నేతపని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాప్‌ మరియు వెఫ్ట్‌ ఇన్‌ ప్లెయిన్‌ వీవింగ్‌

నేతపని (Weaving) అనేది వస్త్ర నైపుణ్యానికి సంబంధించింది. ఇందులో రెండు భిన్నమైన నూలు లేదా దారాలను వస్త్రం లేదా బట్టగా తయారుచేయడానికి ఒకటిగా కలుపుతారు. నేతలో పొడవుగా ఉండే దారాలను నిలువుపోగులు (వార్ప్) అని, అడ్డంగా పక్క పక్కనే ఉండే దారాలను అడ్డపోగులు (వెఫ్ట్) లేదా ఫిల్లింగ్‌ అంటారు.

సాధారణంగా దుస్తులను మగ్గం పై నేస్తారు. ఇది నూలు దారాలను పట్టి ఉంచే ఓ పరికరం. నింపిన దారాలను దాంతో అల్లుతారు. వెఫ్ట్ అనేది పాత ఆంగ్ల పదం. దేనినైతే నేసామో అది అని దీనర్థం.[1] వస్త్ర దళం ఏదైతే ఈ దుస్తుల నిర్వచనానికి సరితూగుతుందో వాటిని టాబ్లెట్‌ నేత‌ పరిజ్ఞానం‌తో కూడా రూపొందించవచ్చు.

నూలు మరియు దారాలను ఒకదానితో ఒకటి కలిపి నింపే పద్ధతిని నేయడం అంటారు. అత్యధికంగా నేత ఉత్పత్తులు ఈ మూడు ప్రాథమిక నేత పద్ధతుల్లో రూపొందించబడినవి: సాధారణ నేత, సిల్కు వస్త్రం పై నేత లేదా ట్విల్‌. నేసిన బట్టను సాధారణంగా (ఒకే రంగులో లేదా సామాన్య పద్ధతి), లేదా ఆకర్షణీయమైన లేదా కళాత్మక డిజైన్లలో, రంగుల్లో ముంచిన దారాలతో నేసి ఉండవచ్చు. వస్త్రంలో ఉన్న నిలువు పోగులు మరియు/లేదా అడ్డపోగులను నేయడానికి ముందు రంగులు అద్దడాన్ని ఇకత్‌ అంటారు.

సంప్రదాయ చేతి నేత మరియు వడకడం ఇప్పటికీ ప్రధాన వృత్తే. ఈ రోజుల్లో పశ్చిమంలో ఉన్న అత్యధిక వాణిజ్య వస్త్రాలు కంప్యూటర్‌ నియంత్రణలో ఉన్న జాక్వర్డ్‌ మగ్గం పై నేయబడుతున్నాయి. గతంలో సాధారణ వస్త్రాలను డాబి మగ్గాల పై నేసేవారు. జాక్వర్డ్‌ పద్ధతిని చాలా క్లిష్టమైన ఆకృతులకు ఉపయోగించేవారు. జాక్వర్డ్‌ మగ్గాల నైపుణ్యం, జాక్వర్డ్‌ నేత ప్రక్రియను ఉపయోగించి, డిజైన్లలోని సంక్లిష్టతలతో సంబంధం లేకుండా వస్త్రాలను మిల్లుల్లో నేయడం ద్వారా మరింత పొదుపు చేయవచ్చని కొందరు నమ్మారు.

ప్రక్రియ మరియు పరిభాష[మార్చు]

నిలువుపోగులను తయారుచేస్తున్న భారతీయ చేనేతకారుడు
చేతిమగ్గంతో నేస్తున్న మహిళ

సాధారణంగా, నేయడంలో నిలువు పోగులు మరియు మరియు అడ్డపోగుల (పాత అడ్డపోగులు ) రెండు సెట్ల దారాలను సరైన కోణంలో ఒకదానితో ఒకటి కలిపి కట్టడం ఇమిడి ఉంటుంది. నిలువుపోగులు ప్రత్యేకంగా మగ్గంలో సమాంతరంగా బిగువుగా పెట్టి ఉంటాయి. కొన్ని నేత ప్రక్రియల్లో ఇతర పద్ధతులను వినియోగిస్తారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ హిడెల్స్‌ మధ్య నుంచి ఉన్న నిలువు పోగులతో మగ్గం కప్పబడి (లేదా వేయబడిన) ఉంటుంది. హర్నెసెస్‌ ద్వారా అడ్డ దారాలు పైకి లేదా కిందకు కదులుతూ సృష్టించే స్థలాన్ని షెడ్‌ అంటారు. నిలువు దారాలు చుట్టబడి ఉన్నదానిని బోబిన్స్‌ అంటారు. బోబిన్స్‌ను షెడ్‌ నుంచి అడ్డపోగులను తీసుకెళ్లే షటిల్‌లో ఉంచుతారు.

