Jump to content

నువ్వు కూడానా , బ్రూటస్ ?

వికీపీడియా నుండి
1623 నుండి మొదటి ఫోలియో షేక్స్పియర్ యొక్క తియ్యని పంక్తి "ఎట్ టు బ్రూటే?"
1888లో విలియం హోమ్స్ సల్లివన్ రూపొందించిన ఈ పెయింటింగ్ పేరు తెలుగు లో "నువ్వు కూడన బ్రూటస్" . ఇది రాయల్ షేక్స్పియర్ థియేటర్ ఉంది.
1937లో సీజర్ యొక్క మెర్క్యురీ థియేటర్ నిర్మాణానికి సంబంధించిన ఛాయాచిత్రం, ఈ సన్నివేశంలో జూలియస్ సీజర్ (జోసెఫ్ హాలండ్, సెంటర్) బ్రూటస్ (ఆర్సన్ వెల్స్, ఎడమ) తో సహా కుట్రదారులందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు..

Et tu, Brute? ? ( [εt ˈtuː ˈbruːtː]] అనేది లాటిన్ భాష లోని ఒక ప్రసిద్ధ వాక్యము. దీని నేరు అర్థం "మరి నువ్వు , బ్రూటస్?" అని కానీ "నువ్వు కూడా , బ్రూటస్?" అని చెప్పవ చ్చు.ఇది, తరచుగా అనువదించబడింది. "నువ్వు అలాగే న , బ్రూటస్ ?", "నువ్వు కూడా నా , బ్రూటసు?", అని కూడా అనువదించ వచ్చు. ఈ ఉక్తి విలియం షేక్స్పియర్ రచించిన జూలియస్ సీజర్ నాటకం లోని మూడవ అంకం, మొదటి దృశ్యం లో వస్తుంది. రోమన్ నియంత సీజర్ , అతని హత్య జరుగుతున్న సమయంలో, అతని స్నేహితుడు మార్కస్ జూనియస్ బ్రూటస్ హంతకులలో ఒకడిగా గుర్తించినప్పుడు మాట్లాడినది. [1] వ్యాప్తిలో ఉన్న నమ్మకానికి విరుద్ధంగా, ఈ పదాలు నాటకంలో సీజర్ చివరి మాటలు కావు, వీటి తర్వాత అతడు "అయితే , కూలిపో సీజర్" అని అంటాడు [2] ఈ వాక్యం తొలిసారిగా షేక్స్పియర్ రచించిన హెన్రీ VI, పార్ట్ 3 నాటకంలోనూ, అంతకంటే ముందుగా రిచర్డ్ ఈడ్స్ రచించిన సీజర్ ఇంటర్‌ఫెక్టస్ అనే నాటకంలోనూ కనిపించినట్లు చెబుతారు.

చారిత్రకం గా సీజర్ ఈ మాటలు మాట్లాడాడని ఆధారాలు ఏమి లేవు. .[3] సీజర్ యొక్క చివరి మాటలు ఖచ్చితంగా ఏమిటన్నది తెలియదు. అయితే, ఈ సంఘటన జరిగిన ఒకటిన్నర శతాబ్దం తరువాత జీవించిన రోమన్ చరిత్రకారుడు సూటోనియస్ ప్రకారం, సీజర్ మరణించేటప్పుడు, ఏ మాటా మాట్లాడ లేదని చెప్పాడు, కాని మరికొందరు , సీజర్ యొక్క చివరి మాటలు గ్రీకు భాష లోని "కై స్యూ, టెక్నాన్" (και σύ, τέκνονη అనే పద సముదాయం అంటారు. ఈ గ్రీకు పద బంధానికి " నువ్వు బిడ్డా " "నువ్వు యువకడా " అనే అర్థం వస్తుంది. [4]

వ్యుత్పత్తి శాస్త్రం

[మార్చు]

బ్రూటస్ అనే పేరు, రెండో విభక్తికి చెందిన పుల్లింగ నామ వాచకం. ఈ పద బంధంలో అది సంబోధనా విభక్తి (vocative case) లో కనిపిస్తుంది అందువల్ల నామవాచక విభక్తి (nominative case) లో ఉండే -us అన్న అంత్య స్థానంలో -e అని వస్తుంది .[5]

సందర్భం

[మార్చు]

క్రీ. పూ 44 వ సంవత్సరంలో , చారిత్రిక వ్యక్తి అయిన సీజర్ పై , బ్రూటస్ తో కలిసి ఉన్న ఒక సెనేటర్ల గుంపు దాడి చేసింది. బ్రూటస్, సీజర్ కి స్నేహితుడూ, శిష్యుడు కాగా , సీజర్ మొదట్లో తన పై దాడి చేసేవారిని ఎదిరించాడు. కానీ అతను బ్రూటస్ ను చూసినప్పుడు, మరణించే క్షణంలో సీజర్ అలా ప్రతి స్పందించాడని నివేదించ బడింది. సూటోనియస్ ఈ వాక్యాన్ని కేవలం ఒక పుకారుగా నిర్దేశించాడు . అలాగే ప్లూటార్క్ కూడా , సీజర్ ఏమీ చెప్పలేదని, కుట్రదారులలో బ్రూటస్ ను చూసినప్పుడు కేవలం తన టోగా ను తలపై నుండి లాగినట్లు నివేదించాడు.

షేక్స్పియర్ రాసిన జూలియస్ సీజర్ (1599) నాటకంలో సీజర్ "నువ్వు కూడానా , బ్రూటస్ ?" అన్న దాన్ని నాటకంలో ఉపయోగించడం తొలి సందర్భం కాదు. [6] ఎడ్మండ్ మలోన్ ప్రకారం, ఈ వాక్యం ఇప్పుడు లభించని ఒక రచనలో, రిచర్డ్ ఎడెస్ యొక్క లాటిన్ నాటకం సీజర్ ఇంటర్ఫెక్టస్ -1582 లో కనిపించింది అని పేర్కొన్నాడు. అదే విధంగా షేక్స్పియర్ రాసిన మరొ నాటకం, " ది ట్రూ ట్రేజడీస్ ఆఫ్ రిచర్డ్ డ్యూక్ ఆఫ్ యార్క్, అండ్ ది డెత్ ఆఫ్ గుడ్ కింగ్ హెన్రీ ది సిక్స్త్, విత్ ది హోల్ కంటెన్షన్ బిట్వీన్ ది టూ హౌసెస్ లాంకెష్టర్ అండ్ యార్క్ ఆఫ్ 1595" లో కూడా ఈ పదముంది. ఇది హెన్రీ VI పార్ట్ 3 కు సంబందించి, ముద్రించబడిన పాత రూపం. [7][8]

వివరణ

[మార్చు]

ఈ పదాన్ని ఒక శాపం లేదా హెచ్చరికగా అర్థం చేసుకోవచ్చని వాదించబడింది. . ఒక సిద్ధాంతం ప్రకారం సీజర్ రోమన్లకు చాలా కాలం నుండి నానుడిగా ఒక గ్రీకు వాక్యం యొక్క పదాలను స్వీకరించాడని పేర్కొంది. ఆ పూర్తి వాక్యం ఇలా ఉందని చెపుతారు "నా కుమారుడా, నీవు కూడా, అధికారాన్ని రుచి చూస్తావు " . బ్రూటస్ తన పై చేసిన హత్యకు ప్రతిస్పందనగా, .[9] అతనికి రానున్న హింసాత్మక మరణాన్ని సూచించడానికి ఆ వాక్యం లోని ప్రారంభ వాక్యాలు వాడేడని భావిస్తారు. సుమారు క్రీ పూ 30 లో హొరేస్ రాసిన సెటైరశ్ పుస్తకం I, 7 వ పద్యంలో బ్రూటస్ గురించి , అతను చేసిన నియంత హత్య ని గురించి ప్రస్తావించ బడ్డాయి. రచయిత జాన్ హెండర్సన్ ఈ-టి-యు-బ్రి-యు-ఇ అని మధ్యలో విరామ చిహ్నాలతో వ్రాసిన ఈ వ్యక్తీకరణ ను " అనుకరణాత్మక బలవంతపు (mimetic compulsion) సూచన ఉన్న ఫిర్యాదు "అనుకోవచ్చు[10]

వారసత్వం.

