నేపాల్ లో పర్యాటకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేపాల్లో పర్యాటకము అనేది అన్నిటికంటే పెద్ద వ్యాపార విషయము; విదేశీ మారకద్రవ్యమునకు పెద్ద ఆధారము. ప్రపంచములోని పది అతిపెద్ద పర్వతములలో ఎనిమిదింటిని కలిగి ఉండడము వలన, పర్వతారోహకులకు, సాహసములు చేయడము ఇష్టపడేవారికీ, మరియు రాళ్ళు ఎక్కేవారికి నేపాల్ స్వర్గధామము వంటిది. నేపాల్ లోని హిందూ మరియు బౌద్ధమత సంప్రదాయములు, చల్లని వాతావరణము కూడా బలమైన ఆకర్షణలుగా ఉన్నాయి.మనోల్లాసము కోసం, విశ్రాంతి కోసం, వ్యాపారం కోసం మనం చేసే ప్రయాణమే పర్యాటకరంగం.

ముఖ్యమైన పర్యటనకు సంబంధించిన పనులు

ఒక పర్యావలోకనము

నేపాల్ సాహసోపేతమైన పర్యటనకు పేరుపొందిన గమ్యము అయిన, ప్రపంచములోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ను కలిగి ఉన్న ప్రఖ్యాత దేశము. ప్రపంచ వారసత్వ సంపద అయిన లుంబిని (గౌతమ బుద్ధుని జన్మస్థలము) కూడా నేపాల్ లోనే ఉంది. ప్రకృతి సౌందర్యము మరియు జీవనములోని వివిధ రకములు, ఎత్తైన హిమాలయములు, సాటిలేని సంప్రదాయ వారసత్వము మరియు ఇంకా చాలా చాలా ప్రత్యేకతలు ఒక ప్రత్యేక ఇమేజ్ (NTB, 2009) తో నేపాల్ ను ప్రపంచ పర్యాటకములోనే పేరు పొందిన గమ్యముగా చేసాయి. ఈ అంశములు అన్నీ నేపాల్ ను పర్యాటకమునకు ఒక గొప్ప ప్రదేశముగా చేసి, పర్యాటకము బాగా అభివృద్ధి అయ్యేలా చేసాయి. కేవలము ఆర్ధికపరముగా చూస్తే ఇప్పటివరకు ఈ అభివృద్ధి ఇంకా అంతగా అయింది అని చెప్పడానికి లేదు. ఈ పర్యాటక రంగము విదేశీ మారక ద్రవ్యమును హద్దులు లేకుండా ఆర్జిస్తున్నప్పటికిని గొప్ప అభివృద్ధి జరిగింది అని చెప్పడానికి వీలు లేదు. క్రొత్త ప్రభుత్వ ప్రణాళికలు పర్యాటకము యొక్క నిజమైన విలువ పట్ల, ఆర్ధిక ఎదుగుదలలో దాని స్థానము పట్ల మరియు దేశములో పర్యాటకాభివృద్ధి పైనా దృష్టి సారించాయి. ఇంకా, పర్యాటక పరిశ్రమ దేశములో పేదరికమును తగ్గించడానికి మరియు సాంఘిక సమానత్వము నెలకొల్పడానికి మంచి అవకాశముగా భావించబడుతోంది. మినిస్ట్రీ అఫ్ పర్యాటకం అండ్ సివిల్ ఏవియేషన్ (MOTCA) మరియు నేపాల్ పర్యాటకం బోర్డ్ (NTB) మరియు 2020 నాటికి రెండు మిలియన్ల పర్యాటకులను ఆకర్షించాలనుకునే ఇతర వ్యాపారములు అన్నీ సంయుక్తముగా నేపాల్ పర్యాటకం విజన్ 2020ను విడుదల చేసాయి (ఆధారము:ఎకనమిక్ సర్వే, 2009. MOF, నేపాల్)


విదేశీ పర్యాటకుల రాక (ఆధారము:ఎకనామిక్ సర్వే, 2009)

నేపాల్ కు చూడడానికి వస్తున్న పర్యాటకుల సంఖ్యను విశ్లేషిస్తే, వారి పెరుగుదల తీరు మరియు వారు ఉండే సమయము, 2007వ సంవత్సరమునకు 37.2 శాతము పెరిగి 526,705 అయింది. వారి మొత్తము సంఖ్య 2008 సంవత్సరమునకు గాను 5 శాతము తగ్గి 500,277 అయింది. 2006లో ఒక పర్యాటకుడు దాదాపుగా 11.96 రోజులు ఉండేవారు, అదే తగ్గి 2008 లో 11.78 రోజులకు వచ్చింది. పర్యాటకుల రాక 37.2 శాతము పెరిగి 2007 లో 526,705 లకు వచ్చింది. మొత్తము పర్యాటకులలో 2008 లో 5 శాతము తగ్గి 500,277 కు వచ్చింది. 2006 లో, ఒక పర్యాటకుడు దాదాపుగా 11.96 రోజులు ఉండేవారు, అదే తగ్గి 2008 లో 11.78 రోజులకు వచ్చింది.2008లో వచ్చిన మొత్తము పర్యాటకులలో, 27.5 శాతము మంది పడమటి ఐరోపా నుండి,7.6 శాతము మంది ఉత్తర అమెరికా నుండి,3.2శాతము మంది ఆస్ట్రేలియా మరియు పసిఫిక్ ప్రాంతము నుండి,2.6 శాతము మంది తూర్పు ఐరోపా నుండి, 1.5 శాతము మంది మధ్య మరియు దక్షిణ అమెరికా నుండి,0 .3 శాతము మంది ఆఫ్రికా నుండి మరియు 1.4 శాతము మంది ఇతర దేశముల నుండి ఉన్నారు. మొత్తము పర్యాటకులలో 55.9 శాతము మంది ఆసియా నుండి అందులోనే 18.2 శాతము మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. భాగము పరముగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా మరియు పసిఫిక్ ల నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య అదే సమయమునకు క్రితము సంవత్సరముతో పోలిస్తే తగ్గినప్పటికీ, ఆఫ్రికా మరియు ఇతర దేశముల నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది.