నిలువు దారాలను పెంచే మరియు తగ్గించే పద్ధతి ఎన్నో నేత ఆకృతులకు అవకాశం ఇస్తుంది:

 • సాధారణ నేత,
 • ట్విల్‌ నేత,
 • సిల్కు వస్త్రంతో నేత, మరియు
 • సంక్లిష్టమైన కంప్యూటర్‌తో సృష్టించిన కలిపికట్టడం.

నిలువు పోగులు మరియు అడ్డపోగులు రెండూ తుది వస్తువులో కనిపిస్తాయి. నిలువు పోగులను చాలా దగ్గరగా ఉంచడం ద్వారా అడ్డపోగులను పూర్తిగా కనిపించకుండా చేసి నిలువుగా కనిపించే వస్త్రాన్ని నేయవచ్చు. దానికి వ్యతిరేకంగా ఒకవేళ నిలువు పోగులను విస్తరిస్తే అడ్డపోగులు కిందకు జారి పూర్తిగా నిలువు పోగులను కప్పేసి, అడ్డపోగుల వస్త్రంగా రంగులతో కూడిన లేదా కిలిమ్‌ రగ్గులుగా కనిపిస్తాయి. చేతితో నేయడం మరియు రంగులు అద్ది నేయడానికి వివిధ రకాలైన మగ్గాలు ఉన్నాయి. రంగులు అద్దిన నూలుతో ఆకృతిని రూపొందించడానికి అడ్డపోగులను మొత్తం నిలువు పోగుల మధ్య పరిచేయకుండా కేవలం నిర్దేశిత నిలువు పోగుల మధ్య మాత్రమే పెడతారు.

ప్రాచీన మరియు సంప్రదాయ పద్ధతులు[మార్చు]

చారిత్రాత్మక నేత ఆనవాళ్లు మరియు నేత పరికరాలు
పురాతన ఈజిప్టులో నేతపని
మహిళల నేతపనిపురాతన గ్రీకు ఎటిక్‌ల నల్ల గుర్తుల ఎపినిట్రాన్‌ వివరాలు500 బిసి నుంచి ఏథెన్స్‌.లౌరె మ్యూజియం, పారిస్‌.

రాతియుగ కాలంలోనే నేయడం గురించి తెలుసని కొన్ని సూచనలు ఉన్నాయి. ఒకే రకమైన వస్త్ర గుర్తులు పావలవ్‌, మొరావియాలో కనుగొన్నారు. నియోలితిక్‌ వస్త్రాలు స్విట్జర్లాండ్‌లోని పైల్‌ తవ్వకాల ద్వారా చాలా బాగా తెలిశాయి. ఫయూమ్‌లో కనుగొన్న నియోలితిక్‌లోని కొన్ని భాగాలా ద్వారా, ఆ ప్రాంతాన్ని 5000 బిసిఇగా గుర్తించారు. ఈ భాగాలను 12 దారాలు సెం.మీ. చొప్పున ఉన్న 9 దారాలతో సాధారణ నేత పద్ధతిలో నేశారు. ఆ సమయంలో జనపనార, ఈజిప్టులో పీచు కంటే ప్రముఖమైనది మరియు నైలు లోయలో ప్రధానంగా కొనసాగుతోంది. నూలు ప్రాథమిక నారగా మారిన తర్వాత కూడా ఇతర సంస్కృతుల్లో 2000 బిసిఇ వరకు వినియోగించారు. బదారి డిష్‌గా గుర్తింపు పొందిన మరో ప్రాచీన ఈజిప్టు వస్తువు వస్త్ర పరిశ్రమను సూచిస్తుంది. ఈ వస్తువు కెటలాగ్‌ నెంబరు యూసి9547, ప్రస్తుతం పీటర్‌ మ్యూజియంలో ఉంది మరియు ఇది 3600 బిసిఇ కాలానికి చెందింది. సుమెరియన్‌ కాలంలో బానిసలైన మహిళలు నేత కార్మికులుగా పని చేసేవారు. వారు నూలు నారను వేడి నీరు మరియు చెక్క పొడి సబ్బుతో కడగడం మరియు దానిని ఎండబెట్టడం చేసేవారు. తర్వాత, దాని మురికిని తొలగించేవారు మరియు నూలును అట్ట పై వేసేవారు. ఆ తర్వాత నూలును వర్గీరించేవారు, శుద్ధిచేసి మరియు దారాలుగా చుట్టేవారు. నూలు వడికేవారు నారను పైకిలాగి దానిని కలిపి అల్లేవారు. ఇదంతా నారను చేతుల మధ్య పెట్టుకుని చుట్టడం ద్వారా లేదా మెలి తిరిగిన ఓ కర్రతో చేసేవారు. ఆ తర్వాత దారాన్ని ఓ కర్ర లేదా ఎముకతో చేసిన కొడవలకి చుట్టడం మరియు ఎగిరే చక్రంలా పని చేసే మట్టితో చేసిన వృత్తము పై తిప్పేవారు.

