నెబ్యులైజర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వైద్యశాస్త్రంలో, ఒక నెబ్యులైజర్ (దీనిని బ్రిటిష్ ఇంగ్లీష్ లో nebuliser గా వ్రాస్తారు[ఉల్లేఖన అవసరం]) అనేది ఔషధాన్ని ఊపిరితిత్తులలోనికి పీల్చుకునే ఆవిరి రూపంలో అందించడానికి ఉపయోగపడే ఉపకరణం.

జెట్ నెబ్యులైజర్ కంప్రస్సర్కి అమర్చిబడింది.

నెబ్యులైజర్లు సామాన్యంగా సిస్టిక్ ఫైబ్రోసిస్, ఆస్త్మా, COPD మరియు ఇతర శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో వాడతారు. మండే పొగ పీల్చే ఉపకరణాలు (అంటే ఆస్త్మా సిగరెట్లు లేదా కన్నాబిస్ జాయింట్లు), ఒక వేపరైజర్, ఒక డ్రై పౌడర్ ఇన్హేలర్, లేదా ఒక ప్రెషరైజ్డ్ మీటర్డ్ డోస్ ఇన్హేలర్ కూడా పీల్చడానికి అనువైన వైద్య మిశ్రమాన్ని అందించేందుకు ఉపయోగపడతాయి. మండే పొగపీల్చే ఉపకరణాలు మరియు వేపరైజర్లు సామాన్యంగా ఈ మధ్యన వైద్యపరమైన ఇన్హేలేషన్ కి వాడడం లేదు, ఎందుకంటే ఆధునిక ఇన్హేలర్లు మరియు నెబ్యులైజర్లు మరింత ప్రభావవంతమైనవి.

అన్ని నెబ్యులైజర్లకూ సామాన్య సాంకేతిక సూత్రం ఏమిటంటే, ప్రాణవాయువు, సంకోచ వాయువు లేదా అతి దైర్ఘ్య శక్తి ఉపయోగించి, వైద్య ద్రావణాలు/మిశ్రమాలను చిన్న ఏరోసోల్ కణాలుగా మార్చి, ఉపకరణం యొక్క మౌత్-పీస్ ద్వారా నేరుగా పీల్చేందుకు అనుగుణంగా తయారు చేయడం. ఏరోసోల్ యొక్క నిర్వచనం "వాయువు మరియు పదార్థాల మిశ్రమం", మరియు సహజంగా ఏర్పడే ఏరోసోల్ కు అత్యుత్తమ ఉదాహరణ "పొగమంచు" (ఆవిరైన చిన్న నీటి పరమాణువులు, వేడిగా ఉన్న గాలితో కలిసి, చల్లబడి కంటికి కనిపించే నీటి బిందువుల సన్నటి పొరగా ఏర్పడడం జరుగుతుంది). ఒక నెబ్యులైజర్ ను నేరుగా ఊపిరితిత్తులలోనికి ఔషధం పంపేందుకు ఇన్హేలేషన్ చికిత్స ద్వారా వాడేటప్పుడు, పీల్చుకున్న ఏరోసోల్ బిందువులు, 1-5 మైక్రో మీటర్ల వ్యాసం కలిగిన, క్రింది వైపు ఉన్న సన్నటి వాయుద్వారాలలోనికి ప్రవేశిస్తున్నాయని గమనించడం ముఖ్యం. లేదా అవి కేవలం నోటిలోకి ప్రవేశిస్తాయి, అక్కడ ప్రభావం తక్కువగా ఉంటుంది.[1]

దురదృష్టవశాత్తూ, ప్రస్తుతం లభించే అన్ని రకాల నెబ్యులైజర్లూ ఊపిరితిత్తులలోనికి ఏరోసోల్, సన్నని కణాలుగా ఔషధం కలిసి చేరేట్టుగా అవసరమైన ప్రభావాన్ని చూపడంలో విజయవంతం కావు.