ముఖ్యమైన పనులు (ఆధారము:http://tourism.gov.np)

పర్వతారోహణము

800ల కిలోమీటర్ల నేపాల్ లోని హిమాలయముల పంక్తి మౌంట్ ఎవరెస్ట్ తో సహా 8,000 మీటర్లకు పైగా ఉన్న ఎనిమిది పర్వతశిఖరములు, ప్రపంచములోనే గొప్పవి. 1994 లో దేశము ఈ పర్వతశిఖరములు ఎక్కడానికి అనుమతించినప్పటినుంచి, నేపాల్ హిమాలయములు పర్వతారోహణకు ఆలవాలము అయింది మరియు అందులో విజయము, అపజయము వేలమంది స్త్రీలు, పురుషులకు అక్కడకు చేరడము అనే సవాలులో నెగ్గాలన్న తపనను పెంచింది. ఈ నేపాల్ హిమాలయములు సాధువులు, తత్వవేత్తలు, పరిశోధకులు లేదా సాహసములు చేసేవారు వంటి ఎంతో మందికి ఆకర్షణియముగా ఉన్నాయి.

ట్రెక్కింగ్ నేపాల్ యొక్క ఎదురులేని ప్రకృతి సౌందర్యం మరియు సంప్రదాయముల మేలు కలయికను బాగా అనుభవించాలంటే వాటిగుండా నడుస్తూ వెళ్ళడమే సరైన మార్గము. ఎవరైనా కాలిబాట గుండా లేదా మంచి త్రోవల వెంట నడచి వెళ్ళవచ్చు. ఎలాగైనా మీరు ఒక జీవిత కాలమునకు సరిపడా అనుభవమును పొందుతారు. గన్నేరు చెట్ల అడవులను, ప్రక్కగా ఉన్న గూడెములను మరియు చిన్న కొండప్రాంతపు పల్లెలను, పక్షులు, జంతువులు, దేవాలయములు, ఆశ్రమములు మరియు చూపు తిప్పుకోనివ్వని ప్రకృతి దృశ్యములు మీరు చూడవచ్చు. ఇంకా మీకు వేరు, వేరు సంప్రదాయముల పల్లెల జీవితవిధానమును ప్రతిబింబిస్తూ, స్నేహముగా ఉండే ప్రజలు కూడా కలుస్తారు.

బర్డ్ వాచింగ్ నేపాల్ పక్షి ప్రేమికులకు మొత్తము 646 జాతులతో (దాదాపు ప్రపంచములో 8% శాతము) స్వర్గధామము, మరియు వాటిలో దాదాపు 500ల జాతులు ఒక్క కాఠ్మండు లోయలోనే చూడవచ్చు. జాతీయ అభయారణ్యములైన ఫుల్ చోకి, గోదావరి, నాగార్జున్, బాగమతి చెరువు, టౌడహాలు పక్షులను చూసే ప్రదేశములలో బాగా పేరు పొందినవి. మీ బైనాక్యులర్స్ కూడా తెచ్చుకుని ఒక అద్భుతమైన, సంతృప్తికరమైన అనుభవము కొరకు ఎదురు చూడండి.

మౌంటైన్ ఫ్లైట్ భూమి పైన ఎత్తైన పర్వత శిఖరములు చేరడము అనే అనుభవమునకు దగ్గరగా రాగలిగింది కేవలము భయానకమైన నిశ్శబ్దము మాత్రమే. పర్వత శిఖరములు మౌంట్ ఎవరెస్ట్, కాంచెనగంగ మరియు టిబెటన్ ప్లేటుల దగ్గరి విహంగ వీక్షణము ఇస్తాయి. పర్వతశిఖరములు అన్ని రకముల ప్రయాణికులకు నచ్చుతాయి మరియు నేపాల్ పర్యాటకములో పేరుపొందిన ఆకర్షణ అయ్యాయి. సమయాభావంతో లేదా వేరే ఇతర ఏ కారణముల వలన అయినా కానీ ఇలా వెళ్ళలేని వారికి, ఈ శిఖరములు హిమాలయములకు నాలుగు దిక్కులా ఉన్న అధ్బుతమైన సౌందర్యమును ఒక్క గంటలోనే చూపిస్తాయి.

రాక్ క్లైమ్బింగ్ అక్కడ ఉన్న క్లిఫ్ హంగర్స్ కు, కాఠ్మండులోని రాళ్ళ గోడల పంక్తి ఒక మంచి జీవిత అనుభవము అవుతుంది. ఆలస్యముగా అయినా, కాఠ్మండులో రాక్ క్లైమ్బింగ్ కు అనువుగా ఉన్న కొన్ని భయంకరమైన ప్రదేశముల వలన ఇది పేరు పొందిన ఆట అయింది. మీరు ఈ ఆట కోసము చూడదగిన ప్రదేశములలో నాగార్జున్, బలాజు, శివ్ పురి మరియు బుధానిల్ కంత వంటివి ముఖ్యమైనవి.

