నెలపొడుపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమావాస్య తరువాత చంద్రుని నుంచి వెలువడే మొదటి రోజు చంద్రకాంతిని నెలపొడుపు లేక నెల పొడుపు అంటారు.

పవిత్రత

[మార్చు]

ప్రతి నెలలో ఒకసారి నెలపొడుపు వస్తుంది. ఈ నెలపొడుపును హిందూ, ముస్లింలు చాలా పవిత్రంగా భావిస్తారు.

రంజాన్ మాసం

[మార్చు]

తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '. ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ మాసం ప్రారంభంలో నెల ప్రారంభ సూచిక అయిన నెలపొడుపును చూసి ఉపవాసాలు ప్రారంభిస్తారు.

నెలపొడుపును చూసి రంజాన్ పండుగ

[మార్చు]

పవిత్ర ఖురాన్ ఆవిర్భవించిన రంజాన్ మాసంను ఉపవాసంలతో దిగ్విజయంగా పూర్తి చేసాము అనేందుకు గుర్తుగా మరుసటి నెల ప్రారంభ సూచిక అయిన నెలపొడుపును చూసి రంజాన్ పండుగను జరుపుకుంటారు.

నెలపొడుపును చూసి ఇష్టమైన వారిని లేదా ఇష్టమైన వాటిని చూడటం

[మార్చు]

నెలపొడుపును చూసిన వెంటనే తనకు ఇష్టమైన వారిని లేదా ఇష్టమైన వాటిని చూస్తారు. ఉదాహరణకు కొంతమంది నెలపొడుపును చూసిన తరువాత వెంటనే తన దగ్గర ఉన్న దేవుని చిత్రాన్ని లేదా ధనలక్ష్మీ ప్రతిరూపంగా భావించే డబ్బుని చూస్తారు, ఈ విధంగా చేయటం వలన ఆ నెలంతా ఆర్థిక ఇబ్బందులు కలగవని నమ్ముతారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

రంజాను

బయటి లింకులు

[మార్చు]