సామాన్యంగా ఎక్కువగా వాడే నెబ్యులైజర్లు జెట్ నెబ్యులైజర్లు, వీటినే "అటామైజర్లు" అని కూడా అంటారు.[2] జెట్ నెబ్యులైజర్లు సామాన్యంగా ఒక గొట్టంతో కంప్రెసర్ కు సంధానించబడి ఉంటాయి, అది సంకోచ వాయువు లేదా ప్రాణవాయువును అధిక వేగంతో ఒక ద్రవరూప ఔషధం గుండా ప్రవహింపచేసి ఏరోసోల్ గా మారుస్తుంది, తరువాత అది రోగి పీల్చడం జరుగుతుంది. ప్రస్తుతం వైద్యులు ఎక్కువ శబ్దాన్ని (తరచూ వాడేప్పుడు 60 dB) పుట్టించేది మరియు అధిక బరువు కారణంగా మోసుకు వెళ్ళడానికి కష్టమైనది అయిన జెట్ నెబ్యులైజర్లకు బదులుగా ప్రేజరైజ్ద్ మీటర్డ్ డోస్ ఇన్హేలర్ (pMDI) ను వారి రోగులకు సూచించడం కనిపిస్తుంది. అయినప్పటికీ, జెట్ నెబ్యులైజర్లు సామాన్యంగా ఇన్హేలర్లు వాడలేని రోగులకు, ఉదాహరణకు తీవ్రమైన శ్వాశకోశ వ్యాధి, లేదా తీవ్ర ఆస్త్మా సందర్భాలలో వైద్యశాలలలో ఉపయోగిస్తారు.[3] జెట్ నెబ్యులైజర్ యొక్క ప్రధాన లాభం, దాని తక్కువ నిర్వహణ ఖర్చు. రోగి ప్రతి రోజూ ఔషధం పీల్చవలసి వచ్చినప్పుడు, pMDI వాడకం ఖరీదైనది కావచ్చు. నేడు ఎందఱో తయారీదారులు జెట్ నెబ్యులైజర్ బరువును 635 grams (22.4 oz)కు తగ్గించి, తద్వారా దానిని మోసుకు వెళ్ళగలిగే ఉపకరణంగా చూపడం జరుగుతోంది. పోటీలో ఉన్న అన్ని ఇన్హేలర్లు మరియు నెబ్యులైజర్లతో పోలిస్తే, శబ్దం మరియు అతి భారం అనేవి ఇప్పటికీ, జెట్ నెబ్యులైజర్ లోని ప్రధాన లోపాలు.

అతి దైర్ఘ్య తరంగాల నెబ్యులైజర్లు 1964లో క్రొత్తగా మరింతగా మోసుకు వెళ్ళే నెబ్యులైజర్ గా ఆవిష్కరించడం జరిగింది. ఒక అతిదైర్ఘ్య తరంగ నెబ్యులైజర్ లోపలి సాంకేతికత ఏమిటంటే ఒక ఎలక్ట్రానిక్ ఆసిలేటర్ ద్వారా అధిక పౌనఃపున్యం అతిదైర్ఘ్య తరంగం ఉత్పత్తి చేసి, దాని ద్వారా ఒక పీజో-ఎలెక్ట్రిక్ మూలకంలో యాంత్రిక కంపనం ఉత్పన్నం చేయడం. ఈ కంపన మూలకం ఒక ద్రవ రిజర్వాయర్ తో అనుసంధానమై ఉంటుంది మరియు దాని అధిక పౌనఃపున్య కంపనం కారణంగా ఆవిరి పొగ ఏర్పడుతుంది.[4] ఇవి భారమైన వాయు కంప్రెసర్ కు బదులుగా అతిదైర్ఘ్య కంపనం ద్వారా ఏరోసోల్స్ ను ఉత్పన్నం చేయడం వలన, వాటి భారం సుమారు 170 grams (6.0 oz) ఉంటుంది. మరొక లాభమేమిటంటే అతిదైర్ఘ్య కంపనం దాదాపు నిశ్సబ్దంగా ఉంటుంది. ఇటువంటి మరింత ఆధునిక రకం నెబ్యులైజర్లకు ఉదాహరణలు: ఒమ్రాన్ NE-U17 మరియు బ్యూరర్ నెబ్యులైజర్ IH30.[5]