రాఫ్టింగ్/కయాకింగ్/కాన్యోనింగ్ దేశము యొక్క సరైన సహజ సౌందర్య చుట్టు కొలత మరియు ఆచార వ్యవహారములు చూడాలంటే తెప్ప పై తిరగడము సరైన మార్గము. నేపాల్ లో లెక్కకు మిక్కిలిగా చెరువులు ఉన్నాయి, ఇవి అద్భుతమైన రాఫ్టింగ్ లేదా కేనోయింగ్ అనుభవమును ఇస్తాయి. మీరు ప్రకృతిని తిలకిస్తూ, ప్రశాంతముగా మరియు నీలముగా ఉన్న నీళ్ళ పై నెమ్మదిగా తేలిపోవచ్చు లేదా గలగలా, వేగముగా ప్రవహిస్తున్న తెల్ల నురుగులలో ప్రభుత్వము అనుమతించిన సంస్థలచే నియమింపబడిన ఈతగాళ్ళ రక్షణలో వెళ్ళవచ్చు. ఒకరు ఒకరోజు లేదా అంతకంటే ఎక్కువగా కూడా చెరువులో గడపటానికి సమయాన్ని తీసుకోవచ్చును. ఇప్పటివరకు రాఫ్టింగ్ ను వ్యాపార స్థాయిలోకి తీసుకుని వెళ్లడము కొరకు ప్రభుత్వము 10 చెరువులను తెరిచింది. త్రిసులి చెరువు (గ్రేడ్ 3+) నేపాల్ యొక్క రాఫ్టింగ్ చేసే చెరువులలో ఎక్కువగా పేరుపొందినది. కాళిగండకి (5-5+) లోని గాలులు లోతైన లోయలలో నుంచి వేగముగా ఐదు రోజుల పాటు వీస్తాయి. భోటే కోషి (4-5) అనేది 26 కిలోమీటర్ల తెల్లని నీరు మరియు మర్షన్ఘి అనేది నాలుగు రోజుల ఆగని తెల్లని నీరు. కర్నాలి (4-5) చెరువు ప్రపంచములోని కొన్ని గొప్ప ప్రవాహములను గుర్తు చేస్తుంది. సన్ కోషి (4-5), 27 కిలోమీటర్లు ఉంటుంది, ఇంకా పూర్తి చేయడానికి 8–10 రోజులు పడుతుంది. ఇది ఒక పెద్ద మరియు సవాలు విసిరే చెరువు. ఈ సాహసములు అన్నీ ప్రపంచ స్థాయి సేవలతో రాఫ్టింగ్ ఏజెంట్స్ ద్వారా ఇవ్వబడతాయి. ఇక్కడ ఏజెన్సిలు ప్రపంచస్థాయి రాఫ్టింగ్ కు కావలసిన లైఫ్ జాకెట్లు, గుడారములు మరియు రాఫ్టింగ్ కు కావలసిన దుస్తులు అన్నీ సమకూర్చుతాయి. ఐరోపాలో పేరు పొందిన ఆట అయిన కాననింగ్ ఇప్పుడు నేపాల్ లో కూడా ఆడుకోవచ్చు. కాననింగ్ ప్రపంచములో చాలా అందమైనవి అయినప్పటికీ, వదిలివేయబడిన ప్రదేశములు చూసే అవకాశము మీకు కల్పిస్తాయి.

హాట్ ఎయిర్ బెలూనింగ్ హాట్ ఎయిర్ బెలూనింగ్ అనేది కాఠ్మండు లోయలో, హిమాలయములు వెనుకగా కలిగి ఉన్న అద్భుతమైన విహంగ వీక్షణముతో పర్యాటకులను విశేషముగా ఆకర్షిస్తోంది. ఒక మంచి మబ్బులు లేని రోజున హిమాలయములను (దాదాపుగా 6000 మిటర్ల పైనుండి) చూడడము చాలా అద్భుతమైన అనుభవము, ఆ లోయ అధ్బుత దృశ్యము ఉపిరి తీసుకోనివ్వదు.

బంగి జంపింగ్ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా బంగి జంపింగ్ యొక్క అత్యంత ఆనందమును ఇప్పుడు నేపాల్ లోని కొన్ని మంచి ప్రదేశములలో పొందవచ్చును. నేపాల్ యొక్క మొదటి బంగి జంపింగ్ ప్రదేశము 160 మీటర్లలో, భోటే కోషి చెరువు వద్ద, చుట్టుపక్కల అద్భుతమైన సౌందర్యముతో, మిమ్మల్ని అద్భుతమైన అనుభవము కొరకు ఆహ్వానిస్తూ నెలకొని ఉంది. 160 మీటర్ల ఎత్తు నుంచి ఉన్న ఈ దూకే ఆట, ఇందులో చాలా అనుభవము కలిగిన కొంతమంది జంప్ మాస్టర్ ల ద్వారా నిర్వహించబడుతున్నది.

పారాగ్లైడింగ్ పారాగ్లైడింగ్ అనేది సాహసములు చేయడములో, నేపాల్ లో అత్యంత సంతృప్తిని ఇచ్చే, అద్భుతమైన అనుభవము. ఈ ప్రయాణములో మీరు హిమాలయముల గాలిని, హిమాలయముల దివ్యమైన సౌందర్యమును ఆస్వాదిస్తూ, రాబందులతో, గ్రద్దలతో, గాలిపటములతో, ఆశ్రమములతో, దేవాలయములతో, సరస్సులు మరియు అడవులతో పంచుకుంటారు. ఇలా ఈ ప్రయాణము మీకు ప్రపంచములోని కొన్ని చాలా గొప్ప ప్రకృతి సౌందర్యములను పరిచయము చేస్తుంది.

అల్ట్రా లైట్ ఎయిర్ క్రాఫ్ట్ అల్ట్రా లైట్ ఎయిర్ క్రాఫ్ట్, పొఖార నుండి ప్రారంభం అయ్యి సరస్సుల, పర్వతముల మరియు గ్రామముల అద్భుత వీక్షణము చేయిస్తుంది. ఇది జీవితమును ఇంకొక కోణములో చూడడానికి చక్కటి మార్గము. అల్ట్రా లైట్ ఎయిర్ క్రాఫ్ట్ కొరకు పోఖర లోయను ఎంచుకోవడానికి కారణము, అక్కడ కొండలు దగ్గర దగ్గరగా ఉండడము మరియు సరస్సుల దృశ్యములు ఉండడము. పక్షిలాగా ఎగరాలని అనుకున్నవారికి ఈ విమానానుభావం తప్పనిసరి. ఎత్తులో ఒంటరిగా అనిపిస్తుంది, కానీ ఈ అద్భుత దృశ్యము కొరకు ఈ విమాన ప్రయాణం తప్పనిసరిగా చెయ్యాలి. పైన ఒంటరిగా అనిపిస్తుంది, కానీ ఈ అద్భుత దృశ్యము కొరకు అది ఫరవాలేదు అని అనిపిస్తుంది. విమానములు పోఖర విమానాశ్రయము నుండి సెప్టెంబరు నుండి జూన్ వరకు ఉంటాయి. ఈ నెలల్లో విమానములు సూర్యోదయము నుండి మధ్యాహ్నం 11 వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల నుండి సూర్యాస్తమయం వరకు ఉంటాయి.