ఆ తర్వాత బానిసలు మూడు మహిళా బృందాలుగా మగ్గాల పై పనిచేసేవారు. అక్కడ వారు ఆ దారాలను పైన మరియు కింద అడ్డం, నిలువు కోణాల్లో పెట్టిన తర్వాత వాటిని సాగదీసేవారు. పూర్తయిన వస్త్రాన్ని ఫుల్లర్‌ దగ్గరకు తీసుకెళ్లేవారు.

ఈస్టన్స్‌ బైబిల్‌ నిఘంటువు (1897) పురాతన కాలానికి సంబంధించిన నేతపని గురించి పలు బైబిలికల్‌ సూచనలను సూచిస్తుంది:

Weaving was an art practised in very early times (Ex 35:35). The Egyptians were specially skilled in it (Isa 19:9; Ezek 27:7), and some have regarded them as its inventors.

In the wilderness, the Hebrews practised weaving (Ex 26:1, 26:8; 28:4, 28:39; Lev 13:47). It is referred to subsequently as specially the women's work (2 Kings 23:7; Prov 31:13, 24). No mention of the loom is found in Scripture, but we read of the "shuttle" (Job 7:6), "the pin" of the beam (Judg 16:14), "the web" (13, 14), and "the beam" (1 Sam 17:7; 2 Sam 21:19). The rendering, "with pining sickness," in Isa. 38:12 (A.V.) should be, as in the Revised Version, "from the loom," or, as in the margin, "from the thrum." We read also of the "warp" and "woof" (Lev. 13:48, 49, 51–53, 58, 59), but the Revised Version margin has, instead of "warp," "woven or knitted stuff."

అమెరికన్‌ సౌత్‌వెస్ట్‌[మార్చు]

సంప్రదాయ నవోజి రగ్గు నేయడం

అమెరికన్‌ సౌత్‌వెస్ట్‌లోని తెగలో మూలకాలను వినియోగించి ఎండబట్టిన పత్తిని వస్త్రంగా నేయడం ప్రముఖ వృత్తిగా ఉండేది. ఇందులో పలు పూబ్లో ప్రజలు, జూని మరియు ఉటె తెగలు ఉన్నాయి. తొలిసారి ఇక్కడికి వచ్చిన స్పానిష్‌ దేశస్థులు నవజో దుప్పట్లను చూసినట్లు రాశారు. నవజో-చూర్రో గొర్రెల పరిచయంతో ఊలు ఉత్పత్తులు చాలా చిరపరిచితంగా మారిపోయాయి. 18వ శతాబ్దం నాటికి నవజో వారికి నచ్చిన రంగు అయిన బయేట ఎరుపులో ఉన్న నూలును దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. పైకి పనిచేసే మగ్గాన్ని వినియోగించి నవజోలు 1980లో వ్యాపార నిమిత్తం దుప్పట్లు మరియు రగ్గులను నేసేవారు. నవజో వాణిజ్య ఉన్ని జర్మన్‌టౌన్‌, పెనిన్‌సిల్వేనియా దిగుమతి చేసుకున్న ప్రాంతాల్లో అమ్ముడుపోయేది. వాణిజ్య ప్రాంతాల్లో స్థిరపడ్డ యూరోపియన్‌-అమెరికన్‌ల ప్రభావంతో నవజోస్‌ ఎన్నో భిన్నమైన పోకడలను సృష్టించారు. అందులో రెండు గ్రే కొండలు(ప్రధానంగా నలుపు మరియు తెలుపు, సంప్రదాయ పద్ధతులతో), టిక్‌ నాస్‌ పోస్‌(రంగులమయం, చాలా విస్తృతమైన ఆకృతుల్లో), గనడో(డాన్‌ లోరెంజో హబ్బెల్‌ కనుగొన్నారు), ఎరుపు ఎక్కువగా ఉండే నలుపు మరియు తెలుపు ఆకృతులు, క్రిస్టల్‌ (జె.బి.మూర్‌ కనుగొన్నారు), ఓరియంటల్‌ మరియు పర్షియన్‌ శైలి(దాదాపుగా ఎల్లప్పుడూ సహజ రంగులతో), వైడ్‌ రూయిన్స్‌, చిన్‌లి, రద్దు చేసిన భౌగోళిక ఆకృతులు, క్లాగెతోహ్‌, డైమండ్‌లాంటి ఆకృతులు, రెడ్‌ మెసా మరియు బోల్డ్‌ డైమండ్‌ ఆకృతులు ఉన్నాయి. ఇందులో చాలా అందమైన ఆకృతులను పలుసార్లు ప్రదర్శించారు. ఈ ఆలోచన సంప్రదాయ ఆలోచనల ఒప్పందంలో లేదా హోజోహ్‌ లో చేరింది.

