నీలకంఠ శర్మ
Appearance
షాంగ్లాక్పమ్ నీలకంఠ శర్మ(జననం 1995 మే 2) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. భారత జాతీయ హాకీ జట్టులో మిడ్ ఫీల్డర్ గా ఆడుతాడు.[1]
2016 పురుషుల ప్రపంచ కప్(జూనియర్), 2020 టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్నాడు.
కెరీర్
[మార్చు]మణిపూర్ రాష్ట్రం ఇంపాల్ జిల్లాలోని కొంత ఆహాళ్లుపీ కి చెందిన నీలకంఠ శర్మ 2003 నుండి హాకీ ఆడటం నేర్చుకున్నాడు. 2011 వరకు పోస్టరియర్ హాకీ అకాడెమీకి ఆడిన ఇతను ఆ తరువాత భోపాల్ హాకీ అకాడెమీలో చేరాడు.[2] 2014 సుల్తాన్ జోహార్ కప్ జూనియర్ జట్టుకు ఎంపికయ్యాడు అలాగే హాకీ ఇండియా లీగ్ లో దబాంగ్ ముంబై జట్టులో చేరాడు.[3]
బయటి లంకెలు
[మార్చు]- నీలకంఠ శర్మ(హాకీ ఇండియా) Archived 2017-10-08 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- ↑ Mehta, Rutvick (8 December 2016). "Know Indian Junior men's hockey team". DNA India. Retrieved 31 July 2017.
- ↑ "Nilakanta selected for Jr Hockey team". E-Pao!. 23 September 2014. Retrieved 31 July 2017.
- ↑ Sapam, Robert (6 January 2017). "Nilakanta eyes senior show - Hockey player upbeat". The Telegraph. Retrieved 31 July 2017.