నువ్వు నేను ఒకటవుదాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నువ్వు నేను ఒకటవుదాం
దర్శకత్వంపి. నర్సింహారెడ్డి
రచనరాజేంద్ర భరద్వాజ్
కథరాజేంద్ర భరద్వాజ్
నిర్మాతగుర్రాల కృష్ణారెడ్డి
తారాగణంరంజిత్ సోమి
ఫాతిమాసనా షేక్
ఆలీ
జయప్రకాశ్ రెడ్డి
ఛాయాగ్రహణంసంతోష్ శానమోని
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంరామ్ నారాయణ్
నిర్మాణ
సంస్థ
జీకేఆర్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
ఫిబ్రవరి 20, 2015
సినిమా నిడివి
135 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నువ్వు నేను ఒకటవుదాం 2015 ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. జీకేఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై గుర్రాల కృష్ణారెడ్డి నిర్మిచిన ఈ చిత్రానికి పి. నర్సింహారెడ్డి దర్శకత్వం వహించగా రంజిత్ సోమి, ఫాతిమా సనా షేక్, బెనర్జీ, ఆలి, జయప్రకాశ్ రెడ్డి ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి కథ, మాటలు రాజేంద్ర భరద్వాజ్ అందించారు. రామ్ నారాయణ్ సంగీత దర్శకుడిగా, ప్రవీణ్ పూడి ఎడిటరుగా పనిచేసారు. నందు  పోరాట సన్నివేశాలు తెరకెక్కించారు.[1]

కథా నేపథ్యం[మార్చు]

అభి (రంజిత్ సోమి)రిచ్‌గా కనిపించే ఊరమాసు.పబ్బులకు వెళ్ళటం, వీక్ఎండ్స్ అమ్మాయిలతో లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళటం మందు తాగడం,పేక ఆడటం,బెట్టిగ్స్ వేస్తూ జీవితంలో లక్ష్యం లేకుండా తిరిగే విద్యార్థి బృందానికి లీడర్. ధనవంతుడైన రాజారాం (బెనర్జీ )కూతురు శృతి (ఫాతిమాసనా షేక్)ని చూసి లవ్‌లో పడతాడు.అయితే తన కూతురినిచ్చి పెళ్లి చేయాలంటే నవతరపు యువకులకు ప్రతినిధిలాంటి బుద్ధిమంతుడైన తన కొడుకు(భరత్)ను చెడగొట్టాలని అభికి చాలెంజ్ విసురుతాడు. భరత్ ముప్పై రోజులు నీతోనే ఉంటాడు. నువ్వు స్టైల్ అనుకుంటున్న ఒక్క అలవాటైనా అయితే యూత్ ట్రెండ్ అదేనని నమ్మి శృతి నిచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు.అలాకాకపోతే నికున్నవి వ్యసానలేనని నువ్వు వప్పుకుని నా కూతుర్ని మర్చిపోయి దూరంగా వెళ్లిపోవాలని షరతు విధిస్తాడు.అభి స్నేహితుల సహాయంతో చుక్క,ముక్క,పక్క లాంటి సప్తవ్యసనాలు అలవాటు చేయడానికి శతవిధాలా ప్రయత్నించి విఫల మవుతారు. ఈ ప్రయత్నాల్లో సరదాగా స్టైల్ ,స్టేటస్, టైం పాస్ అని మొదలు పెట్టిన అలవాట్లు వదిలేయలేనంత వ్యసనంకింద ఎలామారాయో తెలుసుకుని అభి బృందం భాధ పడతారు. ఈ సమయంలో భరత్ హత్యకు గురిఅవుతడు.శృతి తమ్ముడి మరణంతో అమితంగా ప్రేమించిన అభిని అనుమానిస్తుంది. పోలీసులనుంచి తప్పించుకొనే ప్రయత్నంలో అభి ఓ గెస్ట్ హౌస్ లోకి వెళ్తాడు. అక్కడ స్టోరి డిస్కర్షన్ కోసం వచ్చిన డైరెక్టర్ (ఆలీ ) ప్రొడ్యూసర్ (జయప్రకాశ్ రెడ్డి ) కలుస్తారు.వారు అభి ప్రేమ కధ విని 'సైనికుడు ప్రేమికుడు భయపడి పారిపోకుడదు,ఎదురు తిరిగి పోరాడాలి' అని దైర్యం చెప్తారు. ఆతరువాత డైరెక్టర్ యిచ్చిన క్లుతో భరత్ ని చంపిన హంతకుడిని ఎలా పట్టుకున్నాడు ? చివరకు కీర్తి అభి ప్రేమను అర్ధం చేసుకుని దగ్గారాయిందా ? లేదా? అన్నదే చిత్రం తదుపరి కథ.

నటవర్గం[మార్చు]

  • రంజిత్ సోమి (అభి )
  • ఫాతిమా సనా షేక్ (శృతి)
  • ఆలీ (డైరెక్టర్ )
  • జయప్రకాశ్ రెడ్డి (ప్రొడ్యూసర్ )
  • బెనర్జీ (రాజారాం)
  • మాధవి
  • రాజా శ్రీధర్ (అజయ్)
  • మాస్టర్ భరత్ (భరత్ )
  • గుండు సుదర్శన్ (ప్రిన్సిపల్‌)
  • స్వప్నిక
  • చలాకి చంటి
  • తాగుబోతు రమేష్
  • వేణు
  • హలీం ఖాన్
  • రితేష్
  • భార్గవి
  • కావేరి
  • దీక్ష
  • శ్రీలేఖ,

నిర్మాణం[మార్చు]

2013 డిసెంబర్ లో ఖమ్మం,రేఖపల్లి,పాపికొండలు ప్రాంతాల్లో తొలి షెడ్యూల్తో ఈ చిత్రం నిర్మాణం ప్రారంభమైంది.[2]2014,జూన్ నెలలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ చిత్రీకరించబడింది. 2014 సెప్టెంబర్,అక్టోబర్లలో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తీ చేసుకుని 2014 నవంబర్ 29న ఆడియో ఆవిష్కరణ జరిగింది. రామ్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని బొత్స సత్యనారాయణ ఆవిష్కరించి, తన శ్రీమతి బొత్స ఝాన్సీకి ఇచ్చారు.[3]

సంగీతం[మార్చు]

సినిమాకు పాటలకు, నేపథ్య సంగీతానికీ రామ్ నారాయణ్ సారథ్యం వహించాడు. ఈ సినిమా ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ సంస్థ ద్వారా 2014 నవంబర్ 29వ తేదీన విడుదలయ్యింది. [4] పాటల జాబితా

నెం. పాట పాడినవారు రచయిత నిడివి
1 నీ క్యాట్ వాక్ గీతా మాధురి, హేమచంద్ర వాసుదేవ మూర్తి 03:52
2 ఆమని యామిని రమ్య బెహరా వాసుదేవ మూర్తి 02:35
3 చమకు చమకు లిప్సిక, రామ్ నారాయణ్ వాసుదేవ మూర్తి 03:00
4 నిన్ను చూసె దినకర్ వాసుదేవ మూర్తి 03:44
5 బాయ్స్ & గర్ల్స్ స్వీకార్, ఐశ్వర్య నిగం వాసుదేవ మూర్తి 03:15
6 మా బాబే బావర్చి ఉమ నేహా, కోరస్ చింతా శ్రీనివాస్ 03:00

 

మూలాలు[మార్చు]

  1. production credits, ", ‘’Moviebuff’’.Dec 29, 2013. Retrieved july 12 2020.
  2. మరో అల్లరి ప్రేమకథ, ", ‘’సాక్షి దినపత్రిక’’.Dec 29, 2013. Retrieved july 9 2020.
  3. యంగ్ టీమ్ చేసిన లవ్లీ మూవీ, ", ‘’సాక్షి దినపత్రిక’’.నవంబర్ 29, 2014.Retrieved july12 2020.
  4. నువ్వు నేను ఒకటవుదాం పాటలు, ", ‘’నా సాంగ్స్’’. Retrieved july 12 2020.

ఇతర లంకెలు[మార్చు]

|