నూకల రామచంద్రారెడ్డి
నూకల రామచంద్రారెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు. నూకల రామచంద్రరెడ్డి నాలుగుసార్లు కేబినెట్ మంత్రిగా ఉన్నాడు[1].
బాల్యం, కుటుంబం[మార్చు]
నూకల రామచంద్రరెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ మండలం జమండ్లపల్లి గ్రామంలో జన్మించాడు. నూకల రుక్మిణి దేవి, రంగసాయి రెడ్డి తల్లిదండ్రులు.
చదువు[మార్చు]
అతని జమండ్లపల్లి గ్రామంలో ప్రాధమిక పాఠశాలలో కొన్ని తరగతుల వరకు చదుకున్నాడు, తరువాత ఆర్‌బివిఆర్ రెడ్డి హాస్టల్‌లో బస చేస్తూ చాదర్‌ఘాట్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు, పి.వి.నరసింహారావుతో సహా అనేక మంది వ్యక్తులతో కలిసి వందే మాతరం ఉద్యమంలో చేరాడు[2].
రాజకీయ జీవితం[మార్చు]
అతను వరంగల్ జిల్లాలోని డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం నుండి 1957, 1962, 1967 1972 లో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు[3]. 1972 లో అతను పోటీ లేకుండా(ఏకగ్రీవంగా) గెలిచాడు. 1960 లో దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో ఆయన ఆహార, వ్యవసాయం, కార్మిక, భూ సంస్కరణల మంత్రిగా చేరాడు. 1962 లో నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ, భూ సంస్కరణల మంత్రిగా చేరాడు. అతను ఏప్రిల్ 27, 1964 న పరిపాలనా సంస్కరణల కమిటీ ఛైర్మన్గా నియమితుడయ్యాడు. 1964 నుండి 1967 వరకు, కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ భూ సంస్కరణల మంత్రిగా కొనసాగాడు. 1969, 1971 మధ్య, అతను శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు. 1973 లో జలగం వెంగళరావు మంత్రివర్గంలో ఆర్థిక, వాణిజ్య పన్నుల మంత్రిగా చేరాడు[4].
ఆకస్మిక మరణం[మార్చు]
నూకల రామచంద్రారెడ్డికి గుండెపోటు వచ్చి 1974 జూలై 27 న 55 సంవత్సరాల వయసులో కన్నుమూశాడు[5]. అతను ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా, గౌరవసూచకంగా ఆయనకు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది.
యివి కూడా చూడండి[మార్చు]
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957) (66)
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962) (276)
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967) (259)
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972) (259)
మూలాలు[మార్చు]
- ↑ https://epaper.ntnews.com/Home/ShareArticle?OrgId=475664ea&imageview=1
- ↑ https://epaper.ntnews.com/Home/ShareArticle?OrgId=52c9b7b8&imageview=1
- ↑ https://www.ntvtelugu.com/profile/mlas/telangana/Mahabubabad/DORNAKAL
- ↑ https://epaper.ntnews.com/home/index?date=02/07/2020&eid=1&pid=173745
- ↑ https://epaper.ntnews.com/Home/ShareArticle?OrgId=475664ea&imageview=1