[మార్చు]

జేమ్స్ జాయిస్ తొమ్మిదేళ్ల వయసులో చార్లెస్ స్టీవర్ట్ పార్నెల్ గురించి "ఎట్ తు, హీలే" అనే కవిత రాశాడు .[11] ఆ కవిత, ఐరిష్ కాథలిక్ చర్చి, ఐరిష్ పార్లమెంటరీ పార్టీ , బ్రిటిష్ లిబరల్ పార్టీ లు ఉమ్మడిగా పార్నెల్ కు చేసిన ద్రోహానికి ఫలితంగా వచ్చిన స్పందన . దీని ఫలితంగా బ్రిటిష్ పార్లమెంటులో ఐరిష్ హోమ్ రూలు ను సాధించడం లో వారు సంయుక్తంగా విఫలమయ్యారని భావించ బడింది.[12]

జాయ్స్ సోదరుడు స్టానిస్లాస్ ఈ కవితను ఇలా వర్ణించాడు: “క్యాథలిక్ బిషప్పుల ఆదేశాల మేరకు, తన వైఖరిని మార్చుకొని పార్నెల్‌కు తీవ్ర శత్రువుగా మారిన ద్రోహి టిమ్ హీలీపై చేసిన ఒక తీవ్ర విమర్శ ఇది. అందువల్ల, ఈ రచన నా తండ్రి ప్రతి రాత్రి మత్తులో ఉండి బల్లలను బలంగా కొడుతూ చేసే రాజకీయ ఆగ్రహభరిత వాగ్వాదాలకు ప్రతిధ్వనిలా ఉంది"..[13]

మూలాలు

[మార్చు]
  1. "No Fear Shakespeare: Julius Caesar: Act 3 Scene 1 Page 5 | SparkNotes". www.sparknotes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-21.
  2. "Et tu, Brute?". The Guardian. Guardian News and Media Limited. Retrieved 25 January 2019.
  3. "Et tu, Brute?". The Guardian. Guardian News and Media Limited. Retrieved 25 January 2019.
  4. Billows, Richard A. (2009). Julius Caesar: The Colossus of Rome. London: Routledge. pp. 249–250. ISBN 978-0-415-33314-6.
  5. "No Fear Shakespeare: Julius Caesar: Act 3 Scene 1 Page 5 | SparkNotes". www.sparknotes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-21.
  6. "No Fear Shakespeare: Julius Caesar: Act 3 Scene 1 Page 5 | SparkNotes". www.sparknotes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-21.
  7. "Et tu, Brute?". The Guardian. Guardian News and Media Limited. Retrieved 25 January 2019.
  8. "No Fear Shakespeare: Julius Caesar: Act 3 Scene 1 Page 5 | SparkNotes". www.sparknotes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-21.
  9. "Et tu, Brute?". The Guardian. Guardian News and Media Limited. Retrieved 25 January 2019.
  10. Henderson, John (1998). Fighting for Rome: Poets and Caesars, History, and Civil War. Cambridge University Press. ISBN 0-521-58026-9.
  11. "No Fear Shakespeare: Julius Caesar: Act 3 Scene 1 Page 5 | SparkNotes". www.sparknotes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-21.
  12. "Et tu, Brute?". The Guardian. Guardian News and Media Limited. Retrieved 25 January 2019.
  13. "No Fear Shakespeare: Julius Caesar: Act 3 Scene 1 Page 5 | SparkNotes". www.sparknotes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-21.