మౌంటెన్ బైకింగ్ కాఠ్మండు లోయను బాగా చూడాలంటే పర్వతములలో తిరగగలిగిన మౌంటెన్ బైక్ ఎంపిక సరైన మార్గము. నేపాల్ యొక్క వేరు వేరు ప్రాంతములు మౌంటెన్ బైక్ లపై తిరగాలనుకొనే వాటి కలను నిజం చేస్తాయి. మౌంటెన్ బైక్ పై తిరగడము వలన పర్యావరణపరంగా ఈ అద్భుతదేశము యొక్క ప్రకృతి దృశ్యములు మరియు వారి సంప్రదాయములు తెలుసుకునే మంచి అవకాశము లభిస్తుంది. నేపాల్ లో మౌంటైన్ బైక్ లో ఆసక్తి కలిగిన వారి తీవ్రమైన కోరిక తీర్చడానికి చాలా మురికి రోడ్లు మరియు వంకర త్రోవలు కూడా ఉన్నాయి. పోఖర మరియు కాఠ్మండు వంటి పట్టణములు మరియు పల్లెటూరి ప్రాంతాలను కూడా బాగా చూడడానికి, మౌంటెన్ బైకింగ్ ప్రత్యేకముగా ఉద్దేశించబడింది. సాహసోపేతమైన అలవాట్లు ఉన్నవాళ్ళు నమ్చే బజారు మరియు పడమర నేపాల్ వంటి రహస్యమయమైన ప్రాంతములకు పర్యటనను పోడిగించుకుంటారు. పీటభూముల గుండా మీరు మొత్తము నేపాల్ ను ఒకేసారి చూడవచ్చు. మౌంటైన్ బైక్ లు నేపాల్ లోని చాలా సైకిళ్ళ దుకాణములలో మరియు ఊరిచుట్టు కూడా, ఒక రోజుకు కానీ, అంతకంటే ఎక్కువ సమయమునకు కానీ అద్దెకు దొరుకుతాయి.

అడవిలో విహారము నేపాల్ లోని టేరై ప్రాంతములోని జాతీయ పార్కులు ప్రపంచ వ్యాప్తముగా పర్యాటకులను ఆకర్షిసున్నాయి. ఈ పార్కులను దర్శించడము ఒక ఆటలా ఉంటుంది. నడచి వెళ్ళటం, సొరంగ మార్గము గుండా వెళ్ళటం, జీప్ లోనూ, మరియు ఏనుగు అంబారి పై దర్శించడము అనేక సందర్శన మార్గాలు ఉంటాయి. ఎవరైనా సరే, ఒకటో రెండో కొమ్ములున్న నీటి గుర్రములను తప్పనిసరిగా చూస్తారు. నీటి గుర్రములు మాత్రమే కాకుండా, అడవి ఎలుగుబంట్లు, జింకలు, మచ్చల జింకలు, పెద్ద దుప్పులు మాములుగా కనిపిస్తూనే ఉంటాయి. ఒక రాయల్ బెంగాల్ పులి తన అద్వితీయ అంశతో మిమల్ని ఆశ్చర్యపరచవచ్చు.


ఆధ్యాత్మిక సైట్ లు (ఆధారము:http://tourism.gov.np)

నేపాల్ లో పండుగలు, రోజువారీ పూజ, పునస్కారములుగా, కుటుంబ ఉత్సవములుగా మరియు ధార్మిక ఉత్సవములుగా జీవితములోని ప్రతీ అంశములో మతము తన ముద్రను కలిగి ఉంటుంది. అడుగడుగునా చిన్న, పెద్ద దేవాలయములు, ఉత్సవములు మరియు భక్తి సంగీతము ఉంటాయి. నేపాల్ కేవలము హిందూ దేశముగానే ప్రపంచ ప్రసిద్ధము అయినప్పటికి, నిజమునకు అది హిందూమతము, బౌద్ధమతము మరియు ఇతర మతస్థులు అందరు కలిసిమెలిసి, పరమత సహనముతో హయిగా జీవిస్తున్న దేశము.

పశుపతినాథ్ దేవాలయము చారిత్రాత్మకముగా లయకర్త అయిన శివుడు, దేశములో ఎక్కువగా పూజించబడే దేవుడు. ఆయనను పార్వతితో కూడి ఉండి, చేతిలో త్రిశూలము మరియు ధమరుక పట్టుకున్నట్లుగా కానీ లేదా ఎక్కువగా పొడుగాటి రాయిలా ఉండి, అతను సృష్టించే శక్తిని సూచించే లింగాకృతిగా కానీ పూజిస్తారు. కాఠ్మండుకు పడమరగా ఉన్న పుణ్యక్షేత్రములో పవిత్ర పశుపతినాథ్ శివలింగము ఉంది. శివుని దేవాలయములలో స్వామికి వాహనముగా పని చేసే నంది విగ్రహమును దేవుని ముందు చూడవచ్చు. నేపాల్ లో ఎక్కువగా పూజలందుకుంటున్న మరొక శివుని రూపము భయం కలిగించే భైరవ రూపము. కొండలు, కోనలలో జరిగే పండుగలలో భైరవునికి సంబంధించిన అనేక విశేషములు ముఖ్య భూమిక పోషిస్తాయి.

