది ఒకే కథ '. ఈ సినిమాకు సురేష్‌ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆరాన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్‌ సినిమాను నిర్మిస్తున్నారు.[3]

పాటలు[మార్చు]

 1. ఈ సినిమాలో హృదయమెంత తపిస్తే.. బతుకు విలువ తెలిసింది అనే గజల్ ను స్వరూపరాణి పాడింది.[4]

మూలాలు[మార్చు]

 1. ఎన్.టివి తెలుగు (23 March 2018). "రివ్యూ: నీది నాది ఒకే కథ". Retrieved 23 March 2018. Cite news requires |newspaper= (help)
 2. "Needi Naadi Oke Katha Review". www.chitramala.in. 2018-03-22. Retrieved 2018-03-23. Cite web requires |website= (help)
 3. "'నీది నాది ఒకే కథ' ట్రైలర్‌ చూశారా!". ఈనాడు. 2018-03-16. Retrieved 2018-03-16. Cite web requires |website= (help)
 4. ప్రజాశక్తి, ఫీచర్స్ (8 April 2018). "హృద‌యాన్ని త‌ట్టి‌న గ‌జ‌ల్ స్వ‌రూపం". గంగాధర్‌ వీర్ల. మూలం నుండి 28 June 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 28 June 2019. Cite news requires |newspaper= (help)

బయటి లంకెలు[మార్చు]