నెబ్యులైజర్ మార్కెట్లో సుమారు 2005 ప్రాంతంలో, ఒక ప్రధాన రూపకల్పన జరిగింది, ఇది అతిదైర్ఘ్య వైబ్రేటింగ్ మెష్ టెక్నాలజీ (VMT) సృష్టి. ఈ టెక్నాలజీతో 1000-7000 లేజర్ చేసిన రంధ్రాలతో ఒక మెష్/పొర, ద్రవ రిజర్వాయర్ పై భాగంలో కంపనం చెందుతుంది, తద్వారా ఆ రంధ్రాల గుండా అతి సన్నని కణాలు కలిగిన పొగను ఒత్తిడితో వెలుపలకు పంపుతుంది. ఈ సాంకేతికత ద్రవ రిజర్వాయర్ క్రింది వైపు కంపించే పీజో-ఎలెక్ట్రిక్ మూలకం కన్నా ప్రభావవంతమైనది, మరియు దీని ద్వారా చికిత్సకు తక్కువ సమయం సాధ్యమవుతుంది. అతిదైర్ఘ్య తరంగాల నెబ్యులైజర్లో ఉన్న పాత సమస్యలు, అధికంగా ద్రవం వ్యర్థం కావడం, మరియు వైద్య ద్రవం యొక్క అవాంఛిత ఉష్ణం వంటివి, కూడా క్రొత్త వైబ్రేటింగ్ మెష్ నెబ్యులైజర్ల ద్వారా పరిష్కరించబడ్డాయి. ప్రస్తుతం లభించే VMT నెబ్యులైజర్ల పాక్షికమైన పట్టిక ఇది: పరి ఇ-ఫ్లో[6], రెస్పిరానిక్స్ ఐ-నెబ్[7], ఒమ్రాన్ మైక్రో ఎయిర్[8], బ్యూరర్ నెబ్యులైజర్ IH50[9], మరియు ఏరోజెన్ ఏరోనెబ్[10]. మునుపటి నమూనాల కన్నా అతిదైర్ఘ్య VMT నెబ్యులైజర్లు అధిక ధరలు కలిగినవి కావడం వలన, చాలా మంది తయారీదారులు మరిన్ని "పాత తరహా" జెట్ నెబ్యులైజర్ల అమ్మకం కొనసాగిస్తున్నారు. నెబ్యులైజర్ టెక్నాలజీలో ఇటీవలి నూతన కల్పన ఏమిటంటే, మార్కెట్టే విశ్వవిద్యాలయానికి చెందిన డా. లార్స్ E. ఓల్సన్ అభివృద్ధి చేసిన మానవ-శక్తితో నడిచే నెబ్యులైజర్.

వైద్య సంస్థ బోహ్రింగర్ ఇంగేల్హీం కూడా రెస్పిమాట్ సాఫ్ట్ మిస్ట్ ఇన్హేలర్ పేరిట ఒక క్రొత్త ఉపకరణాన్ని 1997లో ఆవిష్కరించింది. ఈ క్రొత్త సాంకేతికత వినియోగదారుడికి కొలిచిన మోతాదు అందిస్తుంది, ఇది ఇన్హేలర్ యొక్క ద్రవపు క్రింది భాగం సవ్యదిశలో 180 డిగ్రీలు చేతితో త్రిప్పినట్లయితే, వంగే ద్రవపు పాత్ర చుట్టూ ఉన్న స్ప్రింగ్ ఒత్తిడి పెరగడం ద్వారా జరుగుతుంది. వినియోగదారుడు ఇన్హేలర్ యొక్క క్రింది భాగాన్ని యాక్టివేట్ చేసినపుడు, స్ప్రింగ్ లోని శక్తి విడుదలై వంగే ద్రవపు పాత్రపై ఒత్తిడిని కలిగిస్తుంది, దీని వలన ద్రవం 2 నాజిల్స్ గుండా చల్లబడి, పీల్చడానికి అనువైన సునితమైన పొగలా మారుతుంది. ఈ ఉపకరణంలో ప్రయోగానికి గ్యాస్ ప్రొపెల్లెంట్ మరియు బాటరీ/శక్తి వంటివి ఉండవు. పొగలోని సగటు బిందువు పరిమాణం నిరుత్సాహం కలిగించే విధంగా 5.8 మైక్రోమీటర్లుగా కొలవబడింది, ఇది పీల్చబడిన ఔషధం ఊపిరితిత్తుల లోనికి చేరడంలో కొన్ని సాధ్యమైన ప్రభావ సమస్యలను సూచిస్తుంది. తరువాతి ప్రయోగాల వలన ఇది తప్పని తేలింది. పొగ యొక్క అతి తక్కువ వేగం వలన, సాఫ్ట్ మిస్ట్ ఇన్హేలర్ నిజానికి సంప్రదాయ pMDI తో పోలిస్తే అధిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది.[11] 2000లో, యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ (ERS) కి వారి నెబ్యులైజర్ యొక్క నిర్వచనాని స్పష్టపరచడం/విశదీకరించడం పట్ల వాదాలు పంపబడ్డాయి, ఎందుకంటే క్రొత్త సాఫ్ట్ మిస్ట్ ఇన్హేలర్ ను, సాంకేతికమైన పదాలలో రెండు విధాలుగా "చేతితో ప్రయోగించే నెబ్యులైజర్" మరియు "చేతితో ప్రయోగించే pMDI"గానూ వర్గీకరించవచ్చు.[12]