అమెజోనియా[మార్చు]

స్థానిక అమెజోనియాలో పానోయన్స్‌, టుపి, వెస్టర్న్‌ టుకానో, యామియో, జపరోయన్స్‌ మరియు మధ్య హూల్లాగ నది పరీవాహక ప్రాంతానికి (స్టీవార్డ్‌ 1963:520) చెందిన ఇండిజినియస్‌ ప్రజలు ఎక్కువగా పామ్‌ చెట్టు నుంచి తీసిన నారతో నేసిన దోమల తెర లేదా టెంట్లను ఉపయోగించేవారు. అగుజె పామ్‌ చెట్టు నుంచి తీసిన నార (మాఋషియా ఫ్లెక్సియస, మౌరిషియా మైనర్‌ లేదా స్వాంప్‌ పామ్‌) మరియు ములుకులాంటి ఆకులు ఉన్న చాంబ్రియా పామ్‌ (ఆస్ట్రోకరియమ్‌ చాంబ్రియా, ఎ. మున్‌బాక, ఎ. టుకుమ, క్యూమారెగా కూడా పేరొందింది లేదా టుకమ్‌) ను పెరువియన్‌ అమెజాన్‌లోని యూరరినాలు కార్డెజ్‌, నెట్‌ బ్యాగులు, టెంట్లకు ఉపయోగించే దళసరి వస్త్రాన్ని నేయడానికి శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. యూరారినా మధ్య పామ్‌ చెట్టు నుంచి తీసిన నారతో నేసిన ఉత్పత్తులు పలు కోణాల్లో అందమైన పద్ధతుల్లో చొచ్చుకుపోయాయి మరియు యూరెనియా చరిత్రలో పలు సూచనల్లో గుర్తింపును పొందాయి. యురేనియా పురాణాలు నేత పనికి కేంద్రబిందువుగా ఉన్నాయి మరియు యురేనియా సమాజంలో ప్రముఖ పాత్ర వహించాయి. వరదలు రావడానికి ముందు సృష్టించిన పురాణాల ప్రకారం మహిళలకు నేతపని పై ఉన్న అవగాహన యూరెనియా సామాజిక పునరుద్ధరణలో ప్రముఖ పాత్ర వహించింది.[2] అయినప్పటికి పామ్‌-నార దుస్తులను నిత్యం మృత కర్మల ద్వారా వినియోగం నుంచి తీసివేస్తుండేవారు. యూరెనియా పామ్‌-నార సంపద పూర్తిగా ఇతరులకు ఇచ్చేది కాదు, అలాగే అంతరించిపోయేది కాదు. పని మరియు మారకంలో ఇది ప్రాథమిక మాధ్యంగా మారింది. పామ్‌-నార సంపద వినియోగం వివాహాలు మరియు రక్తసంబంధాల నుంచి రోగులతో నిరంతర సంబంధాలు వంటి సామాజిక సంబంధాల ద్వారా స్థిరపడింది (కంపడ్రజ్‌కో, ఆధ్యాత్మిక కంపీర్‌షిప్‌).[3]

ఇస్లామిక్‌ ప్రపంచం[మార్చు]

ఆధునిక ఇరాన్‌లోని పలు ఉపప్రాంతాల్లో చేతితో నేసిన పర్షియన్‌ కార్పెట్లు మరియు కిలిమ్‌లు గిరిజన వృత్తుల్లో ప్రధానమైన భాగాలు. కెర్మన్‌ నుంచి లావార్‌ కెర్మన్‌ కార్పెట్‌ మరియు అరక్‌ నుంచి సేరబంద్‌ రగ్గు ఉదాహరణగా చెప్పుకోదగిన కార్పెట్‌ రకాలు.