విష్ణు, స్థితికారుడుగా ముఖ్యముగా ఈ ప్రపంచమును, అన్ని ప్రాణులను కాపాడవలసిన దేవుడు. ఈయన ఈ భూమిని పదిసార్లు వేరు వేరు అవతారములతో దర్శించాడని నమ్మకము. అందులో ఒక పంది, ఒక తాబేలు, ఒక చేప మరియు ఒక సింహము తల కలిగిన మనిషి, ఆయన యొక్క నాలుగు జంతువుల అవతారములు. దక్షిణ ఆసియాలో ఈయన రెండు మానవ అవతారములలో ఎక్కువగా పూజించబడుతున్నాడు: రామాయణ మహాకావ్య నాయకుడు అయిన రాముడు మరియు దైవత్వం కలిగిన యాదవుడైన కృష్ణుడు. నేపాల్ లో ఈయన తన సర్వశక్తి సంపన్నమైన అవతారము నారాయణుడిగా పూజింపబడుతున్నాడు మరియు కొన్ని అందమైన చిత్రములలో ఆయన తన వాహనము అయిన గరుడుని అధిరోహించి కనిపిస్తాడు.దేవాలయము వరహా వంటి నిర్మాణశైలిలో ఉంటుంది.పగోడకు సంబంధించిన అన్ని లక్షణములు ఇందులో కనిపిస్తున్నాయి.ఉదాహరణకు చెక్కలో మలచబడిన అద్భుత కళాకృతులు వంటివి (టున్డల్). ఇత్తడికి బంగారుపూత పూయబడిన రెండు పై కప్పులు ఉన్నాయి. దీనికి వెండిరేకులతో పై తొడుగు వేయబడిన నాలుగు ముఖ్య ద్వారములు ఉన్నాయి.ఈ దేవాలయములో బంగారు శిఖరము (గజుర్) ఉంది. ఇది మతపరమైన ఆలోచనా విధానమునకు ప్రతీక. పడమర ద్వారము బంగారముతో పూత పూయబడిన పెద్ద నంది విగ్రహమును కలిగి ఉంది. ఈ దేవుడు ఆరు అడుగుల పొడవు మరియు వెడల్పు కలిగిన నల్లరాతి విగ్రహము.

నేపాల్ లో సంప్రదాయ రీతిలో ఉన్న అమ్మ లేదా స్త్రీ దేవత చాలా ముఖ్యమైనది. ఆమె చాలా రకములుగా పూజింపబడుతున్నది. మహిషాసురుని సంహరించిన దుర్గగా, కొండకోనల్లో ఉండేవారి రాజుల ఇలవేలుపు తలేజుగా మరియు కన్యాకుమారిగా పూజించబడుతున్నది. ఇంకా ఇతర స్త్రీ దేవతలలో ధనాధిదేవత అయిన లక్ష్మి, జ్ఞానమునకు మరియు కళలకు అధిదేవత అయిన సరస్వతి ఉన్నారు. ఇంకా ముఖ్యముగా పూజలందుకునే దేవుళ్ళలో విఘ్నములు తొలగించి అదృష్టమును ఇచ్చే గజముఖుడైన వినాయకుడు ఉన్నాడు. ఇంకా ఎర్ర మచ్చింద్రనాథ్ నేపాల్ లోనే ప్రత్యేకము మరియు అక్కడి ప్రత్యేక పండుగలలో పూజింపబడుతాడు.

స్వయంభూనాథ్ బౌద్ధమతమునకు చెందిన అనేక సంప్రదాయములు నేపాల్ లో పాటించబడుతున్నాయి. అవి ఒక వెయ్యి సంవత్సరముల క్రితము భారతదేశము వీడి వెళ్ళిపోయినా ప్రాచీన బౌద్ధమతము, షెర్పాల బౌద్ధమతము, తమంగ్ మరియు టిబెట్ లోని ప్రజల యొక్క కొత్తగా వచ్చిన బౌద్ధమతము మరియు దక్షిణ బౌద్ధమతము వంటివి ఆచరణలో ఉన్నాయి.

బౌద్ధమతము యొక్క నమ్మకములు మరియు ఆచరణ అన్నీ ఆ మత స్థాపకుడైన యువరాజు సిద్ధార్థ గౌతముడి కాలము నాటివి. ఈయన దక్షిణ ప్రాంతపు లుంబినిలో, 534 B.C జన్మించాడు. 29 సంవత్సరముల వయస్సు వరకు ఇతడు తన తండ్రి రాజమహలు గోడల మధ్య, బయటి ప్రపంచపు బాధలు, కష్టములు ఏమాత్రము తెలియకుండానే గడిపాడు. ఒకరోజు అతను తన రథసారథిని ఒప్పించి కోటనుండి బయటకు వెళ్ళాడు. అక్కడ అతను ఒక వృద్ధుని, ఒక వ్యాధిగ్రస్తుని, కుష్టురోగినీ, తపస్వినీ చూసి ఆశ్చర్యపోయాడు. నిజజీవితములోని కష్టముల గురించిన అవగాహన, ఆ రాజకుమారుడు తనకున్న విలాసములను వదిలిపెట్టి ఈ బాధలకు అంతము కనుగొనడానికి కావలసిన నిజమైన జ్ఞానము యొక్క అన్వేషణలో అడవి దారి పట్టేలా పురికొల్పింది. చాలా సంవత్సరముల పాటు గౌతముడు ఫలించని తపస్సు చేసాడు. ఒక రాత్రి బోధగయ లోని ఒక బోధివృక్షము క్రింద అతనికి జ్ఞానోదయము అయింది. అప్పటినుండి, జ్ఞాని అయిన అతడు బుద్ధభగవానుడుగా ఉత్తర భారతదేశము మరియు దక్షిణ నేపాల్ లలో పర్యటించి జ్ఞానోదయమునకు కావాల్సిన మధ్య మార్గమును ప్రవచనము చేసెను. ఎనభై సంవత్సరముల వయసులో అతను శరీరము వదలి, అంతిమంగా అనంత ఆత్మలో కలిసిపోయాడు.

లుంబిని లుంబిని, బుద్ధుడు, జ్ఞాని అయిన సిద్ధార్థ గౌతమ్ (గౌతమ బుద్ధుడు) ని జన్మస్థలము. ఇతను శఖ్య రాజకుమారుడు మరియు ఆ తరువాత బుద్ధుడు, జ్ఞాని.ఇది ప్రపంచ వ్యాప్తముగా బౌద్ధమతము యొక్క అన్ని శాఖలకు చెందిన మిలియన్ల ప్రజలకు పుణ్యక్షేత్రము. యునెస్కో వారి సైట్ లో, భారతీయ చక్రవర్తి అయిన అశోకుని జ్ఞాపకస్తంభమును ప్రపంచ వారసత్వసంపదగా ప్రకటించారు.

