నుసుము కోటిశివ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నుసుము కోటిశివ
జననంజూన్ 15, 1956
మరణంఏప్రిల్ 16, 2020
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకులు

నుసుము కోటిశివ (జూన్ 15, 1956 - ఏప్రిల్ 16, 2020) రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు. వినుకొండ విశ్వశాంతి కళానికేతన్ నాటక పరిషత్తుచే నటశేఖర బిరుదు అందుకున్నాడు.[1]

జననం[మార్చు]

కోటిశివ 1956, జూన్ 15న గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, అనమర్లపూడి గ్రామంలో జన్మించాడు. కోటిశివ సోదరుడు నుసుము నాగభూషణం కూడా రంగస్థల నటుడు, దర్శకుడు.[2]

రంగస్థల ప్రస్థానం[మార్చు]

విద్యార్థి దశలో అన్న నాగభూషణం దగ్గర నటనలో శిక్షణ పొంది స్కూల్ నాటకాలలో నటించిన కోటిశివ, ఎ. శివరామరెడ్డి దర్శకత్వంలో అంతిమ విజయం నాటిక ద్వారా పూర్తిస్థాయి నాటకరంగంలోకి ప్రవేశించాడు. నెచ్చిలి నాటక సంస్థను స్థాపించి, భ్రూణ హత్యల నేపథ్యంలో నుసుము నాగభూషణం రాసిన కాలజ్ఞానం నాటికను అనేక పరిషత్తులలో ప్రదర్శించి, అనేక బహుమతులు అందుకున్నాడు. 1992 నుండి యల్.వి.ఆర్. క్రియేషన్స్ సంస్థ ద్వారా అనేక నాటకాలు ప్రదర్శించడమేకాకుండా రాష్ట్రస్థాయి నాటక పోటీలను నిర్వహించాడు. ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించాడు.[3]

నాటిక-నాటకాలు[మార్చు]

నటించినవి

  1. పేటెంటు మందు
  2. లెక్కలు తెచ్చిన చిక్కులు
  3. అంతిమ విజయం
  4. సహారా (నంది పాత్ర)

దర్శకత్వం చేసినవి

  1. మద్యంలో మానవుడు
  2. డెవిల్స్
  3. నేను రాముడ్ని కాదు
  4. అడ్రసు లేని మనుషులు
  5. కుందేటి కొమ్ము
  6. రేపేంది
  7. కాలజ్ఞానం
  8. జారుడు మెట్లు (రచన: కావూరి సత్యనారాయణ)
  9. మేలుకొలుపు (రచన: దాట్ల)
  10. గోడకుర్చీ
  11. చిటారుకొమ్మన మిఠాయిపొట్లం
  12. చందమామ రావే
  13. సహజీవనం
  14. ఉత్తమ పంచాయితీ

బహుమతులు[మార్చు]

  1. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - జారుడుమెట్లు (నంది నాటక పరిషత్తు - 1999, రజిత నంది)[4]
  2. ఉత్తమ ప్రదర్శన - మేలుకొలుపు (నంది నాటక పరిషత్తు - 2000, స్వర్ణ నంది)[5]
  3. విశిష్ట నటుడు - జారుడుమెట్లు (కాకతీయ కళా పరిషత్తు, నాగభైరువారి పాలెం)
  4. ఉత్తమ నటుడు - జారుడుమెట్లు (ఆస్కా పరిషత్తు, మద్రాసు)
  5. ఉత్తమ బాలనటి - ఉత్తమ పంచాయితీ (నంది నాటక పరిషత్తు - 2001)

మరణం[మార్చు]

కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న కోటిశివ 2020, ఏప్రిల్ 16న సాయంత్రం 7.15 నిమిషాలకు చీరాలలోని తన కుమార్తె నివాసంలో మరణించాడు.[6][7]

మూలాలు[మార్చు]

  1. నుసుము కోటిశివ, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.272
  2. నుసుము కోటిశివ, గుంటూరు జిల్లా నాటకరంగ చరిత్ర, డా. కందిమళ్ళ సాంబశివరావు, చిలకలూరిపేట, 2009, పుట. 350.
  3. నుసుము కోటిశివ, గుంటూరు జిల్లా నాటకరంగ చరిత్ర, డా. కందిమళ్ళ సాంబశివరావు, చిలకలూరిపేట, 2009, పుట. 351.
  4. నుసుము కోటిశివ, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.273
  5. నుసుము కోటిశివ, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.273
  6. నంది అవార్డు గ్రహీత కోటిశివ కన్నుమూత, ఆంధ్రజ్యోతి, గుంటూరు జిల్లా, 17 ఏప్రిల్ 2020, పుట. 2.
  7. రంగస్థల నటులు కోటిశివ అస్తమయం, ఈనాడు, గుంటూరు జిల్లా, 17 ఏప్రిల్ 2020, పుట. 6.