ఇస్లామిక్‌ స్వర్ణయుగంలో కాలి పెడల్‌తో నియంత్రించే మగ్గాలను పరిచయం చేయడం ద్వారా నేయడంలో ఓ ప్రధానమైన కొత్త మార్పు ముస్లిం ప్రపంచంలో అభివృద్ధి చెందింది. అలాంటి తొలి పరికరాలుసిరియా, ఇరాన్‌ మరియు తూర్పు అఫ్రికాలోని ఇస్లామిక్‌ ప్రాంతాల్లో కనిపించాయి. ఆపరేటర్‌ ఓ గుంతలో తన కాళ్లు పెట్టి కూర్చుని కింద వాలుగా ఉన్న మగ్గాన్ని నియంత్రిస్తాడు. 1177 నాటికి ఆల్‌-అండలస్‌లో ఇవి మరింతగా అభివృద్ధి చెందాయి. అక్కడ ఉన్న మెకానిజం ఏమిటంటే భూమి కంటే ఎత్తులో మరింత మంచి ఫ్రేమ్‌ను కలిగి ఉండటం. ఇలాంటి మగ్గాలు స్పెయిన్‌లోని క్రైస్తవ‌ ప్రాంతాలకు విస్తరించాయి మరియు త్వరలోనే మధ్య యూరోప్‌ ప్రాంతమంతా ఆదరణ పొందాయి.[4][ఆధారం యివ్వలేదు]

యూరప్[మార్చు]

చీకటి యుగం మరియు మధ్య యూరోప్‌[మార్చు]

ఆధునికమైన మగ్గాలను 10-11 శతాబ్దాల్లో తయారు చేసేంత వరకు ఐరోపా‌లో బరువైన నిలువు పోగుల మగ్గాలు చాలా ఎక్కువగా ఉండేవి. ప్రత్యేకంగా చలి వాతావరణంలో నేల పై ఉంచిన భారీ మగ్గం విలువైన చాలా స్థలాన్ని ఆక్రమించి ఉండేది. 20వ శతాబ్దం వరకు వ్యక్తిగత కుటుంబ అవసరాలకు హోమ్‌స్పన్‌ దుస్తులను తయారుచేయడానికి చాలా పురాతనమైన మగ్గాలను వినియోగించేవారు. ఐరోపా‌లో చాలా వరకు నేతకు ఉపయోగించే ప్రాథమిక వస్తువులలో ఉన్ని, నార కూడా చాలా సాధారణంగా ఉండేవి మరియు దిగుమతి చేసుకున్న సిల్కు దారాలను అప్పుడప్పుడు దుస్తుల తయారీలో వాడేవారు. పురుషులు మరియు స్త్రీలు కూడా నేసేవారు, అయినప్పటికీ ఈ పని తరచుగా ఇంటిపని చేసే మహిళలపైనే పడేది. వస్త్రం వెడల్పు నేసేవారికి అందుబాటులో ఉండేటట్టు పరిమితమై ఉండేది. కానీ అవి ఆ సమయంలో ఐరోపా‌లోని చాలా ప్రాంతాల్లో ధరించే ట్యునిక్‌ శైలి దుస్తులకు సరిపోయేవి. సాదాసీదా నేత లేదా ట్విల్‌ సాధారణం, నిపుణులైన చేనేతకారులు నైపుణ్యంతో మంచి వస్త్రాలను రూపొందించడం చాలా తరచుగా జరిగేది.

ఫ్లాండర్స్‌లోని బ్రూగ్గెస్‌ వంటి ప్రాంతాల్లో భారీ నేత కార్యకలాపాలు విలసిల్లే వరకు నేతపని పూర్తిగా స్థానికంగానే పరిమితమై ఉండేది. ఈ పరిస్థితుల్లో నైపుణ్యం ఉన్న నేతకారులు వారి వృత్తినైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేవారు మరియు వారి నైపుణ్యాన్ని శిక్షణలో ఉండేవారికి అందించేవారు. మధ్య యుగం వచ్చేసరికి గుర్తించదగిన స్థాయిలో మంచి దుస్తుల వ్యాపారం అభివృద్ధి చెందింది మరియు మగ్గాల సాంకేతికత మెరుగైంది. సన్నని దారాలతో కూడా నేయడం ప్రారంభించారు. చేనేత బృందాలు (మరియు అనుబంధ వృత్తి బృందాలు, ఫ్యూల్లర్లలా) గుర్తించదగిన స్థాయిలో రాజకీయ మరియు ఆర్థిక అధికారాన్ని కొన్ని పెద్ద చేనేత నగరాల్లో సాధించగలిగారు.

మధ్యయుగంలో చేనేత ఏడు యంత్ర కళల్లో ఒకటిగా గుర్తించబడింది.

అమెరికా వలసప్రాంతాలు[మార్చు]

అమెరికా వలస ప్రాంతాలు అన్ని రకాల ఉత్పత్తి చేసిన వస్తువుల కోసం భారీగా గ్రేట్‌ బ్రిటన్‌పై ఆధారపడ్డాయి. వలస ప్రాంతాల్లో ముడిసరుకులను ప్రోత్సహించడమే బ్రిటీష్‌ విధానం. నేయడాన్ని నిషేధించలేదు, కానీ బ్రిటిష్‌ ఉన్ని ఎగుమతి చేయడాన్ని నిషేధించారు. దాని ఫలితంగా అమెరికా వలస ప్రాంతాల్లో చాలాnమంది ప్రజలు స్థానికంగా ఉత్పత్తి చేసిన నారను, వస్త్రాలను నేయడానికి ఉపయోగించేవారు.

వలసకాలంలో వలసదారులు ఎక్కువగా ఉన్నిని, పత్తిని మరియు పీచు (నార) ను నేయడానికి వినియోగించేవారు. జనపనారను కాన్వాసులు మరియు భారీ దుస్తులను రూపొందించడానికి తయారుచేసేవారు. ప్రతిసారి వారు ఓ వంతు పత్తి పంటను పండించేవారు. కానీ కాటన్‌ జిన్‌ను కనుగొనే వరకు పత్తి పీచు నుంచి విత్తనాలను వేరుచేయడం చాలా శ్రమ శక్తితో కూడుకున్న పనిగా ఉండేది. పీచు మరియు జనపనారను వేసవిలో సాగుచేసేవారు మరియు పొడవైన నారుకు సంబంధించిన తొడిమలను అందులోనే పెంచేవారు. ఉన్నిని గొర్రె రకం పై ఆధారపడి ఏడాదికి రెండుసార్లు తీసేవారు. సంబంధిత ఉన్నిని ప్రాసెస్‌ చేయడం, దాని మన్నిక, ఉన్ని దుస్తులను నేయడంలో గొప్ప భాగాన్ని కలిగి ఉండేవి.

వలసకాలంలో సాదాసీదా నేతకు ప్రాధాన్యమిచ్చేవారు, మరియు ఇంట్లో సాధారణంగా ఉపయోగించే వాటిని నేయడానికి చాలా క్లిష్టంగా ఉండేది మరియు అదనపు నైపుణ్యం మరియు సమయం అవసరం పడేవి. కొన్నిసార్లు వస్త్రాల పై డిజైన్లు నేసేవారు, కానీ చాలా వరకు నేసిన తర్వాత ఉడ్‌ బ్లాక్‌ ప్రింట్లు లేదా ఎంబ్రాయిడరీ వినియోగించేవారు.

పారిశ్రామిక విప్లవం[మార్చు]

పారిశ్రామిక విప్లవానికి ముందు నేతపని చేతితో చేసే వృత్తి, సాధారణంగా వృత్తికారుల కుటుంబంలో దీనిని పార్ట్‌టైంగా చేసేవారు. మగ్గాలు విస్తారంగా లేదా ఇరుకుగా ఉండేవి. పెద్దగా ఉండే మగ్గాలు నేతకారులకు షటిల్‌ షెడ్ల మధ్యగా వెళ్లేంత విస్తారంగా ఉండేవి. దాంతో నేతకారుడికి ఒక సహాయకుడి అవసరం (తరచుగా ఒక అప్రెంటీస్‌) ఉండేది. జాన్‌ కె 1733లో ఫ్లైయింగ్‌ షటిల్‌ను కనుగొన్న తర్వాత వీటిని నిషేధించడం తప్పనిసరైంది, ఇది నేత పనిని వేగవంతం చేసింది కూడా.

