నువ్వు లేక నేను లేను
నువ్వు లేక నేను లేను | |
---|---|
దర్శకత్వం | వై. కాశీ విశ్వనాధ్ |
కథా రచయిత | వై. కాశీ విశ్వనాధ్ (కథ, చిత్రానువాదం, మాటలు) |
నిర్మాత | దగ్గుబాటి సురేశ్ బాబు |
తారాగణం | తరుణ్ ఆర్తి అగర్వాల్ లయ (నటి) శరత్ బాబు చంద్రమోహన్ సునీల్ (నటుడు) |
ఛాయాగ్రహణం | శేఖర్ వి. జోసెఫ్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2002 జనవరి 14 |
సినిమా నిడివి | 150 నిమిషాలు |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
నువ్వు లేక నేను లేను 2002 లో వై. కాశీవిశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1] ఇందులో తరుణ్, ఆర్తీ అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషించారు. ఆర్. పి. పట్నాయక్ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు సారథ్యంలో, డి. రామానాయుడు సమర్పణలో నిర్మితమైంది.[2]
కథ[మార్చు]
రాధాకృష్ణ (తరుణ్), కృష్ణవేణి(ఆర్తి అగర్వాల్) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. వారి తల్లిదండ్రులు కూడా మంచి స్నేహితులు, కలిసి వ్యాపారం చేస్తుంటారు. చిన్నప్పటి స్నేహం ప్రేమగా మారుతుంది. వారి తల్లిదండ్రులు చేస్తున్న వ్యాపారం కొంచెం ఒడిదుడుకులకు లోనవడంతో ఓ పెద్దమనిషి (కె.విశ్వనాథ్) సహాయం చేస్తాడు. ప్రతిఫలంగా ఆయన మనవడికి కృష్ణవేణినిచ్చి పెళ్ళిచేయమని కోరతాడు. ఆయన చేసిన సాయానికి రాధాకృష్ణ తన ప్రేమను త్యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. కృష్ణవేణి కూడా అందుకు అయిష్టంగానే అంగీకరిస్తుంది. అయితే చివర్లో పెద్దలు వారి త్యాగాన్ని గుర్తించి ప్రేమికుల్నిద్దరినీ కలపడంతో కథ సుఖాంతమవుతుంది.
నటవర్గం[మార్చు]
- రాధాకృష్ణ గా తరుణ్
- కృష్ణవేణి గా ఆర్తి అగర్వాల్
- నీరజ గా లయ
- పాండురంగారావు గా శరత్ బాబు
- సుధ
- శివప్రసాద్ గా చంద్రమోహన్
- ప్రగతి
- రామచంద్రయ్య గా కె. విశ్వనాథ్
- కర్రి శీను గా సునీల్
- అంజలి గా కిరణ్ రాథోడ్
- కోడి పెద్దయ్య గా పరుచూరి వెంకటేశ్వరరావు
- శాస్త్రి గా బ్రహ్మానందం
- రాధా కుమారి
- రామ్మోహన్ గా ఆహుతి ప్రసాద్
- హనుమంత శాస్త్రి గా గుండు హనుమంతరావు
- వైద్యుడి గా ఎం. ఎస్. నారాయణ
- లక్ష్మీపతి
- రఘునాథ రెడ్డి
- సుబ్బరాయ శర్మ
- కాదంబరి కిరణ్
- సుబ్బరాయ శర్మ
- మాస్టర్ మనోజ్ నందన్
సాంకేతిక వర్గం[మార్చు]
పాటలు[మార్చు]
- నువ్వంటే నాకిష్టం
- నిండు గోదారి కథ ఈ ప్రేమ
- ఏదో ఏదో అయిపోతుంది
- చిన్ని చిన్ని
- ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
- చీ చీ బుల్లెమ్మా చీ చీ
మూలాలు[మార్చు]
- ↑ జి. వి, రమణ. "నువ్వు లేక నేను లేను చిత్ర సమీక్ష". idlebrain.com. Retrieved 18 January 2018.
- ↑ యు, వినాయకరావు (2014). మూవీ మొఘల్. హైదరాబాదు: జయశ్రీ పబ్లికేషన్స్. pp. 256–258.[permanent dead link]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Articles with short description
- Short description is different from Wikidata
- 2002 సినిమాలు
- 2002 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- తెలుగు ప్రేమకథ చిత్రాలు
- డి. సురేష్ బాబు నిర్మించిన సినిమాలు
- ఆర్. పి. పట్నాయక్ సినిమాలు
- తరుణ్ నటించిన సినిమాలు
- ఆర్తీ అగర్వాల్ నటించిన సినిమాలు
- లయ నటించిన చిత్రాలు
- శరత్ బాబు నటించిన చిత్రాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- సునీల్ నటించిన చిత్రాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు