నేదునూరి గంగాధరం
నేదునూరి గంగాధరం (జూలై 4, 1904 - మార్చి 11, 1970) జానపద సాహిత్యాన్ని ఉద్యమంగా నడిపిన ప్రముఖులు.
జననం
[మార్చు]వీరు జూలై 4, 1904 సంవత్సరంలో రాజమండ్రి మండలం కొంతమూరు లో జన్మించారు. చదివిన కొద్దిపాటి చదువుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు.1930లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా రాజమండ్రి కి వచ్చి తన సాహిత్య కృషిని కొనసాగించారు.[1] చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, పండుగ పాటలు, ఆటపాటలు, ప్రార్థన గేయాలు, వినోద గేయాలు, ఎక్కిరింత పాటలు, జంటపదాలు, జాతీయాలు, సామెతలు, కిటుకు మాటలు - లక్షల సంఖ్యలో సేకరించారు. వీనిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదలలో కొట్టుకొనిపోయాయి.
రచనలు
[మార్చు]వీరు ఈ క్రింది గ్రంథాలను ప్రకటించారు.
- మేలుకొలుపులు (1949)
- మంగళహారతులు (1951)
- సెలయేరు (1955)
- వ్యవసాయ సామెతలు (1956)
- పసిడి పలుకులు (1960)
- స్త్రీల వ్రత కథలు (1960)
- జానపద గేయ వాఙ్మయ వ్యాసావళి
- ఆట పాటలు(1964)
- జవహర్ లాల్ నెహ్రూ సమగ్ర చరిత్ర (1966)[2]
- శకునశాస్త్రము[3]
- మిన్నేరు (1968)
- మున్నీరు (1973) మరణానంతరం ప్రచురింపబడింది.
- పండుగలు-పరమార్థములు
- వ్యవసాయ ముహూర్తదర్పణం
- గృహవాస్తు దర్పణం
- పుట్టుమచ్చల శాస్త్రం
- కోడిపుంజుల శాస్త్రం
బిరుదులు
[మార్చు]- కవి కోకిల
- వాస్తువిశారద
- వాఙ్మయోద్ధారక
- జానపదబ్రహ్మ
మరణం
[మార్చు]వీరు 1970, మార్చి 11వ తేదీన పరమపదించారు.
మూలాలు
[మార్చు]- ↑ Wilde, Erik (1999), "HTTP Servers", Wilde’s WWW, Berlin, Heidelberg: Springer Berlin Heidelberg, pp. 387–420, ISBN 978-3-642-95857-1, retrieved 2024-09-10
- ↑ భారత డిజిటల్ లైబ్రరీ లో పుస్తక ప్రతి.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.
- గంగాధరం, నేదునూరి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 130.
- జానపద వాఙ్మయ భిక్షువు : నేదునూరి గంగాధరం[permanent dead link]