గ్రేట్ బ్రిటన్[మార్చు]

1785 నుంచి యంత్రంతో నేయడాన్ని ప్రయత్నించిన మొదటి వ్యక్తి ఎడ్మండ్‌ కార్ట్‌రైట్‌. ఇతను డాన్‌కాస్టర్‌లో ఓ కర్మాగారాన్ని నెలకొల్పారు మరియు 1785 నుంచి 1792 వరకు వరుసబెట్టి పెటెంట్లను తీసుకున్నారు. 1788లో ఇతని తమ్ముడు మేజర్‌ జాన్‌ కార్ట్‌విట్‌ రివల్యూషన్‌ మిల్లును రెట్‌ఫోర్డ్‌ వద్ద స్థాపించారు (చారిత్రాత్మక గొప్ప విప్లవంగా పేరొందింది. 1791లో ఇతను మాంచెస్టర్‌లోని గ్రిమ్‌షా సోదరులకు ఇతని మగ్గానికి లైసెన్స్‌ ఇచ్చాడు. కానీ వారి మిల్లు ఆ తర్వాత సంవత్సరమే కాలిపోయింది (దహనం కేసు కావచ్చు). ఎడ్మండ్‌ కార్ట్‌విట్‌ కృషికి 1809లో పార్లమెంటు 10,000 పౌండ్ల రివార్డును అందజేసింది.[5] ఇదెలా ఉన్నా స్టాక్‌పోర్టుకు చెందిన హెచ్‌. మరోక్స్‌తో కలిపి విజయవంతమైన పవర్‌-వీవింగ్‌కు కూడా ఇతరుల ద్వారా మెరుగులు అవసరమయ్యాయి. 1805 తర్వాత కేవలం రెండు దశాబ్దాల్లోనే యాంత్రిక నేత పట్టు బిగించింది. బ్రిటీష్‌ పారిశ్రామిక విప్లవంలో వస్త్ర ఉత్పత్తి ఓ ప్రముఖ రంగమైంది. కానీ నేతపనితో పోల్చిచూసినపుడు కాస్త ఆలస్యంగా యాంత్రీకీకరణ చెందింది. కెన్‌వర్దీ మరియు బుల్లోగ్స్‌ లాంక్‌షైర్‌ మగ్గాల ద్వారా 1842లో మగ్గాలు సెమి-ఆటోమెటిక్‌గా మారాయి. ఇంటి దగ్గర నుంచి చేసే కళాత్మక పనుల (శ్రమతో కూడుకున్న మరియు మానవ శక్తి) నుంచి ఆవిరితో నడిచే పరిశ్రమల వరకు నేతపనుల్లో పలు కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. అక్రిన్‌టన్‌కు చెందిన హెవర్డ్‌ మరియు బుల్లాగ్‌, మరియు ట్విడెల్స్‌ మరియు సామెల్లి మరియు ప్లాట్‌ సోదరులు తదితర భారీ యంత్ర ఉత్పత్తి పరిశ్రమలు మగ్గాలను ఉత్పత్తి చేయడానికి రూపొందించబడ్డాయి. గ్రేటర్‌ మాంచెస్టర్‌ చుట్టుపక్కల ఉన్న చిన్న పట్టణాల్లో చాలా వరకు పత్తి, నేత షెడ్లలో నేయబడింది. పశ్చిమ యార్క్‌షైర్‌లో నేతపని దారుణంగా మారింది. నేతపనిలో నైపుణ్యం ఉన్న స్త్రీ మరియు పురుషులు వలసపోయారు. తమ తెలివిని వారి కొత్త ఇళ్లయిన న్యూ ఇంగ్లాండ్‌, పాటుకెట్‌ మరియు లోవెల్‌ వంటి ప్రాంతాల్లో వినియోగించారు.

1803లో ఫ్రాన్స్‌లో కనుగొన్న జాక్వర్డ్‌ మగ్గంతో సంక్లిష్టమైన దుస్తులను నేసే అవకాశం కలిగింది. పంచ్‌డ్‌ కార్డులను వినియోగించడం ద్వారా ఏ రంగు దారాలు దుస్తుల పై భాగంలో కనిపిస్తాయో తెలుసుకోగలిగారు.

