నూతిపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నూతిపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం విస్సన్నపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521215
ఎస్.టి.డి కోడ్

నూతిపాడు , కృష్ణా జిల్లా, విస్సన్నపేట మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం వేమిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రస్తుతం 150 మంది విద్యార్థులు విద్య నభ్యసించుచున్నారు. ఈ విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించుట కొరకు, గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న, ఖమ్మం జిల్లాలోని వేంసూరు మండలంలోని కుంచపర్తి గ్రామంలోని ఉన్నత పాఠశాలకు వెళుచున్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో, ఈ గ్రామ విద్యార్థుల సౌకర్యార్ధం, ఈ పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చుటకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. [2]

గ్రామంలోని వ్యవసాయం మరియూ నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ఎత్తిపోతల పథకం:- ఇక్కడ రు.15 కోట్ల వ్యయంతో ఎడమ కాలువ 102 కి.మీ.లో ఈ పథకాన్ని నిర్మించారు. 47.96 క్యూసెక్స్ నీటితో నీటిని ఈ పథకానికి వినియోగించేలాగా అనుమతులున్నవి. ఇక్కడి నుండి 320 హెచ్.పి. సామర్థ్యం గల నాలుగు పంపుల ద్వారా సాగరు జలాలను చివరి ఆయకట్టు గ్రామం సి.గుడిపాడు వరకు చేర్చడానికి నిర్మించారు. ముతేరావుపేట వద్ద నిర్మించిన బావిద్వారా విస్సన్నపేట, చాట్రాయి మండలాలకు నీటిని మళ్ళించేలాగా చేసారు. ఈ పథకానింకి విస్సన్నపేట మండలం పుట్రేల నుండి విద్యుత్తు ఉపకేంద్రం ద్వారా, 16 గంటల విద్యుత్తు సరఫరాకు ఒక ప్రతేక లైనిను ఏర్పాటుచేసారు. ఆయకట్టు పరిధిలో విస్సన్నపేట మండలం పుట్రేల, కొర్రమండ, వేమిరెడ్డిపల్లి, చాట్రాయి మండలంలోని చనుబండ, నరసింహారావుపాలెం గ్రామ పంచాయతీలో 3,050 ఎకరాల భూమి ఉంది. ఈ పథకం ప్రస్తుతం సరిగా పనిచేయుటలేదు. [1]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2014, అక్టోబరు-17; 3వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014, అక్టోబరు-20; 7వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=నూతిపాడు&oldid=2853652" నుండి వెలికితీశారు