చరిత్ర[మార్చు]

దస్త్రం:Sales-Girons (1858).jpg
1858 నుంచి సేల్స్-గిరోన్స్ ప్రేస్సరైజ్ద్ నెబ్యులైజర్
దస్త్రం:Siegle's steam spray inhaler (1864).jpg
సీగుల్స్ స్టీం స్ప్రే నెబ్యులైజర్ (1864), ఏదమ మూలాన గ్లాస్ మూత, మధ్యలో "మెడికల్ కప్", మరియు కుడి వైపున బోయిలింగ్ రేసర్వోయిర్ కలిగిన స్పిరిట్ బర్నర్.

మొట్టమొదటి "శక్తి కలిగిన" లేదా ఒత్తిడి కలిగిన ఇన్హేలర్, ఫ్రాన్సులో సేల్స్-గిరాన్స్ ద్వారా 1858లో కనిపెట్టబడింది. ఈ ఉపకరణంలో ద్రవ ఔషధాన్ని అణువులుగా మార్చేందుకు పీడనాన్ని ఉపయోగించడం జరిగింది. పంప్ పిడిని, బైసికిల్ పంప్ లాగే ప్రయోగించడం జరిగేది. పంప్ పైకి లాగినపుడు, అది రిజర్వాయర్ నుండి ద్రవాన్ని తీసుకుంటుంది, మరియు వినియోగదారుడి చేతి ఒత్తిడిచే ద్రవం అటామైజర్ గుండా వెలుపలకి వచ్చి, వినిఒగదారుది నోటివద్ద పీల్చడానికి ఆనువుగా చల్లబడుతుంది.[13]

1864లో, మొట్టమొదటి ఆవిరితో నడిచే నెబ్యులైజర్, జర్మనీలో ఆవిష్కరించబడింది. ఈ ఇన్హేలర్, “సీగల్స్ స్టీం స్ప్రే ఇన్హేలర్”గా పిలువబడేది, వెంచురి సూత్రం ఉపయోగించి ద్రవ ఔషధాన్ని అణువులుగా మారుస్తుంది, ఇది నెబ్యులైజర్ చికిత్సకు ప్రారంభం. బిందువుల పరిమాణం యొక్క ప్రాముఖ్యత అప్పటికి అర్థం కాలేదు, కాబట్టి ఈ మొట్టమొదటి ఉపకరణం యొక్క సామర్థ్యం ఎన్నో రకాల వైద్య మిశ్రమాలకు దురదృష్టవశాత్తూ మధ్యంతరంగా ఉండేది. సీగల్ స్టీం స్ప్రే ఇన్హేలర్లో ఒక స్పిరిట్ బర్నర్ ఉండేది, ఇది రిజర్వాయర్లోని నీటిని మరిగించి ఆవిరిగా తయారు చేసి, పై భాగం గుండా ఔషధ ద్రావణంలోనికి వెళ్ళే గొట్టం ద్వారా ప్రవహించేలా చేసేది. ఆవిరి ప్రయాణం ద్వారా ఔషధం ఆవిరి లోనికి ప్రవేశించేది, మరియు రోగి ఇలా వెలుపలికి చల్లబడిన ఆవిరిని గాజుతో చేసిన మౌత్-పీస్ ద్వారా పీల్చడం జరిగేది.[14]

దస్త్రం:Glaseptic hand nebulizer (1930).jpg
1930 నుంచి పార్క్-డేవిస్ గ్లాస్ఎప్టిక్, హ్యాండ్ నెబ్యులైజర్.
దస్త్రం:Pneumostat (1930s).jpg
ఎలక్ట్రానిక్ నెబ్యులైజర్: నీమోస్టాట్(1930s).

