Jump to content

నెయిఫియు రియో

వికీపీడియా నుండి
నెయిఫియు రియో
నెయిఫియు రియో


నాగాలాండ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018 మార్చి 8
గవర్నరు ఆర్.ఏన్. రవి
డిప్యూటీ యాంతుంగొ పట్టొన్
టి.ఆర్. జెలియాంగ్
ముందు టి.ఆర్. జెలియాంగ్
నియోజకవర్గం ఉత్తర అంగామి-II
పదవీ కాలం
2008 మార్చి 12 – 2014 మే 24
గవర్నరు అశ్వని కుమార్
ముందు రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
2003 మార్చి 6 – 2008 జనవరి 3
గవర్నరు శంకర్ దత్త
కె.శంకర్నారాయణన్
ముందు జమీర్
తరువాత రాష్ట్రపతి పాలన

లోక్ సభ సభ్యుడు
పదవీ కాలం
2014 మే 26 – 2018 ఫిబ్రవరి 28

వ్యక్తిగత వివరాలు

జననం (1950-11-11) 1950 నవంబరు 11 (వయసు 74)
కోహిమా, అస్సామ్, భారతదేశం (ప్రస్తుతం నాగాలాండ్)
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జాతీయ ప్రజాస్వామ్య కూటమి
జీవిత భాగస్వామి కైసా రియో
నివాసం దిమాపూర్
మూలం Nagaland Government

నెయిఫియు రియో (జననం: 1950 నవంబరు 11) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. గతంలో రియో నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2003 మార్టి నుండి 2008 జనవరి 3 వరకు, 2008 మార్చి 12 నుండి 2014 మే 24 వరకు (రెండు పర్యాయాలు), 2018 మార్చి 8 నుండి 2023 మార్చి 7 వరకు, తిరిగి ప్రస్తుతం 5 వసారి 2023 మార్చి 8 నుండి ప్రస్తుతం అధికారంలో కొనసాగుచున్నారు.[1] నాగాలాండ్‌కు ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి. అతను 2014 నుండి 2018 వరకు లోక్‌సభలో నాగాలాండ్ నుండి పార్లమెంటు సభ్యునిగా కూడా ఉన్నారు.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

రియో కోహిమా జిల్లా లోని అనగామి నాగ సంచార జాతికి చెందిన కుటుంబంలో జన్మించాడు.[2] ఇతని తండ్రి పేరు గువోల్హౌలై రియో. కోహిమా లోని బాప్టిస్ట్ ఆంగ్ల పాఠశాలలో ఇంకా పురూలియా లోని సైనిక్ స్కూల్లో రియో తన పాఠశాల విద్యను పూర్తిచేశాడు. ఆ తర్వాత డార్జిలింగ్ లోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో తన కళాశాల చదువు ప్రారంభించిన రియో కోహిమా కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందాడు.[3]

చిన్న వయసు నుండే వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహం చూపించే రియో తన పాఠశాల రోజుల్లో రాజకీయం పట్ల ఆసక్తి చూపేవాడు. తను నాగాలాండ్ ముఖ్యమంత్రి అయ్యే ముందు వివిధ సంస్థలకు నాయకత్వం కూడా వహించాడు. 1974లో కోహిమ జిల్లా లోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యువ విభాగానికి ప్రెసిడెంట్ గా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

1989లో నాగాలాండ్ శాసనసభ ఎన్నికల్లో ఉత్తర అనగానేమి నియోజకవర్గం నుండి రియో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అదే సమయంలో రాష్ట్ర క్రీడా శాఖ ఇంకా విద్యా శాఖ మంత్రిగా ఆ తర్వాత రాష్ట్ర ఉన్నత విద్య, సాంకేతిక విద్య ఇంకా కళా సాంస్కృతిక శాఖలకు  మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా శాసనసభ పదవిలో ఉన్నప్పుడు 1998 నుండి 2002 వరకు  రాష్ట్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేసాడు.

జమీర్ నాయకత్వంలో హోం మంత్రిగా ఉన్న రియో నాగ ట్రైబ్ కేసులో అతని నాయకత్వం పట్ల అసహాణత్వం తెలియజేస్తూ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ రాజీనామా తర్వాత రియో భారతీయ జనతా పార్టీకి చెందిన నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీలో చేరి 2003 రాష్ట్ర ఎన్నికల్లో  డెమొక్రటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్ స్థాపించి అప్పటివరకు పది సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఓడించి 2003 మార్చి 6న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

రియో ముఖ్యమంత్రి పదవి కాలం కాకముందే 2008 జనవరి 3న  నాగాలాండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది.  ఆ తర్వాత నాగ్ ఆస్పిటల్ ఫ్రంట్ అతిపెద్ద పార్టీగా ఏర్పడి 2008 మార్చి 12వ తారీఖున, తిరిగి తన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు.  ఆ తర్వాత 2019 నాగాలాండ్ రాష్ట్ర ఎన్నికల్లో నాగా పీపుల్స్ ఫ్రంట్ భారీ మెజార్టీతో గెలుపొంది రియో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు.

బాహ్యలింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (3 March 2023). "ఐదోసారి.. నాగాలాండ్‌ సీఎంగా నెయిఫియు రియో." Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.
  2. "Who is Neiphiu Rio?". Matters India. 2018-03-09. Retrieved 2021-06-27.
  3. "Nagaland: Tribal body claims rich, influential exempted from institutional quarantine". The New Indian Express. Retrieved 2021-06-27.