నీనా వర్మ
| నీనా విక్రమ్ వర్మ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2013 డిసెంబరు 8 | |||
| నియోజకవర్గం | ధార్ | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1957 అక్టోబరు 19[1] అజ్మీర్, రాజస్థాన్, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | విక్రమ్ వర్మ | ||
| బంధువులు | పర్వేశ్ వర్మ (అల్లుడు)[2] | ||
| సంతానం | 3 కుమార్తెలు | ||
| నివాసం | భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం | ||
నీనా వర్మ (19 అక్టోబర్ 1957) మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు ధార్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3]
నీనా వర్మ మాజీ కేంద్రమంత్రి విక్రమ్ వర్మ భార్య, ఆమె అల్లుడు పర్వేశ్ వర్మ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి.
రాజకీయ జీవితం
[మార్చు]నీనా వర్మ తన భర్త మాజీ కేంద్రమంత్రి విక్రమ్ వర్మ అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ధార్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బాల్ముకుంద్ సింగ్ గౌతమ్ పై కేవలం 1 ఓటు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4] కానీ 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టులో బాల్ముకుంద్ సింగ్ నీనా వర్మ ఎన్నిక, పోస్టల్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగిందని సవాలు చేయడంతో విచారణ చేసిన కోర్టు 14 ఆగస్టు 2013న ఎన్నికైనట్లు ప్రకటించగా ఆయన 24 సెప్టెంబర్ 2013న ప్రమాణ స్వీకారం చేశాడు.[5][6]
నీనా వర్మ 2013 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ధార్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బాల్ముకుంద్ సింగ్ గౌతమ్ పై 11482 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[7] ఆమె 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రభా బాల్ముకుంద్ సింగ్ గౌతమ్ పై 5718 ఓట్ల ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[8]
నీనా వర్మ 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ధార్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బాల్ముకుంద్ సింగ్ గౌతమ్ పై 9694 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[9]
మూలాలు
[మార్చు]- ↑ "Archived copy". Archived from the original on 2 November 2014. Retrieved 26 March 2021.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ "Neena Verma, Parvesh Verma's mother-in-law, whose husband was a minister in Vajpayee government, she was BJP MLA from..., now in..." (in ఇంగ్లీష్). India. Com. 27 February 2025. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
- ↑ "Dhar Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
- ↑ "Madhya Pradesh Pollmeter: Never too late". The Hindu. 5 November 2013. Retrieved 5 November 2013.
- ↑ "MP HC declares Cong candidate Balmukund Singh winner from Dhar". CNN-IBN. Press Trust of India. 14 August 2013. Archived from the original on 15 October 2013. Retrieved 6 November 2013.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ "Madya Pradesh Assembly Election Results - 2025". Election Commission of India. 3 December 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.