అమెరికా, 1800-1900[మార్చు]

జాక్వర్డ్‌ మగ్గం

1801లో జాక్వర్డ్‌ మగ్గాలను కలపడం పరిపుష్టమైంది. 1806 నాటికి అవి యూరోప్‌లో సాధారణంగా మారాయి. ఇవి యూఎస్‌లో 1820 నాటికి వచ్చాయి. కొందరు వలస చేనేతకారులు వారితోపాటు జాక్వర్డ్‌ సామగ్రిని పశ్చిమం నుంచి న్యూ ఇంగ్లాండ్ కు విస్తరింపచేశారు. తొలిసారి దీనిని సంప్రదాయ మానవ శక్తి మగ్గంగా ఉపయోగించారు. ఆచరణాత్మకంగా చెప్పాలంటే పురాతన మగ్గాలు చాలా వరకు సాధారణ భౌగోళిక ఆకృతుల ఉత్పత్తులకు సంబంధించి పరిమితంగా ఉండేవి. జాక్వర్డ్‌ వ్యక్తి ప్రతి నిలువు పోగును, వరుసగా పునరుక్తి లేకుండా నియంత్రించడానికి అవకాశం కల్పించింది. దాంతో చాలా క్లిష్టమైన ఆకృతులు కూడా ఒక్కసారిగా సాధ్యమయ్యాయి. మధ్యకాలం నాటికి నేసిన కవరు దుస్తులు (మంచం కప్పడానికి) ప్రసిద్ధి చెందాయి. కొన్ని సందర్భాల్లో వినియోగదారుడి పేరు వచ్చేలా నిర్దేశించిన ఆకృతుల్లో నేయడం జరిగింది. రంగులద్దని పత్తి నిలువు పోగులు సాధారణంగా రంగులద్దిన నూలు అడ్డపోగులతో కలిపేవారు.

అమెరికన్‌ న్యాయ పోరాటానికి కొద్దిగా ముందు వరకు సహజ రంగులు వాడేవారు, ఆ తర్వాత కృత్రిమ రంగులు వాడుకలోకి వచ్చాయి.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • కిలిమ్‌
 • పర్షియన్‌ నేత
 • వస్త్ర ఉత్పత్తి పదజాలం
 • నేయడం (పురాణాలు)
 • బాస్కెట్‌ నేత

వివరా‌లు[మార్చు]

మహిళ నేయడంయూకియో-ఈ ఉడ్‌లాక్‌ ప్రింట్‌ బై యూషు చికనోబు, 1890
 1. భూతకాలానికి చెందిన వీవ్‌ నుంచి వచ్చింది(ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ డిక్షనరీ చూడండి వెఫ్ట్‌ మరియు వీవ్‌.
 2. బర్తలోమ్యోవ్‌ డీన్‌ 2009 యూరెనియా సొసైటీ, కాస్మోలజీ మరియు హిస్టరీ ఇన్‌ పెరువియన్‌ అమెజోనియా , గైనెస్‌విల్లి: యూనివర్సిటీ ప్రెస్‌ ఆఫ్‌ ఫ్లోరిడా ఐఎస్‌బిఎన్‌ 978-081303378 [1]
 3. బర్తలోమ్యోవ్‌ డీన్‌. మల్టీపుల్‌ రిజైమ్స్‌ ఆఫ్‌ వాల్యు: యూనిక్వల్‌ ఎక్స్చేంజ్‌ మరియు సర్క్యులేషన్‌ ఆఫ్‌ యూరెరినా పామ్‌-ఫైబర్‌ వెల్త్‌ మ్యూజియం ఆంత్రోపాలజీ ఫిబ్రవరి 1994, వాల్యు. 18, నెం. 1, పిపి. 3-20 ఆన్‌లైన్‌లో లభిస్తుంది)(పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌)[permanent dead link].
 4. Pacey, Arnold (1991), Technology in world civilization: a thousand-year history, MIT Press, pp. 40–1, ISBN 0262660725
 5. డబ్ల్యూ. ఇంగ్లీష్‌, టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ(1969), 89-97; డబ్ల్యూ. హెచ్‌. చాలోనర్‌, పీపుల్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ (1093), 45-54

సూచనలు[మార్చు]

 • ఈ ఆర్టికల్‌ను టెక్స్‌టైల్స్‌ బై విలియమ్‌ హెచ్‌. డూలె, బోస్టన్‌, డి.సి. హిఇత్‌ మరియు కం., 1914 నుంచి తీసుకోబడింది , ఓ భాగం ఆన్‌లైన్‌లోని ప్రాజెక్ట్‌ గూటెన్‌బర్గ్‌ పబ్లిక్‌ డొమైన్‌లో కూడా అందుబాటులో ఉంది.

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=నేతపని&oldid=2806403" నుండి వెలికితీశారు