నేపాల్‌లో కోవిడ్-19 మహమ్మారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోవిడ్-19
ప్రదేశంనేపాల్
మొదటి కేసుఖాట్మండు
ప్రవేశించిన తేదీ9 January 2020
(4 సంవత్సరాలు, 2 నెలలు, 3 వారాలు , 6 రోజులు)
మూల స్థానంచైనా వూహన్
అధికార వెబ్‌సైట్
covid19.mohp.gov.np

కోవిడ్-19 నేపాల్లో ఇంకా కొనసాగుతుంది. నేపాల్‌లో మొదటి కేసు 2020 జనవరి 23 న నిర్ధారించబడింది.జనవరి 9 న వుహాన్ నుండి ఖాట్మండుకు తిరిగి వచ్చిన 31 ఏళ్ల విద్యార్థి ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. మే 14న మొదటి మరణం సంభవించింది.2020 మార్చి 24 న దేశం వ్యాప్తంగా పాఠశాలలు మూసివేశారు. 2020 జూలై 26 నాటికి 12,667 ధ్రువీకరించారు కేసులు, నమోదు కాగా 161 మరణాలు మొత్తం నమోదయ్యాయి.[1][2]

నేపథ్య[మార్చు]

చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌. కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే వైరస్. ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌లో కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో "కరోనావైరస్‌"గా గుర్తించారు. ఈ వ్యాధికి ప్రస్తుతం చాలా రకాల టీకాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్.[3][4][5][6][7]

కాలక్రమం[మార్చు]

నేపాల్‌లో మొదటి కోవిడ్-19 కేసు జనవరి 8 న నిర్ధారించబడింది.మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయబడింది. వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీకి చెందిన 12 మంది భారతీయులు ఉదయపూర్‌లోని భుల్కేలోని మసీదులో నిర్బంధించబడ్డారు.ఏప్రిల్ 30 నాటికి మొత్తం ధ్రువీకరించబడిన కేసుల సంఖ్య 57 వారిలో 16 మంది కోలుకున్నారు.

నివారణ చర్యలు[మార్చు]

జనవరి నుండి, నేపాల్ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ మూసివేశారు. భారతదేశంతో సరిహద్దు ప్రాంతంలో చెక్‌పోస్టులలో హెల్త్-డెస్క్‌లను ఏర్పాటు చేసింది.భారతదేశం, చైనాతో భూ సరిహద్దులు పూర్తిగా మూసివేయబడ్డాయి.అన్ని అంతర్జాతీయ విమానాలు నిలిపివేయబడ్డాయి.అన్ని విద్యా పరీక్షలు రద్దు చేయబడ్డాయి.పాఠశాలలు కళాశాలలు మూసివేయబడ్డాయి.రోగ అనుమానితులను విడిగా ఉంచడం కోసం తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసారు.కోవిడ్-19 కోసం టీకాలు వేయడం నేపాల్‌లో 2021 జనవరి 27న ప్రారంభమైంది [8][9] దేశవ్యాప్తంగా ఐసోలేషన్ వార్డులు, తాత్కాలిక ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఖాట్మండులోని నేపాల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ వ్యాధిని పరీక్షించగల ఏకైక ప్రయోగశాల ఏర్పాటు చేశారు.కోవిడ్-19 రోగులందరినీ అవసరమైన మేరకు రక్షించి, ఉచిత చికిత్స అందిస్తామని ఆరోగ్య మంత్రి ప్రకటించారు.ఖాట్మండు వ్యాలీలో 115 ఐసియు 1,000 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేయాలని భావించారు.

ప్రభావం[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షల కారణంగా పర్యాటక రంగం నష్టం వాటిల్లింది. వస్తువుల తయారీ రంగం ముడి పదార్థాల కొరతను ఎక్కువగా ఏర్పడింది.వీటిలో ఎక్కువ భాగం చైనా నుండి వచ్చేవి.చైనా నుంచి దిగుమతులు తగ్గిపోవడంతో హోల్‌సేల్, రిటైల్ రంగంపైనా ప్రభావం పడింది.మార్చి 18న, ప్రభుత్వం అన్ని సినిమా హాళ్లు, వ్యాయామశాలలు, మ్యూజియాలు, సాంస్కృతిక కేంద్రాలను మూసివేసింది. ప్రార్థనా స్థలాలతో, బహిరంగ ప్రదేశాల్లో 25 మంది కంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించింది.

తప్పుడు సమాచారం[మార్చు]

మార్చి 21న కోవిడ్-19 కేసులను ప్రభుత్వము కప్పిపుచ్చినట్లు ఆరోపిస్తున్న ఆడియో టేపులను ఆన్‌లైన్‌లో షేర్ అయినాయి.ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడనే ఆరోపణలపై 20 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. అదే రోజు, ఆర్మీ హెలికాప్టర్‌లను అర్ధరాత్రి క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడానికి ఉపయోగిస్తున్నారని సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లను వచ్చాయి.

మూలాలు[మార్చు]

  1. "Nepal Reports South Asia's First Confirmed Case Of Deadly Coronavirus". NDTV.com. Archived from the original on 2020-01-24. Retrieved 2020-05-21.
  2. Pradhan, Tika R (2020-07-21). "Government decides to lift the four-month-long coronavirus lockdown, but with conditions". Kathmandu Post. Archived from the original on 2020-07-22. Retrieved 2020-07-22. The government has announced an end of the nationwide lockdown that it had imposed starting March 24 to contain the spread of Covid-19. Minister for Finance and Communication Yubaraj Khatiwada, who is also the government spokesperson, told a press briefing that Monday's Cabinet meeting had decided to lift the lockdown effective from Tuesday midnight with a few restrictions such as a ban on large gatherings still in place.
  3. Elsevier. "Novel Coronavirus Information Center". Elsevier Connect. Archived from the original on 30 January 2020. Retrieved 15 March 2020.
  4. Reynolds, Matt (4 March 2020). "What is coronavirus and how close is it to becoming a pandemic?". Wired UK. ISSN 1357-0978. Archived from the original on 5 March 2020. Retrieved 5 March 2020.
  5. "Crunching the numbers for coronavirus". Imperial News. Archived from the original on 19 March 2020. Retrieved 15 March 2020.
  6. "High consequence infectious diseases (HCID); Guidance and information about high consequence infectious diseases and their management in England". Government of the United Kingdom. Archived from the original on 3 March 2020. Retrieved 17 March 2020.
  7. "World Federation Of Societies of Anaesthesiologists – Coronavirus". wfsahq.org. Archived from the original on 12 March 2020. Retrieved 15 March 2020.
  8. "206 Nepalis die of coronavirus across the globe as of Saturday evening". My Republica. 2020-07-26. Archived from the original on 2020-07-26. Retrieved 2021-02-12.
  9. "COVID-19 vaccination drive to commence from Wednesday in Nepal". The Himalayan Times. 2021-01-24. Archived from the original on 20 February 2021. Retrieved 2021-01-24.

వెలుపల లింకులు[మార్చు]