నేటి నిజం
స్వరూపం
| దస్త్రం:Netinizam1.jpg నేటి నిజం | |
| రకం | ప్రతి దినం దిన పత్రిక |
|---|---|
| రూపం తీరు | బ్రాడ్ షీట్ |
| యాజమాన్యం | ఫ్రీడం పబ్లికేషన్స్ |
| ప్రచురణకర్త | బి.వీణాదాస్ |
| సంపాదకులు | బైస దేవదాస్ |
| కేంద్రం | హైదరాబాద్, నిజామాబాద్ |
| జాలస్థలి | http://www.netinizam.com/ |
హైదరాబాదు, నిజామాబాదుల నుండి వెలువడుతున్న దినపత్రిక. ప్రతి గురువారం సాహితీకెరటాలు పేరుతో రెండుపేజీల సాహిత్య అనుబంధం వెలువడుతోంది. బైసా దేవదాసు ఈ పత్రిక సంపాదకుడు. వీణాదాస్ ముద్రాపకురాలు, ప్రచురణకర్త. ఈ పత్రిక సంక్రాంతి, ఉగాది, స్వాతంత్ర్య దినోత్సవం మొదలైన సందర్భాలలో ప్రత్యేకసంచికలను విడుదల చేస్తుంది. రాష్ట్రంలో జరిగే ఏ సాహిత్యకార్యక్రమానికైనా ఈ పత్రిక తగిన ప్రచారం కల్పిస్తుంది.