లుంబినిలో 8 చదరపు కిలోమీటర్లు వ్యాపించిన ఈ చారిత్రాత్మక స్థలమునకు సంబంధించిన అన్ని నిధులు దాచి ఉన్న పవిత్రమైన వనము ముఖ్యమైన ఆకర్షణ. అలాగే యాత్రికులకు మరియు పురాతత్వవేత్తలకు మాయాదేవి యొక్క దేవాలయము కూడా ఒక ప్రధాన ఆకర్షణ. ఇక్కడ బుద్ధుని తల్లి అతనికి జన్మనిస్తూ ఉన్నట్లుగా ఉంది. ఆమెకు ప్రక్కగా నేపాల్ యొక్క అతి ప్రాచీన గుర్తు అయిన అశోకుని స్తూపము ఉంది. అశోక చక్రవర్తి ఈ స్తూపమును 249BC లో ఈ పుణ్యక్షేత్రమునకు తన గౌరవమును ప్రకటిస్తూ స్థాపించాడు. దీనికి దక్షిణ దిశలో మనము పవిత్ర కోనేరు, పుష్కరిణిని చూడవచ్చు. ఇక్కడ మాయాదేవి బుద్ధునికి జన్మనివ్వడానికి కొంచెం ముందు స్నానము చేసింది.

దగ్గరలో ఇంకా కొన్ని చూడవలసిన ప్రదేశములు కూడా ఉన్నాయి. విమానము ద్వారా కాఠ్మండు నుంచి భైరవా వరకు ప్రయాణించవచ్చు. కాఠ్మండు నుండి బస్సులో లేదా కారులో దాదాపుగా ఎనిమిది గంటలు పడుతుంది.

ముక్తినాథ్ ఈ దేవాలయ దర్శనముతో కష్టములు/బాధలు అన్నీ తొలగిపోతాయని నమ్మకము. (ముక్తి=నిర్వాణము, నాథ్=దేవుడు). ముక్తినాథ్ యొక్క ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రము ముస్తంగ్ జిల్లాలో, జామ్సానికి 18 కిలోమీటర్లలలో తూర్పు, దక్షిణదిశగా, దాదాపు 3,749మీటర్ల ఎత్తులో నెలకొని ఉంది. ముఖ్య దేవాలయము వరహా ఆకారములో ఉన్న వైష్ణవ ఆలయము. గోడల్లోంచి 108 పుణ్యతీర్థ జలధారలు వస్తుంటాయి. ఈ దేవాలయము ఎత్తైన కొండపైన నెలకొని ఉంది, అందువలన వాతావరణము అనుకూలముగా ఉన్నప్పుడు మాత్రమే దర్శనీయముగా ఉంటుంది. కాఠ్మండు నుంచి ముక్తినాథ్ కు వెళ్ళడానికి రెండు మార్గములు ఉన్నాయి. ఒకటి, విమానములో కాఠ్మండులో బయలుదేరి, పోఖరా గుండా జామ్సం చేరి, అక్కడి నుంచి కాగ్బెని ద్వారా ఏడు నుండి ఎనిమిది గంటల నడక ద్వారా చేరుకోవచ్చు. లేదంటే, పోఖరా నుంచి మొత్తము నడచి వెళ్లడము, ఇది ఏడు నుంచి ఎనిమిది రోజులు పడుతుంది. నాలుగు ధామముల యాత్ర పూర్తి చేసిన తరువాత ఈ యాత్ర చేయవలెనని నమ్ముతారు. ఈ దేవాలయ పవిత్రతను హిందువులు, బౌద్ధమతస్థులు కూడా విశ్వసిస్తారు. దగ్గరలో ఉన్న జ్వాలామాత మందిరములో భూగర్భంలోని సహజ వాయువుల వలన నిత్యమూ వెలుగుతున్న ఒక జ్యోతి ఉంది. అన్నపూర్ణ ప్రాంతములో, జామ్సమ్ ఒక మంచి కూడలి. ఇక్కడ ప్రపంచస్థాయి వసతి సౌకర్యాలు కలవు, వీటి ద్వారా ఎవరైనా ఈ ప్రకృతి సౌందర్యమును చక్కగా ఆస్వాదించవచ్చు.

గోసిన్ కుండ నేపాల్ లోని ప్రఖ్యాత దర్శనీయ స్థలములలో గోసిన్ కుండ సరస్సు కూడా ఒకటి. ఇది 4,36మీటర్ల ఎత్తులో నెలకొని ఉంది. కాఠ్మండుకు తూర్పు, దక్షిణముగా 132 కిలోమీటర్ల దూరములో ఉన్న ధుంచే నుండి ఇక్కడికి వెళ్లడము సరైన మార్గము. కాఠ్మండు మరియు ధుంచేలు మంచి రోడ్డు ద్వారా కలపబడి ఉన్నాయి. ఉత్తర మరియు దక్షిణ దిశలలో ఎత్తైన కొండలు కలిగిన ఈ సరస్సు గొప్పది మరియు చక్కటి అలంకారము కలిగినది. ఇంకా సరస్వతి, భైరవ్, శౌర్య, గణేష్ కుండ మొదలైన తొమ్మిది చక్కటి సరస్సులు ఉన్నాయి.

దేవ్ ఘాట్ దేవ్ ఘాట్ అనేది కాళి గండకి మరియు త్రిశులి నదుల సంగమములో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. అది చిట్వన్ జాతీయ వనమునకు ఉత్తరముగా ఉంది. జనవరిలోని మకర సంక్రాంతి అప్పుడు, ఈ నదులలో పుణ్య స్నానము ఆచరించడానికి ప్రజలు వస్తారు. ఈ దేవ్ ఘాట్ చుట్టూ ఎన్నో ప్రవిత్ర మరియు చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశములు ఉన్నాయి. అవి ఎంతో ఆనందమును కలిగిస్తాయి: త్రివేణి దేవాలయము మరియు బాల్మికి ఆశ్రమము ఉన్నాయి. ఇక్కడే బాల్మికి గొప్ప తపస్విగా మారిపోయారు. మహాభారతంలోని ముఖ్య పాత్రలు అయిన పాండవులు ఒకప్పుడు కబిలస్పూర్ లో వారి పెద్దవారైన పాలకులచే నిర్ణయించబడిన కోటలో ఒకప్పుడు కొంతకాలము ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సోమేశ్వర్ కాళిక దేవాలము మరియు కోట ఉన్నాయి.