మొట్టమొదటి ఎలక్ట్రానిక్ నెబ్యులైజర్ 1930లలో కనుగొనబడింది మరియు దీనిని న్యుమోస్టాట్ అని పిలిచేవారు. ఈ ఉపకరణం ద్వారా, ఒక వైద్య ద్రవం (సామాన్యంగా అడ్రినలిన్ క్లోరైడ్, దీనిని నిర్బంధాన్ని వ్యత్యస్తం చేసే ఊపిరితిత్తుల కండరాల సడలింపుకు వాడేవారు) ఎలెక్ట్రికల్ కంప్రెసర్ నుండి శక్తిని ఉపయోగించి ఏరోసోల్ గా మారేది.[15] ఖరీదైన ఎలక్ట్రానిక్ నెబ్యులైజర్ కు ప్రత్యామ్నాయంగా, ఎంతోమంది 1930లలో మరింత సరళమైనది మరియు చవకైన చేతితో నడిచే నెబ్యులైజర్ వాడేవారు, దీనినే పార్క్-డేవిస్ గ్లాసేప్టిక్ గా పిలిచేవారు.[16]

1956లో, నెబ్యులైజర్లకు పోటీగా ఒక సాంకేతికతను రికర్ లాబొరేటరీస్ (3M), ప్రేజరైజ్డ్ మీటర్డ్ డోస్ ఇన్హేలర్ రూపంలో, మెడిహేలర్-ఐసో (ఐసోప్రేనలీన్) మరియు మెడిహేలర్-ఎపి (అడ్రినలిన్) మొదటి రెండు ఉత్పత్తులుగా ప్రవేశపెట్టింది.[17] ఈ ఉపకరణాలలో ఔషధం చల్లని స్థితిలో నింపబడుతుంది మరియు ఒక ప్రత్యేక మీటరింగ్ వాల్వుల ద్వారా ఖచ్చితమైన మోతాదులలో అందజేయబడుతుంది, ఇది ఒక గ్యాస్ ప్రోపెల్లంట్ టెక్నాలజీ (అంటే ఫ్రియాన్ లేదా వాతావరణానికి తక్కువ హాని కలిగించే HFA) ద్వారా నడపబడుతుంది.[18]

1964లో, క్రొత్త రకం ఎలక్ట్రానిక్ నెబ్యులైజర్లు, "అతిదైర్ఘ్య తరంగాల నెబ్యులైజర్ల" రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది.[19] ప్రస్తుతం ఈ నెబ్యులైజింగ్ టెక్నాలజీ కేవలం వైద్య ప్రయోజనాలకే ఉపయోగం కాదు. ఉదాహరణకు, అతిదైర్ఘ్య తరంగాల నెబ్యులైజర్లు, భవనాలలో తడిలేని గాలిని చల్లబరచడానికి నీటి బిందువులను చల్లేందుకు ఉపయోగించే హ్యుమిడిఫైయర్ పరికరంలో ఉపయోగిస్తారు.[4]

ఎలక్ట్రానిక్ సిగరెట్లకు సంబంధించి, మొదట్లో రూపకల్పన చేసిన కొన్ని నమూనాలలో అతిదైర్ఘ్య తరంగాల నెబ్యులైజర్ (ఒక పీజో-ఎలెక్ట్రిక్ మూలకం అధిక పౌనఃపున్య అతిదైర్ఘ్య తరంగాలలో కంపించేది, కంపనం మరియు నికోటిన్ ద్రవం యొక్క అటామైజేషన్ కలిగించేది), ఒక వేపరైజర్ (దీనిని ఎలెక్ట్రిక్ హీటింగ్ ఎలిమెంట్ కలిగిన స్ప్రే నాజిల్గా తయారుచేసేది) తో కలిసి ఉండేది .[20] కానీ, ప్రస్తుతం అతి సాధారణంగా అమ్ముడుపోయే రకం ఎలక్ట్రానిక్ సిగరెట్లు, ఇటువంటి రకం ఉపకరణానికి ప్రభావవంతం కాదని తెలిసి, అతిదైర్ఘ్య తరంగాల నెబ్యులైజర్ ను వదలివేయడం జరిగింది. బదులుగా ప్రస్తుతం ఎలక్ట్రానిక్ సిగరెట్లు ఒక ఎలెక్ట్రిక్ వేపరైజర్ ను వాడుతున్నాయి, ఇది నేరుగా "ప్రవేశపెట్టిన అటామైజర్"తో సంబంధం కలిగి, లేదా, "స్ప్రేయింగ్ జెట్ అటామైజర్"కు సంబంధించిన నేబ్యులైజేషన్ టెక్నాలజీతో కలిపి (అధిక వేగం కలిగిన వాయు ప్రవాహం ద్వారా ద్రవ బిందువుల రూపంలో, నికోటిన్ ద్రవం కలిగిన పదార్థంలో చేసిన కొన్ని చిన్న వెంచురి ఇంజెక్షన్ ద్వారాల గుండా చల్లబడుతుంది) వాడుతుంది.[21]

