నెల్లూరు జిల్లా చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నెల్లూరు (విక్రమసింహపురం) జిల్లా చాల ప్రాచీనమైనదని, యిది దండకారణ్యంలోనిదని కొందరూహిస్తున్నారు.

నెల్లూరు (విక్రమసింహపురం) పేరు వెనుక చరిత్ర[మార్చు]

నెల్లూరు సింహపురమని, విక్రమసింహపురమని కూడా వ్యవహరింపబడేది. ఈ పట్టణ సమీపంలోని అడవులలో సింహలపరిమితంగా ఉన్నందువలననే యీ పేరు వచ్చిందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. విక్రమసింహుడనే వాని ఆధీనంలో యీ ప్రాంతం వుందని, అందువలననే అతని పేరు తోనే ఈ ప్రాంతం అలా పిలువబడి వుండవచ్చునని యింకొందరు భావిస్తున్నారు.
పూర్వం త్రినేత్రుడు లేక ముక్కంటిరెడ్డి అనే వ్యక్తికి నెల్లిచెట్టు అనగా ఉసిరిచెట్టు క్రింద వున్న శివలింగం వున్న చోట దేవాలయాన్ని నిర్మించమని కలలో వాణి తెలియచేసిందని, ఆ మేరకు ఆలయన్ని ఆయన నిర్మించాడని చెబుతారు. కాల క్రమేణా నెల్లి నామం నెల్లూరుగా రూపాంతరం చెందిందంటారు.
నెల్లూరు తమిళనామం. తమిళ భాషలో నెల్లు అనగా వరి అని అర్ధం. వరివిస్తారంగా పండే ప్రాంతమైనందున తమిళులు యీ పేర పిలిచి అదే నామం స్థిరమయ్యేందుకు కారణభూతులైనట్లున్నారు. ఇది ఒక వాదమైతే, నల్ల + ఊరు అనే రెండు పదాలతో క్రమేపి నల్లవూరు నెల్లురుగా వాడుకలోకి రావటం జరిగిందని మరొక వాదన. నల్లవూరు అనగా మంచివూరు అని తెలుగు అర్ధం.