మనోకామనా ఈ దేవాలయము 3900 అడుగుల ఎత్తులో ఉండి, గణేషుడు, మనసులు మరియు అన్నపూర్ణల సమూహము యొక్క అద్భుత దృశ్యమును చూపిస్తుంది. ప్రక్కన ఉన్న చిన్న పల్లె 20వ శతాబ్దపు నేపాలి రాళ్ళ గుట్ట మరియు రెండవ ప్రపంచ యుద్ద ఫలితాల కలయిక. ప్రతిరోజూ వందలమంది మనోకామనా భగవతి దేవాలయమునకు దర్శనమునకు వస్తుంటారు. జూలై చివరలో కానీ లేదా ఆగస్టు మొదటిలో కానీ నాగపంచమి అప్పుడు, పెద్ద పూజారులు దేవతామూర్తిని పూర్తిగా పూలతోనే చేస్తారు. మనోకామనా దేవాలయమును దర్శించటం అనేది ప్రతీ నేపాలి తప్పకుండా చేసే పని. మీరు ఒక గొర్రెను బలి ఇవ్వనప్పటికీ, వారి సంఘములోకి మిమల్ని ఆహ్వానించినట్లుగానే మీకు అనిపిస్తుంది.

పతిభర (1763 మీటర్లు) పతిభర కుటిదండ పై ఉంది మరియు మేచి హైవే మీది హాస్పోఖారి ల పై ఉన్న దానిని చిన్న పతిభర అని అంటారు. ఈమే పతిభర యొక్క చిన్న చెల్లెలు అని తపెల్ జంగ్ లో అంటుంటారు. ఈ పచ్చని అడవి నిండిన కొండ నుండి ఎవరైనా తెరైన్ మైదానములు, మహాభారత రేంజ్ మరియు కాంచనగంగ శిఖరములను చక్కగా దర్శించవచ్చు. ఈ స్థలము రవాణాసదుపాయములు కలిగి ఉండి, గ్లైడింగ్ చేయాలనుకునే వారికీ వీలుగా ఉంది. వేలమంది ప్రజలు పతిభరా దేవతకు రోజూ పూజలు చేస్తుంటారు.

జలేశ్వర్ మహాదేవ్ ఈ జలేశ్వర్ దేవాయలము జనక్పూర్ జోన్ యొక్క ముఖ్య పట్టణము అయిన జలేశ్వర్ లో ఉంది. జలేశ్వర్ మహాదేవ్ నేపాల్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రములలో ఒకటి. దీని గురించిన ప్రస్తావన పద్మ పురాణములో ఉంది.

స్థలపురాణము ప్రకారము, జగదీష్ అనబడే ఒక ఏకాకి అయిన వ్యక్తి, ఈ జలేశ్వర్ అడవిలోకి వచ్చాడు. అతనికి కలలో ఆ ప్రదేశములో త్రవ్వకములు జరపమని ఆదేశము వచ్చింది. అదే ప్రకారము అతను త్రవ్వకము జరుపగా అతనికి జలేశ్వర్ మహాదేవుని విగ్రహము దొరికింది. అతను తాను సునుఖదగర్హ్ అనే ప్రదేశము నుండి తెచ్చిన కొంత బంగారముతో అక్కడ ఒక దేవాలయము నిర్మించాడు.

జలేశ్వర్ మహాదేవ్ దేవాలయము ముందు రెండు పవిత్ర తీర్ధములు ఉన్నాయి, వాటిని బారున్సర్ మరియు క్షీరేసర్ అని అంటారు. రామనవమి మరియు వివాహ పంచమి పండుగల సమయములో వేలమంది భక్తులు ఈ తీర్ధ స్నానం ఆచరిస్తారు.

డోలఖ భీమ్ సేన్ డోలఖ భీమ్ సేన్ గా పిలవబడే ఈ దేవాలయము, డోలఖ అనే ఉరిలో పై భాగములో ఉన్న భీమేశ్వరుని మందిరము. డోలఖ లోని ప్రజలు భీమేశ్వరుని అద్వితీయమైన భగవంతునిగా భావిస్తారు. ఈ మందిరమునకు పై కప్పు ఉండదు. ఒక శివలింగము, దాని క్రింద పవిత్ర తీర్ధము ఉన్నాయి. బాల చతుర్దశి, రామనవమి, చైత్ర అష్టమి మరియు భీష్మ ఏకాదశి వంటి పండుగల సమయములో జాతర జరుగుతుంది. దశమి పండుగ అప్పుడు గొర్రెలు బలి ఇస్తారు.

భీమేశ్వర్ మందిరము నుండి దాదాపు 200 ల మీటర్ల దూరములో త్రిపురసుందరి అమ్మవారి దేవాలయము ఉంది. ఇక్కడ భక్తులు చైత్ర అష్టమి మరియు దశమి వంటి పండుగల అప్పుడు వస్తుంటారు. లోపలి మూలవిగ్రహమును కేవలము పూజారికి మాత్రమే చూడవచ్చు.

స్వర్గద్వారి పైథాన్ (రప్తి జోన్) జిల్లా లోని పడమర భాగములో హిందూ పుణ్యక్షేత్రమైన స్వర్గద్వారి ఉంది. పైథాన్ జిల్లా యొక్క ముఖ్య పట్టణమైన ఖలంగా బాజార్ కు దక్షిణములో దాదాపు 26 కిలోమీటర్ల దూరములో స్వర్గద్వారి ఉంది. వైశాఖ పూర్ణిమ మరియు కార్తిక పూర్ణిమ వంటి పండుగల సమయములో, నేపాల్ మరియు భారతదేశముల నుంచి భక్తులు పూజల నిమిత్తము ఇక్కడకు వస్తుంటారు.

