నూహ్ ప్రవక్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నూహ్ ఇస్లామీయ ప్రవక్త. ఖురాన్లో ఇతని పేరు (అరబ్బీنوح ) నూహ్ . ఖురాన్లో పలుచోట్ల నూహ్ గురించి వర్ణింపబడింది. ఖురాన్ ప్రకారం అల్లాహ్ ఆదేశానుసారం నూహ్ ఏకేశ్వర ప్రతిపాదన చేశాడు. కాని ప్రకృతినిర్వచనాలను పట్టించుకోని అంధవిశ్వాసులు, బహుదైవారాధనాబధ్ధులై నూహ్ చేసిన శాపానికి గురై, అల్లాహ్ కోపానికి నీటిముంపుకు గురై వినాశాన్ని తెచ్చుకొన్నారు. నూహ్ ఎన్నోసంవత్సరాలు కష్టించి ప్రజలకు నచ్చజెప్పిననూ కేవలం 83 అనుయాయులు మాత్రమే వెన్నంటొచ్చారు.

ఖురాన్ లో నూహ్ గురించి కొన్ని ఆయత్ లు (సూక్తులు) :

మేము (అల్లాహ్) 'నూహ్' ను అతని ప్రజలవద్దకు పంపాము: అతను (నూహ్) చెప్పాడు "ఓ నా ప్రజలారా! అల్లాహ్ ను పూజించండి! అతడిని (అల్లాహ్ ను) తప్పిస్తే మీ కెవ్వడూ పరమేశ్వరుడు లేడు. మీరు (అల్లాహ్) కు భయపడడంలేదా?”
నూహ్ ప్రవక్త ప్రజలలోని అవిశ్వాసుల నాయకులు చెప్పారు: " ఇతను కేవలం మీలాంటి మనిషే; ఇతను తనకు తాను గొప్పవాడిగా ప్రకటించుకోదలచినాడు; ఒకవేళ అల్లాహ్ తన ప్రవక్తలను ప్రకటించదలచి వుండింటే దేవదూతలను దించి వుండేవాడు; ఇతను ప్రకస్తున్నటువంటి విషయాల్ని మేమెన్నడూ మాతాత ముత్తాతల నోట వినలేదు.”
(కొందరైతే ఇలా చెప్పారు): “ఇతను కేవలం మనిషే: (ఓపిక పట్టండి) ఇతనితో కొంతసమయం గడపండి.”
(నూహ్) చెప్పాడు: “ఓ పరమేశ్వరుడా! నాకు సహాయం చేయుము; నన్ను అసత్యుడిగా ప్రచారం చేస్తున్నారు వీరు!”

తరువాత అల్లాహ్ నూహ్ ను ఆజ్ఞాపించాడు "నావ"ను నిర్మించమని:

మాకళ్ళముందు, మా ప్రేరణతో నౌకను నిర్మించండి, చెడు చేయువారి గూర్చి ప్రసంగించకుము. వారు తప్పక మునుగుతారు.[1][2]

ఖురాన్ లో విశదీకరించినట్లు బైబిలు లో విశదీకరింపబడలేదు: నూహ్ ఇంకొక కుమారుడు నౌకలో ప్రయాణించడానికి నిరాకరించాడు.

నౌకా ప్రయాణం అలలలాంటి పర్వతాల మధ్య వారితో ఆరంభమయినది, నూహ్ తన కుమారునికి ఎంతోనచ్చజెప్పాడు, కాని అతను ఒంటరివాడైపోయాడు, ఓ నాకుమారుడా, రమ్ము మాతో ప్రయాణింపుము, అవిశ్వాసులతో ఉండకుము.
(నూహ్ కుమారుడు) బదులిచ్చాడు: నేను ఎత్తైన పర్వతాలపై నిలుస్తాను, అవి నన్ను తప్పకుండా నీటినుండి కాపాడుతాయి. (నూహ్) చెప్పాడు: ఈరోజు అల్లాహ్ కారుణ్యం తప్పితే ఎవ్వడునూ ఈ జలప్రళయం నుండి కాపాడలేరు. వీరిద్దరి మధ్యా ఓ అల వచ్చింది, వాడు (నూహ్ కుమారుడు) జలంలో మునిగినవారిలో ఒకడయ్యాడు.[3]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. (Surah Hud: 37)
  2. (Surat al-Mumenoon: 23-26)
  3. (Surah Hud: 42-43)