నీరజ్ కుష్వాహ మౌర్య
| నీరజ్ కుష్వాహ మౌర్య | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
| ముందు | ధర్మేంద్ర కశ్యప్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | అయోన్లా | ||
| పదవీ కాలం 2007 – 2017 | |||
| ముందు | శరద్‌వీర్ సింగ్ | ||
| తరువాత | శరద్‌వీర్ సింగ్ | ||
| నియోజకవర్గం | జలాలాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1969 జులై 7 లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | సమాజ్‌వాదీ పార్టీ | ||
| తల్లిదండ్రులు | నల్నీష్ మౌర్య | ||
| జీవిత భాగస్వామి | రష్మి మౌర్య | ||
| సంతానం | 1 కొడుకు, 1 కూతురు | ||
| నివాసం | షాజహాన్‌పూర్ | ||
| పూర్వ విద్యార్థి | విద్యాంత్ హిందూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాల, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| [1][2] | |||
నీరజ్ కుష్వాహ మౌర్య (జననం 7 జూలై 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అయోన్లా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]నీరజ్ కుష్వాహ మౌర్య 1969 జూలై 7న లక్నోలోని సమేసిలో జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్య లక్నోలో, ఆ తరువాత విద్యావంత్ హిందూ పీజీ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]నీరజ్ కుష్వాహా తన రాజకీయ జీవితాన్ని 2000లో బీఎస్‌పీతో ప్రారంభించి 2007 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జలాలాబాద్ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి రామ్ మూర్తి సింగ్ వర్మపై 3659 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2012 శాసనసభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి రామ్ మూర్తి సింగ్ వర్మపై 550 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
నీరజ్ కుష్వాహ మౌర్య 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అయోన్లా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ధర్మేంద్ర కశ్యప్ పై 15,969 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Candidate affidavit". My neta.info. Archived from the original on 22 December 2015. Retrieved December 16, 2015.
- ↑ "Member Profile" (PDF). Legislative Assembly official website. Retrieved December 16, 2015.
- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ "आंवला लोकसभा सीट से जीतने वाले सपा के नीरज मौर्य कौन हैं, जानिए अपने सांसद को" (in హిందీ). TV9 Bharatvarsh. 6 June 2024. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Aonla" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 6 June 2024. Retrieved 19 February 2025.