ముఖ్యమైన ట్రెక్కింగ్ ప్రాంతములు (http://www.nepalhiking.com/destinations/nepal/activities/trekking-in-nepal)

1. ఎవరెస్ట్ ప్రాంతము - ప్రపంచము యొక్క ఆత్మ

నేపాల్ యొక్క విభిన్న సంస్కృతుల మరియు ప్రపంచములోని ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ (29035 ft/8848m) శిఖరముతో సహా అత్యద్భుత పర్వత పంక్తుల పరిచయమునకు ఈ అసాధారణ ఆకర్షణ కలిగిన గమ్యము అనువైనది. ఎవరెస్ట్ ప్రాంతములో సెలవులు గడపటానికి వెళితే, అందులోనే మంచుతో బాగా కప్పబడిన హిమాలయముల దర్శనము మరియు కొన్ని మంచి షెర్పా పల్లెలను చూస్తూ సాగే అందమైన, స్ఫూర్తి ప్రదాయకమైన ప్రయాణము మరియు ప్రాచీన బౌద్ధరామములు వంటి వాటిని చూడగలగడము, ఇంకా చూపు తిప్పుకోనివ్వని శిఖరములు మీరా (21247 ft/6476m), ఐలాండ్ ( (20285 ft/6183m), పోకల్డే ( (19049 ft/5806m) శిఖరము మరియు ఇంకా మరెన్నో చూడవచ్చును.

2. అన్నపూర్ణ ప్రాంతము – జీవితానుభావము కాగలిగిన ప్రయాణము నేపాల్ లో ప్రపంచ ప్రసిద్దమైన ట్రెక్కింగ్ ప్రదేశము అన్నపూర్ణ ప్రాంతము. ఇక్కడ మూడు ముఖ్యమైన ట్రెక్కింగ్ త్రోవలు ఉన్నాయి. ఇవి ఉత్తరముగా నేపాల్ మధ్యలోకి వచ్చేలా ఉంటాయి. అవి : జామ్సం, అన్నపూర్ణ సాన్క్యుచురి, మరియు అన్నపూర్ణ ప్రాంతమే వలయములా ఉంటుంది. ఇక్కడి విభిన్న సంప్రదాయములు, ప్రజలు, భూ ప్రాంతము దీనిని మంచి ట్రెక్కింగ్ ప్రదేశముగా చేసాయి. మీరు అద్భుతమైన పర్వతముల అందములు చూడగలరు, అందులో ధులగిరి (8167m), అన్నపూర్ణ (8091m), మనస్లు (8156m), లమ్జంగ్ హిమాల్ (6983m), మంచాపుచ్చారే (6993m), టుకుచే శిఖరము (6920m), టిలిచో శిఖరము (7134m), నీలగిరి (6940m) లు కష్టమైన సంస్కృతీ మరియు సంప్రదాయముల మేళవింపు కలిగి ఉన్నాయి. అన్నపూర్ణ మరియు ధులగిరి ల మధ్యగా వెళుతున్న కాళిగండకి ప్రపంచములోనే లోతైనది. హిందువుల నుండి బౌద్ధుల వరకు, ఆర్యుల నుండి మంగోలుల వరకు, గొప్ప గోర్ఖా సైనికులు, పల్లెలు, లోయలు, బాగా వర్షము పడే ప్రాంతములు, నేపాల్ లోని వర్షము పడనివ్వని ప్రాంతములు ఇలా అన్నీ పూర్తిగా విభిన్నముగా ఉండే విషయములు, మీ నడకను ఒక ప్రత్యేక అనుభవముగా చేస్తాయి. ఈ మధ్య మోడర్న్ మెచ్యూరిటీ (యూయస్ఏ) వారు చేసిన సర్వే ప్రకారము, ఈ ప్రాంతము ప్రపంచములోనే అత్యద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతముగా గుర్తించబడింది. పోఖరా " ది సిటీ అఫ్ లేక్స్" ఈ అన్నపూర్ణ ప్రాంతములో ట్రెక్కింగ్ మొదలు పెట్టే ప్రాంతము కానీ, లేదా ముగించే ప్రాంతము కానీ అవుతుంది. సహజ సౌందర్యముతో, చిత్రవిచిత్రముగా కనిపించే ఈ పట్టణము 3000 అడుగుల ఎత్తులో, గొప్ప హిమాలయ పర్వతముల ఒడిలో ఉంది. పర్యాటకులకు స్వర్గదామము అయిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. కాఠ్మండు లోయ నుండి ఇది కేవలము 200 కిలోమీటర్ల దూరములో ఉంది. ఇక్కడకు రోడ్డు మార్గము ద్వారా కానీ లేదా విమానములో కానీ తేలికగా చేరుకోవచ్చు.

3. లంగ్ టంగ్ ప్రాంతము – ఆశ్చర్యపరిచే ప్రకృతిని తిలకించడానికి సరైన ప్రదేశము!

ఇది మరొక అత్యంత ప్రత్యేకమైన ట్రెక్కింగ్ స్థానము. ఇది ఉత్తర కాఠ్మండులో, హిమాలయముల మధ్యలో, టిబెటన్ సరిహద్దు పై, మరియు తేలికగా చేరుకునేలా ఉంది. ఈ ప్రదేశము ఎన్నో రకముల మొక్కలకు మరియు హిమాలయముల రెడ్ పాండాతో సహా ఎన్నో రకముల జాతులకు చెందిన జంతువులకు, ఆలవాలముగా ఉంది. పికా, దుప్పి, హిమాలయముల నల్ల ఎలుగుబంటి మొదలైనవి ఇక్కడ ఉన్నాయి. ప్రపంచములోని అన్ని ప్రాంతాల యాత్రికులకు ఇది ఒక చక్కటి సెలవుల విడిదిగా పేరుగాంచింది. ఉత్తర కాఠ్మండులో ఉన్న హేలంబు, అద్భుతమైన షెర్పా మరియు తమంగ్ పల్లెలతో ట్రెక్కింగ్ కు చాలా చాలా అనువుగా ఉంటుంది. గోసాయికుండ అనేది ఒక చక్కటి సరస్సు. ఇది తనతో పాటుగా ఉన్న ఇతర చక్కటి సరస్సులతో సహా పేరు పొందినది.

నేపాల్ లో చూడదగిన ప్రదేశములు ఇదివరకు నేపాల్ దేశం ప్రపంచంలో వున్న ఏకైక హిందు దేశం. ఈ మధ్యన ఇది ప్రజాస్వామిక దేశంగా ఏర్పాటయినది.