Jump to content

నెల్లికంటి సత్యం

వికీపీడియా నుండి
నెల్లికంటి సత్యం

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 మార్చి 30

వ్యక్తిగత వివరాలు

జననం (1969-06-06) 1969 జూన్ 6 (వయసు: 57)
ఎల్గలగూడెం, మునుగోడు మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
తల్లిదండ్రులు పెద్దయ్య, పార్వతమ్మ
జీవిత భాగస్వామి అన్నపూర్ణ
వృత్తి రాజకీయ నాయకుడు

నెల్లికంటి సత్యం యాదవ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2025లో తెలంగాణ శాసనమండలికి జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యేగా కోటా నుండి సీపీఐ పార్టీ ఎమ్మెల్సీగా ప్రకటించారు.[1][2][3]

జననం విద్యాభ్యాసం

[మార్చు]

నెల్లికంటి సత్యం 1969 జూన్ 6న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, మునుగోడు మండలం, ఎల్గలగూడెం గ్రామంలో జన్మించాడు. ఆయన పొలిటికల్ సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

నెల్లికంటి సత్యం విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తితో సీపీఐ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985 నుంచి 2000 వరకు పార్టీ యువజన విభాగం ఏఐవైఎఫ్ నల్గొండ జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2010 నుండి 2016 వరకు మునుగోడు మండల కార్యదర్శిగా, 2016 నుంచి నల్గొండ జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శిగా, 2020 నుంచి జిల్లా కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పని చేస్తూ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మునుగోడు నుండి టికెట్ ఆశించగా పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కేటాయించడంతో ఆ పార్టీ అభ్యర్థి గులుపు కోసం కృషి చేశాడు.

నెల్లికంటి సత్యంను 2025లో తెలంగాణ శాసనసమండలికి జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఆయనను మార్చి 9న సీపీఐ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.[4][5] ఆయన మార్చి 13న ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించాడు.[6] ఆయన 2025 ఏప్రిల్ 7న శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. ↑ "సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం". Sakshi. 10 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
  2. ↑ "సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం". Eenadu. 10 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
  3. ↑ "సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థి గా నెల్లికంటి సత్యం". Andhrajyothy. 10 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
  4. ↑ "Telangana MLC polls: CPI names Nellikanti Satyam as candidate under MLA quota" (in ఇంగ్లీష్). Telangana Today. 9 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
  5. ↑ "ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో నాలుగు నల్లగొండకే". Andhrajyothy. 10 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
  6. ↑ "తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం". Eenadu. 13 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
  7. ↑ "ఏడుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Eenadu. 8 April 2025. Archived from the original on 8 April 2025. Retrieved 8 April 2025.
  8. ↑ "అధ్యక్షా..!". Andhrajyothy. 8 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.