ఉపయోగం మరియు అదనపు చేర్పులు[మార్చు]

నెబ్యులైజర్లు వాటి ఔషధాన్ని ఒక ద్రవ రూపంలో తీసుకుని, తరచూ వాడకం ద్వారా ఉపకరణంలోనికి ప్రవేశాపెడతాయి. కార్టికోస్టెరాయిడ్స్ మరియు బ్రాంకో-డైలేటర్లు, సాల్బుటమాల్ వంటివి (అల్బుటేరాల్ USAN) తరచూ వాడతారు, మరియు కొన్ని సార్లు ఇప్రాట్రోపియంతో కలిపి వాడతారు. ఈ ఔషధాలను ప్రవేశపెట్టడం కన్నా పీల్చడం ఎందుకంటే వాటి ప్రభావాన్ని శ్వాశకోశ మార్గంపై సరిగా చూపి, ఔషధం యొక్క చర్యను త్వరితం చేయడం మరియు ప్రత్యామ్నాయ గ్రహణ మార్గాలతో పోలిస్తే ఇతర ప్రభావాలను తగ్గించడం.[3]

సామాన్యంగా, ఏరోసోల్ గా మార్చబడిన ఔషధాన్ని గొట్టం వంటి మౌత్-పీస్ ద్వారా పీల్చడం జరుగుతుంది, ఇది ఇన్హేలర్ ను పోలి ఉంటుంది. కానీ, ఈ మౌత్-పీస్ కొన్ని సార్లు ముఖంపై మాస్క్ ద్వారా భర్తీ చేయబడుతుంది, ఇది చిన్న పిల్లలు లేదా వృద్ధులకు సౌకర్యంగా ఉండేందుకు పీల్చే అనస్తీసియాకు వాడే మాస్క్ ను పోలి ఉంటుంది, కానీ రోగులు వాడగలిగితే మౌత్-పీసులు వాడడం మంచిది, ఎందుకంటే, ముఖంపై మాస్కులు ఏరోసోల్ ముక్కువద్ద వ్యాపించడం వలన, తక్కువగా ఊపిరితిత్తులకు అందుతుంది.[2]

కార్టికోస్టెరాయిడ్ తో కలిపి వాడిన తరువాత, సిద్ధాంతపరంగా రోగులు నోటిలో యీస్ట్ ఇన్ఫెక్షన్ (త్రష్) లేదా గొంతు బొంగురుపోవడం (డిస్ఫోనియా) పొందే అవకాశం ఉంది, కానీ ఈ పరిస్థితులు వైద్యపరంగా చాలా అరుదు. కొందరు వైద్యులు ఇటువంటి హానికర ప్రభావాలను తప్పించడానికి, నెబ్యులైజర్ వాడిన వ్యక్తి తన నోటిని శుభ్రంగా తుడుచుకోవాలని సలహా ఇస్తారు. ఇది బ్రాంకో-డైలేటర్స్ విషయంలో నిజం కాదు; కానీ, కొని బ్రాంకో-డైలేటింగ్ మందుల చెడు రుచి కారణంగా రోగులు వారి నోటిని తుడుచుకోవడం జరుగుతుంది.

వీటిని కూడా చూడండి.[మార్చు]

మెడికల్ ద్రవం ఊపిరితిత్తుల లోనికి ఏరోసోల్ చుక్కలుగా చల్లటానికి నెబ్యులైజర్ కు బదులుగా ఇన్హేలర్స్ మరియు వేపరైజర్లు వాడవచ్చు.

 • ఇన్హేలర్
 • ఆవిరి కారకం
 • మెడికల్ ఇన్హేలెంట్స్ యొక్క జాబితా

సూచనలు[మార్చు]

 1. లున్గెన్లిగా స్క్వీజ్, "గైడ్లైన్స్ ఫర్ ది ఏరోసోల్ థెరపి అఫ్ లంగ్ డిసీజెస్".
 2. 2.0 2.1 ఫిన్లే, W. H., ది మెకానిక్స్ అఫ్ ఇంహేల్ద్ ఫర్మాసిటికల్ ఏరోసోల్స్: ఏన్ ఇంట్రడక్షన్ , అకాడమిక్ ప్రెస్, 2001.
 3. 3.0 3.1 ఫర్మాసిటికల్ ఇన్హలేషన్ ఏరోసోల్ టెక్నోలజి , ed. A. J. హికీ చే 2nd అధ్యాయం, మార్సెల్ డెక్కర్, NY, 2004.
 4. 4.0 4.1 BOGA Gmbh. "Operating principle of ultrasonic humidifier". Retrieved 2010-04-05. Cite web requires |website= (help)
 5. నొచ్, M. & ఫిన్లే, W. H. "నిబ్యులైజర్ టెక్నోలజీస్”, చాప్టర్ 71 in మార్చబడిన విడుదల డ్రగ్ డెలివరీ టెక్నోలజీ , ed. రాత్బోనే/హాడ్గ్రాఫ్ట్/రోబర్ట్స్, మార్సెల్ డెక్కర్, పేజి. 849-856, 2002.
 6. PARI Pharma (2008). "Leading aerosol therapies worldwide, delivery with eFlow". Retrieved 2010-04-09. Cite web requires |website= (help)
 7. Philips Respironics (2010). "Active Aerosol Dilevery, The I-neb and Vibrating Mesh Technology". Retrieved 2010-04-09. Cite web requires |website= (help)
 8. Omron (2010). "Talking about nebulization method: Ultrasonic nebulizer and Vibrating Mesh nebulizer". Retrieved 2010-04-09. Cite web requires |website= (help)
 9. Beurer (2010). "Product details of IH50 nebulizer, with a vibrating membrane". Retrieved 2010-04-09. Cite web requires |website= (help)
 10. Aerogen (2009). "Micropump nebulizers, Aeroneb, Vibrating Mesh Technology". Retrieved 2010-04-09. Cite web requires |website= (help)
 11. Boehringer Ingelheim (2003). "How it works: Respimat Soft Mist Inhaler". Retrieved 2005-08-16. Cite web requires |website= (help)
 12. J.Denyer; et al. (2000). "New liquid drug aerosol devices for inhalation therapy". EUR Respir, rev.2000 (10: 187-191). Explicit use of et al. in: |author= (help); Missing or empty |url= (help)
 13. Inhalatorium. "Pressurized inhaler invented by Sales-Girons". Retrieved 2010-04-05. Cite web requires |website= (help)
 14. Inhalatorium. "Siegle's steam spray inhaler". Retrieved 2010-04-05. Cite web requires |website= (help)
 15. Inhalatorium. "First electronic nebulizer (Pneumostat)". Retrieved 2010-04-05. Cite web requires |website= (help)
 16. Inhalatorium. "The hand driven nebulizer "Park-Davis Glaseptic". Retrieved 2010-04-05. Cite web requires |website= (help)
 17. Riker Laboratories (1956-03-21). "Self-propelling pharmaceutical compositions (for a pMDI)". GB patent. Retrieved 1960-03-16. Check date values in: |accessdate= (help)
 18. Mark Sanders (2006-11-06). "Inhalation therapy: an historical review" (PDF). PrimaryCare Respiratory Journal (vol.16, issue 2). Retrieved 2007-04-01.
 19. Devilbiss (1964-02-10). "Method and apparatus for producing aerosols (ultrasonic nebulizer)". GB patent. Retrieved 1967-05-17. Check date values in: |accessdate= (help)
 20. Hon Lik (2004-04-14). "An aerosol electronic cigarette". CN patent. Retrieved 2006-12-27.
 21. Hon Lik (2006-05-16). "Emulation aerosol sucker". CN patent. Retrieved 2009-02-11.

మూస:Dosage forms మూస:Routes of administration